Web Series in 2023: వెబ్ సిరీస్ లో దుమ్ము రేపిన స్టార్ హీరోస్.
ఒకప్పుడు వెబ్ సీరీస్ కి(Web Series) అంతగా ఆదరణ ఉండేది కాదు అన్నది నిజం, వెబ్ సీరీస్ అంటే సినిమాల్లోకి(Movies) రావాలనుకునే ఔత్సాహిక దర్శకులు(Directors) నటీనటులకు(Actors) అదొక వేదిక అన్నట్టు ఉండేది, కానీ కరోనా(Corona) తరువాత వెబ్ సీరీస్ కి కూడా గిరాకీ పెరిగిపోయింది.
పైగా వెబ్ సీరీస్ కి ఉన్న సౌలభ్యం ఏమిటంటే, ఎంత నిడివి ఉన్న స్టోరీ అయినా పర్లేదు, ఎడిటింగ్(Editing) కత్తెర బారిన పడకుండా చిత్రీకరించుకున్న ప్రతి సీన్ ను ప్రేక్షకులకు చూపెట్టేయొచ్చు. ప్రస్తుతం తెలుగు సినిమాలో స్టార్ హోదా కలిగిన వారు కూడా వెబ్ సీరీస్ లో నటిస్తున్నారు.
కానీ బాలీవుడ్ నటులు(Bollywood Actors) మనకన్నా ఒకడుగు ముందే ఉన్నారు. అక్కడ స్టార్ హీరో హీరోయిన్లు(Star Hero’s And Heroines) సైతం వెబ్ సీరీస్ లో నటిస్తూ మెప్పించారు.
అయితే తెలుగులో 2023 సంవత్సరానికి సంబంధించి బాగా పాపులర్ అయిన వెబ్ సీరీస్ ఏంటి ? వాటిలో నటీనటులు ఎవరు ? అవి ఎంతమేర ప్రజాదరణ పొందాయి అన్నది చూద్దాం.
01 రానా నాయుడు :
Rana Naidu : విక్టరీ Venkatesh, Rana Daggupaati ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సీరీస్ రానా నాయుడు, వెండి తెరమీద తప్ప ఎప్పుడు వెబ్ సీరీస్ లో కనిపించని వెంకటేష్ మొదటిసారిగా రానా నాయుడు కోసం వెబ్ సీరీస్ చేశారు.
అంతే కాదు ఎప్పుడు ఫ్యామిలీ హీరోగా, పద్దతిగా కనిపించే వెంకీ ఈ సినిమా కోసం బూతు పురాణం కూడా అందుకున్నారు. ఇక రానా అయితే ముద్దు సన్నివేశాలు బెడ్ రూమ్ సీన్స్ లో రెచ్చిపోయి నటించాడు.
ఇక ఈ సినిమా లో కేవలం రానా మాత్రమే కాదు ఇతర నటీనటులు కూడా చాల బోల్డ్ గా నటించారు. ఈ విషయాన్నీ పక్కనపెడితే ఇది తండ్రి కొడుకుల మధ్య నడిచే కథ.
తండ్రి అంటే ఏ మాత్రం ఇష్టం లేని కొడుకుగా రానా కనిపిస్తాడు. ఈ సినిమాలో రానా సరసన సుర్విన్ చావ్లా(Survin Chawla), ప్రియా బెనర్జీ(Priya Benarji) నటించారు.
అటు రాణా ను ఇటు వెంకీ ని ఈ కోణంలో చూసేందుకు చాల మంది ఆశక్తి చూపించారు, కాబట్టే ఇది భారతదేశ వ్యాప్తంగా ఎక్కువ సార్లు ఎక్కువ మంది వీక్షించిన వెబ్ సీరీస్ లో ఒకటిగా నిలిచింది.
02 కుమారి శ్రీమతి:
కధానాయిక నిత్యా మీనన్ (NItya Menon) టైటిల్ రోల్ లో కనిపించిన ఈ వెబ్ సీరీస్ నవ్విస్తూనే ఆలోచింపజేస్తూ ఉంటుంది. ఈ వెబ్ సీరీస్ లో కార్తీక దీపం (Kaartika Deepam) ఫేమ్ నీరుపం పరిటాల (Nirupam Paritala) కీ రోల్ ప్లే చేశాడు.
