These are Ministers in Revanth Reddy’s Cabinet: రేవంత్ రెడ్డి క్యాబినెట్ లో మంత్రులు వీరే

Add a heading 26 These are Ministers in Revanth Reddy's Cabinet: రేవంత్ రెడ్డి క్యాబినెట్ లో మంత్రులు వీరే

తెలంగాణ ముఖ్య మంత్రిగా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ హై కమాండ్ ఎన్నిక చేయడం, ఆతరువాత ఆ కార్యక్రమానికి ఏర్పాట్లు చేయడం వంటివి వడివడిగా జరిగిపోయాయి. ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించగా, కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ సోనియా గాంధీ, పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ, అలాగే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే వంటి వారు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన సోనియా కుటుంబానికి నగరంలోని హోటల్ తాజ్ కృష్ణా లో విడిది ఏర్పాటు చేశారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు.

హోటల్ నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలతో కలిసి రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియం వద్దకు వెళ్లారు. సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డి వెనక సీటులో కూర్చోగా రాహుల్ గాంధీ ముందు కూర్చున్నారు. వీరి కాన్వాయ్ వెళుతుంటే దారి పొడవునా వీరిని చూసేందుకు నిలబడి ఉన్న సామాన్య ప్రజలుకు అభివాదం చేస్తూ ముందుకి వెళ్లారు. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తున్న వేదికపై అయన భార్య, కూతురు, అల్లుడు కూడా ఉన్నారు. రేవంత్ కుటుంబ సభ్యులతో పటు హేమాహేమీలు వేదికపై ఆసీనులయ్యారు.

ఇక రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం మొదలు పెట్టిన సమయంలో ఆ ప్రాంతమంతా జయజయ ధ్వానాలతో హోరెత్తిపోయింది. ఎనుముల రేవంత్ రెడ్డి అనే నేను అని మొదలు పెట్టగానే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, రేవంత్ రెడ్డి అభిమానులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. జై కాంగ్రెస్, జై రాహుల్, జై సోనియా, జై రేవంత్, అనే నినాదాలతో ఎల్బీ స్టేడియం మొత్తం మారుమ్రోగిపోయింది. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించగా, శాసనం ద్వారా నిర్మితమైన, భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, దేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడతానని రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.

మల్లు భట్టి విక్రమార్క :

ఉపముఖ్య మంత్రిగా మల్లు భట్టి విక్రమార్క ప్రమాణం చేశారు. మొదట తెలంగాణ సీఎం రేసులో భట్టి పేరు కూడా బాగా వినిపించింది. చివరకు హై కమాండ్ రేవంత్ ను సీఎం ను చేయగా భట్టి విక్రమార్కను డెప్యూటీ సీఎం ను చేసింది. ఈ క్రమంలోనే మల్లు భట్టి విక్రమార్క తెలంగాణ రాష్ట్రానికి ఉప ముఖ్య మంత్రిగా బాధ్యతలు చేపట్టి ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు రేవంత్ తో పాటు భట్టికూడా శాయశక్తులా కృషి చేశారు.

ఉత్తమ్ కుమార్ రెడ్డి :

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ లో సీనియర్ నేతల పేర్లు ప్రస్తావనలోకి వచ్చినప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు కూడా వినిపిస్తుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి కి మంత్రిగా పనిచేయడం కొత్తేమి కాదు. 2015 నుండి 2021 వరకు కూడా ఉత్తమ్ తెలంగాణ పీసీసీ గా పార్టీకి సేవలు అందించారు. సూర్యాపేట జిల్లాకు చెందిన తిరుమలగిరి మండలంలోని తాటిపాముల అనే గ్రామం ఉత్తమ్ స్వగ్రామం. ఇక ప్రస్తుతానికి 2023 ఎన్నికల్లో హుజూర్ నగర్ కాన్స్టిట్యూఎన్సీ నుండి పోటీ చేసి సైదిరెడ్డిని ఓడించి గెలుపును కైవశం చేసుకున్నారు. గతంలో కిరణ్ కుమార్ రెడ్డి కాబినెట్ లో పనిచేసిన ఉత్తమ్ ఈ దఫా రేవంత్ రెడ్డి క్యాబినెట్ లో పనిచేయనున్నారు.

దినసరి అనసూయ అలియాస్ సీతక్క :

తెలంగాణ రాష్ట్రంలో సీతక్క అనే పేరు తెలియని వారుండదు, పార్టీలకు అతీతంగా ఆమెను ప్రజలు అభిమానిస్తూ ఉంటారు. అందుకు నిదర్శనమే ప్రమాణ స్వీకారోత్సవం, ముఖ్య మంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తుండగా ప్రజల నుండి ఎంతటి మోదం వ్యక్తమైందో అదే స్థాయిలో సీతక్క మంత్రిగా ప్రమాణం చేస్తుండగా తమ మద్దతు తెలిపరిచారు.

