కేంద్ర ప్రభుత్వ ఆదీనం లో రక్షణశాఖకు చెందిన 175 ఎకరాలను కేంద్రం తెలంగాణా ప్రభుత్వానికి బదిలీ చేసింది.
ఈ భూములకు సంబందించిన ప్రతిపాదనలు తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపించగా దానికి సానుకూలం స్పందించి వెంటనే భూముల బదిలీ చేపట్టినట్లు చెప్పారు జనవరి 5 న రేవంత్ రెడ్డి తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి గా భాద్యత తీసుకున్న తర్వాత ఈ విషయం కేంద్రానికి విన్నవించడం జరిగింది.
అయితే హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యను ఎదుర్కోవాలంటే కొన్ని చోట్ల కేంద్ర రక్షణశాఖకు చెందిన భూములు తమకి ఇచ్చినట్లయితే ఇరుకు గా ఉన్న రోడ్లను విశాలం గా మార్చడానికి అవకాశం ఉంటుందని కోరడం తో దీనికి కేంద్ర కూడా సానుకూలంగా స్పందించిందని ఆయన అన్నారు.
తమ విన్నపాన్ని మన్నించి అందుకు తమ ఆదీనం లో ఉన్న 175 ఎకరాల భూములను తమకి కేటాయించినందుకు రేవంత్ రెడ్డి భారత ప్రధాని నరేంద్ర మోడీ అలాగే రక్షణ శాఖా మంత్రి రాజ్ నాద్ సింగ్ కు కృతజ్ఞతలు తెలిపారు.