Ravi Gupta: డీజీపీ అంజనీ కుమార్ పై సస్పెన్షన్ ఎత్తివేత.. ఏమని వివరణ ఇచ్చారంటే.

The suspension of DGP Anjani Kumar has been lifted.. What is the explanation

Ravi Gupta: డీజీపీ అంజనీ కుమార్ పై సస్పెన్షన్ ఎత్తివేత.. ఏమని వివరణ ఇచ్చారంటే.

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు కౌంటింగ్ జరుగుతున్న తరుణంలో ఒక ఆశక్తికర సన్నివేశం చోటుచేసుకుంది, రాజకీయ పార్టీలు, నేతలు, రాష్ట్ర ప్రజలు ఎన్నికల ఫలితాలకై ఉత్కంఠగా ఎదురుచూస్తున్నా.

తరుణంలో ఓట్ల లెక్కింపు ఆసాంతం పూర్తికాకముందే, తెలంగాణ డిజిపి అంజనీ కుమార్ కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డిని కలుసుకున్నారు, అంజనీ కుమార్ రేవంత్ రెడ్డిని అయన ఇంటికి వెళ్లి కలుసుకుని ఫోటోలు దిగడం కొంత సంచలనంగానే మారింది, ఆ విషయాజ్మ్ కాస్తా ఈ సి దృష్టికి వెళ్ళింది.

డీజీపీ పాల్పడిన చర్య ఎన్నికల నియమాలికి విరుద్ధంగా ఉండటం తో తెలంగాణ సీఈసీ చర్యలకు ఉపక్రమించింది. డీజీపీ అంజనీ కుమార్ ను సస్పెండ్ చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది.

ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలువడకముందే రేవంత్ రెడ్డిని కావడం తీవ్ర మైన తప్పుగా ఈసీ పరిగణించి ఆయనను సస్పెండ్ చేసింది. అయితే డీజీపీ స్థానంలో అంజనీ కుమార్ కి బదులుగా రవి గుప్తాను సీఈసీ నియమించింది.

ఇది ఇలా ఉంటె తాజాగా అంజనీ కుమార్ పై ఉన్న సస్పెన్షన్ ను ఈసీ ఎత్తివేసింది. సీనియర్ ఐపీఎస్‌ అధికారి అయిన అంజనీ కుమార్ తాను ఉద్దేశపూర్వకంగా ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించలేదని సీఈసీకి తెలిపారు. తనను ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి పిలిస్తేనే అక్కడకు వెళ్లానని చెప్పారు.

అయితే భవిష్యత్తులో ఇటువంటి పొరపాట్లు మరోసారి దొర్లకుండా చూసుకుంటానని హామీ ఇచ్చారు. దీంతో ఆయన విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న సీఈసీ అయన పై ఉన్న సస్పెన్షన్ ను తొలగించింది.

కానీ అంజనీ కుమార్ ను మరలా తెలంగాణ రాష్ట్ర డీజీపీ గా తీసుకుంటారా ? లేదంటే ఆయనను మరేదైనా పోస్టు కేటాయిస్తారా అన్నది తెలియాల్సి ఉంది.

ఒక వేళ అంజనీ కుమార్ ను డీజీపీ గా తీసుకుంటే ప్రస్తుతం ఆ పోస్టు లో ఉన్న రవి గుప్తాను మునుపటి పోస్టు లోకే పంపిస్తారా మరేదైనా బాధ్యతలు అప్పగిస్తారో తెలియరాలేదు.

ఇక ఆనాడు అంజనీ కుమార్ తో పాటు అప్పటి టీపీసీసీ వద్దకు మరి కొందరు పోలీసు అధికారులు కూడా వెళ్లారు. వారిలో పోలీసు అధికారులు మహేశ్ భగవత్, సందీప్ కుమార్ జైన్‌ ఉన్నారు,

వారికి సీఈసీ నోటీసులు జారీ చేసింది. మరి వారిపై ఏమైనా యాక్షన్ తీసుకుంటుందా, లేదంటే నోటీసులకు వివరణ ఇస్తే సరిపోతుందా అన్నది తెలియాలంటే వేచి చూడాలి.

Leave a Comment