వ్యూహాం ఆగదు – లోకేష్ & సెన్సార్ బోర్డు పై రాము షాకింగ్ కామెంట్స్

mqdefault వ్యూహాం ఆగదు - లోకేష్ & సెన్సార్ బోర్డు పై రాము షాకింగ్ కామెంట్స్

వ్యూహాం ఆగదు – లోకేష్ & సెన్సార్ బోర్డు పై రాము షాకింగ్ కామెంట్స్

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన తాజా చిత్రం వ్యూహం, ఈ సినిమా కి ప్రస్తుతం సెన్సార్ కష్టాలు వచ్చాయి. షూటింగ్ పూర్తిచేసుకుని సెన్సార్ బోర్డు ముందుకు వచ్చిన వ్యూహం సినిమాను సెన్సార్ బోర్డు సభ్యులు దానికి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వకుండా రివైజింగ్ కమిటీకి పంపించారు.

ఇక ఈ విషయంపై రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ అటు సెన్సార్ బోర్డు మీద ఇటు నారా లోకేష్ మీద కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దాసరి కిరణ్ నిర్మాణ సారధ్యంలో రాము రూపొందించిన ఈ సినిమా కి సెన్సార్ వారు సర్టిఫికెట్ ఇవ్వనిలేదని, అయితే అందుకు గల కారణాలు చెప్పకుండా దానిని రివైజింగ్ కమిటీకి పంపినట్టు తనకు మెసేజ్ వచ్చిందన్నారు రాము.

ఇక ప్రెస్ మీట్ పెట్టి మరీ ఈ విషయాన్నీ చెప్పడానికి ముఖ్య కారణం ఏమిటంటే, తన సినిమా ఆగిపోయిందని ప్రచారం చేసే అవకాశం పచ్చ మీడియాకి ఇవ్వకూడదనే అన్నారు. ఇక లోకేష్ ‘వ్యూహం సినిమా ఆపాలని సెన్సార్‌ బోర్డుకు లేఖ రాసినట్లు తెలిసిందని, అయితే అది ఎంతవరకు నిజమో చెప్పడానికి తన వద్ద ఆధారాలు లేవని చెప్పారు వర్మ.

సెన్సార్ బోర్డు వ్యవస్థ అనేది ఇప్పటిది కాదని, ఎప్పుడో పూర్వకాలంలో ఏర్పాటు చేసుకున్నదని అన్నారు. ఇది పూర్తిగా ఔట్ డేటెడ్ సిస్టమ్ అని విమర్శించారు. ఈరోజుల్లో ప్రతిఒక్కరి చేతుల్లోనూ సెల్‌ఫోన్లు ఉన్నాయని, సోషల్ మీడియాలో తమ తమ అభిప్రాయాలను చెప్పకుండా ఆపగలరా, అని ప్రశ్నించారు.

పైగా సామాజికమాధ్యమాలలో తిట్టేవారిని సెన్సార్ బోర్డు కట్టడి చేయగలదా అని అన్నారు. సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు తమ తమ అభిప్రాయాలు చెప్పినట్లే తాను కూడా వ్యూహం సినిమా ద్వారా తన అభిప్రాయం చెప్పానన్నారు. ఆర్టికల్ 19 ప్రకారం పౌరుడిగా నా అభిప్రాయం చెప్పే హక్కు తనకుందన్నారు.

గతంలో లక్ష్మీస్ ఎన్టీఆర్, అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమాలు రూపొందించానని, బాలీవుడ్‌లో చుస్తే యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ పేరుతొ సినిమా వచ్చిందని వాటిని అపారా అంటూ నిలదీశారు. గతంలో ఉడ్తా పంజాబ్, పద్మావత్ వంటి సినిమాల విషయంలో రివైజింగ్ కమిటీల్లోనూ తేల్చకుంటే కోర్టు ద్వారా సినిమా రిలీజ్ ఆర్డర్ తెచ్చుకున్నారని, తాము కూడా అదే దారిని అనుసరిస్తామన్నారు.

చట్టపరంగా ఉన్న పద్ధతుల ద్వారా వ్యూహం సినిమాను రిలీజ్ చేసుకుంటామని వెల్లడించారు. అంతేకాకుండా అరచేతితో సూర్యుడిని ఆపడం యహం సినిమా రిలీజ్ ను ఆపడం రెండూ సాధ్యం కావన్నారు.

Leave a Comment