Hanuman Trailer: హనుమాన్ ట్రైలర్ వచ్చేసింది..ఇది పాన్ వరల్డ్ మూవీ.

The trailer of Hanuman is out..it is a pan world movie.

Hanuman Trailer: హనుమాన్ ట్రైలర్ వచ్చేసింది..ఇది పాన్ వరల్డ్ మూవీ

టాలీవుడ్ ప్రేక్షకులు వేయికళ్లతో ఎదురుచూస్తున్న సినిమాల్లోHanuman ఒకటి. సంక్రాతి బరిలో ఈ మూవీ నిలిచింది. టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్‎లో పాన్ వరల్డ్ లెవెల్ లో ఈ మూవీ విడుదల కాబోతోంది.

యంగ్ హీరో తేజా సజ్జ ఈ మూవీలో హీరోగా నటించాడు. ఇప్పటికే వచ్చిన Hanuman Trailer దేశవ్యాప్తంగా ఇంపాక్ట్ చూపించింది. తెలుగు ప్రేక్షకుల్లోనే కాదు దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానుల్లో భారీ అంచనాలు పెంచేశారు.

కొద్దిసేపటి క్రితమే విడుదలైన ట్రైలర్ అంతకుమించి అన్నట్లుగా ఉంది. ట్రైలర్‌ని చూస్తుంటే గూస్‎బమ్స్ వస్తున్నాయి. ఈ సంక్రాంతికి తేజ, ప్రశాంత్ వర్మ ఇద్దరూ కలిసి బాక్సాఫీస్‎ను బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

Hanuman Trailer ఓ రేంజ్ లో ఉంది. ముఖ్యంగా విజువల్ వండర్ అని చెప్పాలి. ఒక చిన్న కథకు భారీ లెవెల్ లో విజువల్ ఎఫెక్ట్స్ అందించారు. ఇక ట్రైలర్ విషయానికి వస్తే..

ఒక పల్లెటూరిలో ఉండే తేజ కి అసమాన శక్తి సామర్థ్యాలు ఉంటాయి. కన్నడకు చెందిన వినయ్ రాయ్ విలన్ గా కనిపిస్తున్నాడు.ఈ విలన్ పాత్ర ఇలాంటి అతీత శక్తుల కోసం ప్రయోగాలు చేస్తూ ఉంటాడు.

ఈ క్రమంలో హీరో తేజా గురించి తెలుసుకుని అతడి దగ్గరకు వచ్చి దాడి చేస్తే క్రమంలో హనుమంతుడు ఎలా ఎంటర్ అవుతాడు, అతడిని ఎలా కాపాడాడు అన్నది మూవీ.

Trailer ఓపెనింగ్స్ షాట్ దిమ్మతిరిగేలా ఉంది. డైరెక్టర్ అన్ని వర్గాల ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు. తేజ సజ్జా సూపర్ హీరోగా , హీరోయిన్ గా అమృత అయ్యర్ ,తేజ అక్క పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తోంది.

ఈ ట్రైలర్ లో వరలక్ష్మీ ఫైట్ సీన్స్ కూడా చేస్తూ కనిపించింది. ఇక ఇప్పటి వరకు విలన్ పాత్రలో కనిపించి ప్రేక్షకులను అలరించిన సముద్రఖని సరికొత్త గెటప్ లో ఈ మూవీలో కనిపించనున్నారు.

సినిమాటోగ్రాఫి, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్ ఎఫెక్ట్స్ నా భూతో నా భవిష్యత్ అనేలా ఉన్నాయి. దర్శకధీరుడు రాజమౌళి సినిమా తీస్తే ఏ లెవెల్ లో ఉంటుందో యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ ఈ మూవీలో తన టాలెంట్ చూపించాడు. ఈ ట్రైలర్ లోని ప్రతీ ఒక్కటి టాప్‌లో ఉన్నాయి.

ముఖ్యంగా ట్రైలర్ ఎండ్ షాట్ లో Hanuman రివీల్ అయ్యే సీన్ చూసేందుకు రెండు కళ్లు సరిపోవు. ట్రైలరే ఈ లెవెల్ లో ఉంటే ఇక థియేటర్స్ లో సినిమాలో ఏ స్థాయిలో ఉంటుందో అన్నది ఇప్పుడు అందరూ డిస్కర్ చేసుకుంటున్నారు.

జనవరి 12న ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మళయాళ భాషలతో పాటు స్పానిష్, కొరియన్, ఇంగ్లీష్, జపనీస్, భాషల్లోనూ పాన్ వరల్డ్ సినిమాగా ను రిలీజ్ చేయబోతున్నారు.

ఇప్పటి వరకు ఏ సినిమా డైరెక్టర్ చేయని సాహసాన్ని ఈ యంగ్ డైరెక్టర్ చేయబోతున్నాడు. ఒకేసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న 11 దేశాల్లో మూవీ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మూవీకి అనుదీప్ దేవ్, హరి గౌర, కృష్ణ సౌరభ్ లు మ్యూజిక్ అందిస్తున్నారు.

Leave a Comment