తాగడానికి నీళ్ళు లేవు కాని కార్లు కడుగుతున్నారు బెంగుళూరు లో ! 22 మంది కి ఫైన్ !

website 6tvnews template 2024 03 26T122619.102 తాగడానికి నీళ్ళు లేవు కాని కార్లు కడుగుతున్నారు బెంగుళూరు లో ! 22 మంది కి ఫైన్ !

ప్రస్తుతం బెంగళూరు నగరం లో తాగు నీటి ఎద్దడి చాలా తీవ్రం గా ఉండనే చెప్పాలి. దాద్దపు 60% మంది ప్రజలకి తాగు నీరు లేక నీటి టాంకర్ ల మీదనే ఆధారపడుతున్నారు. అయితే అక్కడ కాంగ్రేస్ ప్రభుత్వం నీటి ధరలు నిర్ణయించిన అవి ఎక్కడ అమలు కావడంలేదు. టాంకర్ లు వారి ఇస్తాను సారం డబ్బులు వసూలు చేస్తున్నారని అక్కడ ప్రజలు ఆరోపిస్తున్నారు. రాష్ట్రం లో 136 తాలుకాలో నీటి ఎద్దడి విపరీతం గా ఉందని అధికారికం గా ముఖ్యమంత్రి ప్రకటించిన అక్కడ ఇంకా ఎక్కువ చోట్ల నీటి ఎద్దడి ఉందని ప్రజలు చెప్తున్నారు.

చాలా చోట్ల బోర్లు ఎండిపోవడం వల్ల ఇంత నీటి ఎద్దడి ఏర్పడిందని కావలసిన జాగ్రత్తలు తీసుకున్నాం అని చెప్తున్నా నీరు లేక చిన్న పిల్లలు, పెద్దలు, ముసలి వాళ్ళు చాల ఇబ్బంది పాడడం జారుగొంది. కనీసం తాగడానికి కుడా ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు సరిగ్గా చెయ్యలేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇది ఇలా ఉంటె అక్కడి ప్రజలు నీళ్ళు లేక అవస్డలు పడుతూ ఉంటె కొంత మంది నీళ్ళను వృధాగా కార్లను కడగడం ఇళ్ళు కడగడం చేస్తున్నారని అక్కడ అధికారులు చెప్తున్నారు.

దీనికోసం నిఘా టీమ్ లు ఏర్పాటు చేసాం అని ఎవరైనా నీళ్ళు వృధా చేస్తున్నారని మా దృష్టికి వస్తే 5,000/- రూపాయలు ఫైన వేస్తున్నాం అని చెప్పారు, ఇప్పటి వరకు 22 మందిని గుర్తించామని వారికి ఫైన్ కుడా వేశామని, దీని ద్వారా లక్షా పది వేల రూపాయలు వచ్చింది అని అధికారులు చెప్పారు.

Leave a Comment