Elon musk Twitter shares fall 71%: ట్విట్టర్ ను X గా మార్చేశారు, అసలు మాట్లాడాలంటే 2022 అక్టోబర్ నెలలోనే ట్విట్టర్ ఓనర్ నే మార్చేశారు. ట్విట్టర్ ను ప్రపంచ కుబేరుడు ఎలాన్ మాస్క్ 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేశాడు.
ఇవన్నీ తెలిసిన విషయాలే కదా ఎందుకు మరలా ప్రస్తావిస్తున్నాము అని మీకు అనుమానం రావచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ఎక్స్ కి సంబంధించి ఒక న్యూస్ ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది.
అదేమిటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోక మానరు. ఇంతకీ అసలు సంగతియేమిటంటే, ఎక్స్ అని మార్చబడిన ట్విట్టర్ విలువ ఢమాల్ మని పడిపోయింది.
ట్విట్టర్ ను ఎలాన్ మాస్క్ సొంతం చేసుకున్న మొత్తం 44 బిలియన్ డాలర్లు, ఆ మొత్తం లోనుండి 32 శతం నిధులు పతనమై పోగా డిసెంబర్ 30 నాటికి 12.5 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అంటే దాదాపు 71 శతం కంపెనీ వాల్యూ వెస్ట్ గా పోయినట్టు అర్ధం చేసుకోవచ్చు.
50 శాతం ఉద్యోగులు అవుట్ : 50 percent employees out
మాస్క్ ఎప్పుడైతే ట్విట్టర్ ను సొంతం చేసుకున్నాడో అప్పటి నుండి మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టాడు. ముందు చేర్పుల సంగతి మాట్లాడుకుని తరువాత మార్పుల విషయం లోకి వెళదాం.
ట్విట్టర్ గా ఉన్న పేరును ఎలాన్ మాస్క్ వచ్చాక కొన్ని నెలలకే ఎక్స్ (X) గా మార్చేశారు. కంటెంట్ విషయంలో లైట్ తీసుకున్నారు.
అంటే కంటెంట్ విషయంలో చూసి చూడనట్టు ఉండటం పెద్ద మైనస్ అయింది. ఇక మార్పుల విషయానికి వస్తే మాస్క్ ఓనర్ గా ఛార్జ్ తీసుకున్న తరువాత కంపెనీలో పనిచేస్తున్న వారిలో సుమారు 50శాతం
మందికి ఉద్వాసన పలికారు. ఇది చాలా విమర్శలకు తావిచ్చింది. ఉన్నట్టుండి కొద్దీ రోజుల వ్యవధిలోనే ఇలా చేయడంపట్ల అంత విస్మయానికి గురయ్యారు.
అయినప్పటికీ మాస్క్ నెంబర్ వన్ : Even Though Mask Is No.1
ఇక ఇతర సామజిక మాధ్యమాలతో పోలిస్తే X లో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఎక్కువగా ఉంటోందని ఐరోపా సమాఖ్య హెచ్చరించింది. ఇలాంటి అనేక కారణాల వల్ల కొన్ని సంస్థలు యాడ్స్ ఇవ్వడం పూర్తిగా నిలిపివేశాయి.
డిస్ని(Disni), యాపిల్(Apple), కోకాకోలా(Cocacola) వంటి సంస్థలు X కి పూర్తిగా దూరమయ్యాయి. అందుకు ప్రత్యేకమైన కారణం కూడా లేకపోలేదు.
X లో యూదు వ్యతిరేక పోస్టులు పెట్టినప్పుడు మస్క్ అందుకు సపోర్ట్ చేశాడు. ఇంత నష్టం జరిగినప్పటికీ మస్క్ ఇప్పటికి ప్రపంచ ధనవంతుడిగానే ఉన్నాడు.
2024 జనవరి 4వ తేదీ నాటికీ చూసుకుంటే మస్క్ 220 బిలియన్ డాలర్ల సంపదతో వరల్డ్ రిచెస్ట్ పర్సన్ గా కొనసాగుతున్నాడు.