‘DACOIT’ Movie Teaser: టైటిల్ టీజర్ వచ్చిందోచ్.
టైటిల్ అనౌన్స్ మెంట్ :
ఇటీవల శృతిహాసన్ మరియు ఆడవిశేష్ ఇద్దరు కలిసి ఒక థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నటు వారి సోషల్ మీడియా ద్వారా చెప్పారు.
ఒక ఇంట్రెస్టింగ్ ఫోటో పెట్టి #SeshEXSruthi అని టాగ్ లైన్ పెట్టారు, అలాగే డిసెంబర్ 18 వ తారీఖున టైటిల్ అనౌన్స్ చేయబోతున్నట్టుగా ప్రకటించారు.అనుకున్నట్టుగానే టైటిల్ DACOIT గా అనౌన్స్ చేశారు.
నేపథ్యం – టైటిల్ టీజర్ :
ఇద్దరు మాజీ ప్రేమికుల మద్య జరిగే ఓ యుద్ద తరహా వాతావరణాన్ని ప్రతిబింబిస్తుంది DACOIT.
గులాబీలు, తుపాకులు, మోసం, దుఃఖం అన్నింటి సంగ్రామమే DACOIT.
ADAVI SHESH, SRUTHI HAASAN ఈ సినిమాలో విడిపోయిన ప్రేమికులుగా కనపడనున్నారు. జూలియేట్ పాత్ర లో SRUTHI HAASAN నటించనుంది.
అసలు ఈ ప్రేమికులు, విరోధులుగా ఎలా మారారు ?జూలియేట్ కి హీరో చేసిన మోసమేంటి ? ఈ నేపథ్యంలో కథ సాగనుంది.
హై వోల్టేజ్ డ్రామాకి ప్రామిస్ :
అల్ ఇండియన్ ఫిల్మ్ గా ప్రచారం చేస్తున్న ఈ DACOIT, ప్రేక్షకులకి కావలసిన హైవోల్టేజ్ డ్రామాని అందిస్తానంటూ టీం హామీ ఇస్తుంది.
విశ్వంలో గులాబీలు, తుపాకీల విషపూరిత యుద్ద వాతావరణాన్ని ఈ సినిమాలో చూపించనున్నట్టు తెలిపారు.