ఒక రకంగా చెప్పాలంటే హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా లో హరోయిన్ పక్కన హీరో గా చేశాడు. బిజినెస్ చేసి మంచి పేరు బాగా డబ్బు సంపాదించుకోవాలని కష్టపడే యువతి పాత్రలో నిత్యా మీనన్ కనిపిస్తుంది,
ఇది ఇలా ఉంటె మరోవైపు తన పినతండ్రి వారికి రావలసిన ఆస్తిని ఇవ్వకుండా ఆమెను కోర్టు చుట్టూ తిప్పుతూ ఉంటాడు.
అయితే తన తల్లి నానమ్మకి మాత్రం నిత్యాకి పెళ్లి చెసి కాపురానికి పంపాలని ఉంటుంది. నిత్యా నాయనమ్మ క్యారెక్టర్ ను సీనియర్ నటి తాళ్లూరి రామేశ్వరి పోషించగా తల్లి పాత్రలో గౌతమీ నటించింది. ఈ వెబ్ సీరీస్ కూడా మంచి ప్రేక్షకాదరణ పొందింది. ఇది అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది.
03 సైతాన్ Saithan :
సైతాన్ అనేది క్రైమ్ బేస్డ్ వెబ్ సీరీస్, అటు రాజకీయం ఇటు క్రైమ్ రెండు కలగలిపి ఉంటాయి ఈ సీరీస్ లో ఈ సీరీస్ ను యాత్ర (Yatra) మూవీ ఫేమ్ మహి వి రాఘవ డైరెక్ట్ చేశాడు.
ఇందులో రిషి ప్రధాన పాత్రను పోషించగా అతని చెల్లెలి పాత్రను సేవ్ ది టైగెర్స్ ఫేం దేవయాని చేసింది. అతని తమ్ముడు గుంతి పాత్రను జఫర్ సాధిక్ చేశాడు. ఈ సినిమాలో కూడా బూతులు యధావిధిగా వాడేశారు.
సెన్సార్ కట్స్ ఉండకపోవడం ఈ వెబ్ సీరీస్ కి పెద్ద ప్లస్ పాయింట్ అయింది. ఇక ఇందులో కొంత అడల్ట్ కంటెంట్ ఉండటం పైగా క్రైమ్ బేస్డ్ స్టోరీ కావడంతో దీనిని యువత, మాస్ ఆడియన్స్ ఎక్కువగా చూసినట్టు తెలుస్తోంది. ఇది డిస్నీ హాట్ స్టార్ లో విడుదలైంది.
04 దూత (Dhoota) :
అక్కినేని వారి హీరో నాగ చైతన్య(Naga chaitanya) కూడా వెబ్ సీరీస్ బాట పట్టాడు. తన మేనమామ విక్టరీ వెంకటేష్, దగ్గుపాటి రాణా మాదిరిగా చై కూడా వెబ్ సిరీస్ చేసి బంపర్ హిట్ ఇచ్చాడు.
ఇది సస్పెన్స్ త్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన వెబ్ సీరీస్. అసలు ఇది ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. కారణాలు వెల్లడించకపోయినప్పటికీ అమెజాన్(Amazon) ఈ ఏడాది డిసెంబర్ నెలలో విడుదల చేసింది.
మొదటి సినిమా చైతు కి ఎంత మేర కలిసొచ్చింది అన్నది చెప్పలేము కానీ మొదటి వెబ్ సీరీస్ మాత్రం బాగా నే కలిసొచ్చింది.
వెండి తెరపై ఈ మధ్య కాలంలో హిట్టు దక్కకపోయినా డిజిటల్ మీడియాలో చైతు గట్టిగానే హిట్టు కొట్టాడు. ఈ సినిమాను మనం ఫేమ్ విక్రమ్ కె కుమార్(Vikram K Kumar) తెరకెక్కించాడు. ఇది అమెజాన్ ప్రైమ్ లో ట్రీమింగ్ అవుతోంది.
05 మాన్షన్ 24(Mansion 24) :
ఇది ఓంకార్(Omkar) దర్శకత్వంలో వచ్చిన వెబ్ సీరీస్, ఇప్పటివరకు సినిమాలను రూపొందించిన ఓంకార్ మొదటిసారిగా వెబ్ సీరీస్ ను తెరకెక్కించాడు.
ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్(Varalakshmi Sharath kumar), అవికా గోర్(Avika Gor), రావు రమేష్(Rao Ramesh), సత్య రాజ్(Satya Raj),
అభినయ(Abhinaya), బిందు మాధవి(BinduMadhavi), అమర్ దీప్ చౌదరి(Amardeep Chowdary), రాజీవ్ కనకాల(Rajeev Kanakala), శ్రీమాన్(Srimaan), మానస్ నాగులపల్లి(manas Nagulapalli) తదితరులు నటించారు. ఇది హారర్ కామెడీ జోనర్ లో తెరకెక్కించారు.
హారర్ చిత్రాలకు మార్కెట్ లో డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది, కథ కధనాలు చక్కగా సమకూర్చుకుంటే హిట్టు కొట్టడం పక్కా అని చాలా సినిమాలు నిరూపించుకున్నాయి.
మాన్షన్ 24 ను చక్కగా ఎంజాయ్ చేయొచ్చు కానీ విపరీతంగా భయపడేలా ఉండాలి అనుకునే వారికి ఇది సరైన ఎంపిక కాదు. దీనిని దసరా సెలవుల్లో చాలామంది ఎంజాయ్ చేశారు.
06 సేవ్ ది టైగర్స్ (Save The Tigers) :
ప్రియదర్శి(Priyadarsi) , అభినవ్ గోమఠం(Abhinav Gomatham), చైతన్య కృష్ణ, జోర్దార్ సుజాత(Jordar Sujatha), పావని గంగిరెడ్డి, సైతాన్ ఫేమ్ దేవయాని ప్రధాన పాత్రధారులు,
ఇది పూర్తి స్థాయి హాస్య భరిత నేపధ్యం తో తెరకెక్కిన వెబ్ సీరీస్, భార్య భర్తల మధ్య నడిచే హాస్య భరిత సన్నివేశాలు ప్రేక్షకులను విపరీతం గా ఆకట్టుకున్నాయి.
ఇందులో జబర్దస్త్ ఫేమ్ రోహిణి(Rohini), గంగవ్వ(Gangavva) కీలక పాత్రలో కనిపిస్తారు. ఈ వెబ్ సీరీస్ డిస్ని హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది, దీనికి రెండవ సీజన్ కూడా ప్లాన్ చేస్తున్నారు.
ఈ వెబ్ సీరీస్ కి తేజ కాకుమాను(Teja Kakumanu) దర్శకత్వం వహించాడు. ఈ వెబ్ సీరీస్ లో జోర్దార్ సుజాత సంభాషణలు ఎక్కువగా ఆకట్టుకోగా, పనిమనిషిగా రోహిణి యజమానిగా అభినవ్ గోమఠం టైమింగ్ అదిరిపోతోంది అని చెప్పాలి.
07 యాంగర్ టేల్స్ (Anger Tales) :
కొన్ని సంఘటనల కారణంగా 4 వ్యక్తులు విపరీతమైన కోపం ఉన్న వారీగా మారిపోతారు. ఆ నలుగురు వ్యక్తుల చుట్టూ అల్లుకున్న కథే యాంగర్ టేల్స్.
ఇలాంటి క్యారెక్టర్స్ ను కరెక్ట్ గా క్లియర్ గా చూపించాలి అంటే దర్శకుడికి వెబ్ సీరీస్ ఓకే చక్కని ఎంపిక. ఈ సీరీస్ లో వెంకటేష్ మహా(Venkatesh Maha), సుహాస్,
రవీంద్ర విజయ్, బిందు మాధవి(Bindu Madhavi), ఫణి ఆచార్య, తరుణ్ భాస్కర్(TarunBhaskar), మడోన్నా సెబాస్టియన్ ప్రధాన పాత్రల్లో కనిపించారు.
ఈ సీరీస్ లో కనిపించేవారు మొత్తం అనుభవం ఉన్న నటీనటులే కాబట్టి సన్నివేశాలను చక్కగా రక్తి కట్టించారు. ప్రాత్రల తాలూకు భావోద్వేగాలను పలికించడంలో సఫలీకృతం అయ్యారు.
తెలుగు లో ఇటువంటి వెబ్ సీరిస్ అస్సలు రాలేదు అని చెప్పలేము కానీ, ఇటువంటివి అరుదుగా వస్తుంటాయి అని చెప్పొచ్చు. ఇది డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది.
ఒకప్పుడు వెబ్ సీరీస్ కి(Web Series) అంతగా ఆదరణ ఉండేది కాదు అన్నది నిజం, వెబ్ సీరీస్ అంటే సినిమాల్లోకి(Movies) రావాలనుకునే ఔత్సాహిక దర్శకులు(Directors) నటీనటులకు(Actors) అదొక వేదిక అన్నట్టు ఉండేది,
కానీ కరోనా(Corona) తరువాత వెబ్ సీరీస్ కి కూడా గిరాకీ పెరిగిపోయింది. పైగా వెబ్ సీరీస్ కి ఉన్న సౌలభ్యం ఏమిటంటే, ఎంత నిడివి ఉన్న స్టోరీ అయినా పర్లేదు, ఎడిటింగ్(Editing) కత్తెర బారిన పడకుండా
చిత్రీకరించుకున్న ప్రతి సీన్ ను ప్రేక్షకులకు చూపెట్టేయొచ్చు. ప్రస్తుతం తెలుగు సినిమాలో స్టార్ హోదా కలిగిన వారు కూడా వెబ్ సీరీస్ లో నటిస్తున్నారు.
కానీ బాలీవుడ్ నటులు(Bollywood Actors) మనకన్నా ఒకడుగు ముందే ఉన్నారు. అక్కడ స్టార్ హీరో హీరోయిన్లు(Star Hero’s And Heroines) సైతం వెబ్ సీరీస్ లో నటిస్తూ మెప్పించారు.
అయితే తెలుగులో 2023 సంవత్సరానికి సంబంధించి బాగా పాపులర్ అయిన వెబ్ సీరీస్ ఏంటి ? వాటిలో నటీనటులు ఎవరు ? అవి ఎంతమేర ప్రజాదరణ పొందాయి అన్నది చూద్దాం.
08 పులి మేక(Puli Meka) :
ఇది ఒక క్రైమ్ త్రిల్లర్ సీరీస్, అంతే కాదు ఇది నాయికా ప్రాధాన్యం ఉన్న సీరీస్, లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో కనిపిస్తుంది. పైగా డైరెక్టర్ కే చక్రవర్తి రెడ్డి(Chakravarti Reddy) లావణ్య తో పోరాటాలు కూడా చేయించాడు.
ఈ సీరిస్ లో ఆది సాయి కుమార్(Adi Sai Kumar), సీనియర్ నటుడు సుమన్(Suman), రాజా చెంబోలు, సిరి హనుమంత, నోయెల్(Noel) ముఖ్య పాత్రలు పోషించారు.
సాధారణంగా ఇటువంటి కథలను సినిమాలుగానే తెరకెక్కిస్తారు. హీరోలతో సమానంగా హీరోయిన్స్ ఫైట్స్ చేస్తుంటే ఆడియన్స్ ఎంజాయ్ చేసిన సినిమాలు ఎన్నో ఉన్నాయి.
అలా ఫైట్స్ చేసిన నాయికల జాబితాలోకి లావణ్య త్రిపాఠి కూడా చేరిపోయింది. ఈ సీరీస్ కి కిలారు వెంకటేష్ కథను అందించాడు. 8 ఎపిసోడ్ల తో ప్రేక్షకుల నుండుకి వచ్చిన ఈ సీరీస్ ను రచయిత కోన వెంకట్, కోన శ్రావ్య నిర్మించారు. ఇది జీ 5 లో రిలీజ్ అయింది.
09 దయ (Daya) :
జేడీ చక్రవర్తి(JD Chakravarti) ప్రధాన పాత్రలో కనిపించే వెబ్ సీరీస్ దయ, ఇది క్రైమ్ త్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కింది. పవన్ సాదినేని(Pavan Sadineni) దర్శకత్వంలో రూపొందిన ఈ సీరీస్ కి మంచి పేరొచ్చింది.
ఇందులో ఈషా రెబ్బ(Esha Rebba), రమ్య నంబీశన్, బబ్లూ పృథ్వీ రాజ్, కమల్ కామరాజు(kamal Kamaraj), జోష్ రవి(Josh Ravi) కీలక పాత్రల్లో కనిపిస్తారు. క్రైం త్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కే వెబ్ సీరీస్ ఇప్పటికే హిందీ ఇంగ్లిష్ భాషలో ఎంకామ్ వచ్చాయి.
వాటి ప్రేరణ తోనే ఇలాంటి సీరీస్ తెలుగులో కూడా వచ్చిందని చెప్పొచ్చు. ఇందులో చక్రవర్తి ఫ్రీజర్ వ్యాన్ డ్రైవర్ గా కనిపిస్తాడు. అతని వ్యాన్ లో మృతదేహం కనిపిస్తుంది.
అక్కడి నుండి హీరో అతని స్నేహితుడి ఎన్ని పాట్లు పడ్డారు, ఆహత్య చేసింది ఎవరు, ఆ డెడ్ బాడీ వ్యాన్ లోకి ఎలా వచ్చింది అనే అంశాల చుట్టూ కథ నడుస్తుంది. ఈ సీరిస్ 8 భాగాలుగా తెరకెక్కింది. ఇది డిస్ని హాట్ స్టార్ లో విడుదలైంది.
10 . న్యూసెన్స్ (Newsence):
ఇది ఒక త్రిల్లర్ నేపధ్యం తో తెరకెక్కించిన వెబ్ సిరీస్, నవదీప్(Navadeep) బిందు మాధవి(Bindu Madhavi) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సీరీస్ లో నవదీప్ న్యూస్ రిపోర్టర్ గా కనిపిస్తాడు, కథ మొత్తం
మదనపల్లె(Madanapalle) చుట్టూ తిరుగుతున్నట్టు ఉంటుంది. అక్కడి రాజకీయ అంశాలను ఆధారంగా చేసుకునే దర్శకుడు కథను అల్లుకున్నాడు.
రెండు పొలిటికల్ గ్రూపుల తగాదాల నేపథ్యంలో జరిగే నేరాలను వెలికి తీసే విలేఖరిపాత్ర లో నవదీప్ ఒదిగిపోయాడు. ఇక ఇందులో పాత్రలు అచ్చమైన చిత్తూరు యాసలో మాట్లాడతాయి.
బిందు మాధవి పుట్టిందే మదనపల్లె లో, అయితే అదే మదనపల్లెలో తెరకెక్కిన సీరిస్ లో తాను నటించడం విశేషం. శ్రీ ప్రవీణ్(Sri Praveen) దర్శకత్వం వహించిన ఈ సీరీస్ కి సురేష్ బొబ్బిలి సబ్గీతాన్ని అందించాడు. ఇది ఆహా తెలుగు లో విడుదలైంది.
- అతిధి (Atidhi):
- చాలా గాప్ తరవాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన హీరో వేణు తొట్టెంపూడి(Venu Thottempudi) ఈ ఏడాది వెబ్ సీరీస్ లో కూడా కనిపించాడు. అదే అతిధి.
- ఇది పూర్తి స్థాయి హారర్ బేస్డ్ వెబ్ సీరీస్, ప్రేక్షకులను భయపెట్టే సన్నివేశాలతో సిరీస్ ను రూపొందించాడు దర్శకుడు వై జి భారత్(YG Bharath),
- ఈ సీరీస్ కి కథను కూడా తనే సమకూర్చుకున్నాడు. ఈ సిరీస్ లో హీరో వేణు తో పాటు అవంతిక మిశ్రా, అదితి గౌతమ్, వెంకటేష్ కాకుమాను, రవి వర్మ(Ravi Varma) కీలక పాత్రలు పోషించారు.
- డిస్నీ హాట్ స్టార్ లో విడుదలైన ఈ సీరీస్ 2.5 రేటింగ్ లభించింది.
- ఆరు ఎపిసోడ్లతో ఈ సిరీస్ ను విడుదల చేశారు. ఇలాంటి హారర్ నేపధ్యం ఉన్న కథలకు సంగీతం ప్రధాన బలం, ఈ సీరిస్ కి కపిల్ కుమార్ మ్యూజిక్ అందించాడు.