ప్రమాణ స్వీకారం అనంతరం సోనియాకి ధన్యవాదాలు తెలిపిన సీతక్కను సోనియా గాంధీ హత్తుకుని తన అభిమానాన్ని వ్యక్తపరిచారు. సీతక్క మాజీ నక్సలైట్ అన్న విషయం అందరికి తెలుసు, ఆమె జనజీవన శ్రవంతిలో కలిసిపోయాక తెలుగు దేశం పార్టీ లో చేరి రాజకీయ జీవితానికి శ్రీకారం చుట్టారు. పాలిటిక్స్ అంటే అధికారం కోసం కాదని సేవ కోసమే అని చాటి చెప్పారు.

కరోనా సమయంలో తన నియోజకవర్గంలోని తాండాలకు కాళీ నడకన వెళ్లి వారిని నిత్యావసరాలు అందజేశారు. 2004 లో ములుగు నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారు, తదుపరి 2009 లో గెలుపొందారు. మరలా 2014 లో ఓటమిని చవిచూశారు. అందుకు కారణం ఆ ప్రాంతంలో టీడీపీ కి బలం సన్నగిల్లడమే. ఇక 2017 లో కాంగ్రెస్ గూటికి చేరిన సీతక్క 2018 2023 ఎన్నికల్లో వరుసగా విజయాన్ని వారించారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఆమె సేవలను గుర్తించి మంత్రి గా ప్రమోషన్ ఇచ్చింది.

పొన్నం ప్రభాకర్ :

పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీ లో సీనియర్ నేత, రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీకి బలం సన్నగిల్లడంతో అనేక మంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు అప్పటి టి.ఆర్.ఎస్ పార్టీలోకి జంప్ అయ్యారు. కారు గుర్తు మీద 2014 లో కాంటెస్ట్ చేసి గెలుపు గుర్రాలయ్యారు. కానీ పొన్నం మాత్రం పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. 2023 ఎన్నికల్లో అయన హుస్నా బాద్ నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలుపొందారు. 2009 లో కరీంనగర్ పార్లమెంట్ నుండి గెలుపొందిన పొన్నం ఆతరువాత పోటీ చేసిన అన్ని ఎన్నికల్లో ఓడిపోయారు.

దామోదర రాజనర్సింహ :

దామోదర రాజా నర్సింహా మంత్రి గా పనిచేయడం కొత్తేమి కాదు, వై.ఎస్ క్యాబినెట్ లో పనిచేశారు. ఆందోల్ నియోజకవర్గం నుండి 1989 లో కాంటెస్ట్ చేసి గెలుపొందారు. 2004, 2009 లో అదే నియోజకవర్గం నుండి గెలుపొందారు. కేవలం ఎమ్మెల్యే గా జీవాలడమే కాక, వై.ఎస్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి కాబినెట్స్ లో నిస్తానని దక్కించుకోగలిగారు. 2011 లో ఉప ముఖ్య మంత్రిగా కూడా పనిచేశారు. రాజ నరసింహ కాంగ్రెస్ పార్టీ కి అందించిన సేవలు, ఆయన సీనియారిటీని దృష్టిలో పెట్టుకుని పార్టీ ఆయనకి మరో మారు మంత్రిగా బాధ్యతలు అప్పజెప్పింది.

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి:

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద 1999 నుండి 2014 వరకు నల్గొండ నియోజకవర్గం నుండి నాలుగు పర్యాయాలు గెలుపొందారు. రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్ లో 2009 సమయంలో మంత్రిగా చోటు దక్కించుకున్నారు. ఇప్పటి వరకు మాజీ అమంత్రిగా పిలవబడ్డ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఇక మీదట మరోమారు, మంత్రిగా పిలవబడతారు. వెంకట్ రెడ్డి ఎప్పటికప్పుడు పార్టీ తరుపున తన వాని వినిపిస్తూనే ఉంటారు.

తుమ్మల నాగేశ్వర్ రావు :

తుమ్మల నాగేశ్వర రావు కూడా రేవంత్ రెడ్డి సీతక్క మాదిరిగానే తెలుగుదేశం పార్టీ నుండి వచ్చిన వ్యక్తే, తుమ్మల కేవలం ఎన్టీఆర్ క్యాబినెట్ లోనే కాక చంద్రబాబు, కేసీఆర్ కబినెట్ లో కూడా మంత్రిగా పనిచేశారు, గతంలో అయన ఖమ్మం, సత్తుపల్లి నియోజకవర్గాల నుండి పోటీచేశారు. మొదటి సారి 1983 లో పోటీ చేసిన సమయంలో మాత్రం ఆయనను ఓటమి పలుకరించింది.

2023 ససభ ఎన్నికల ముందు బి.ఆర్.ఎస్ కి రాజీమానా చేసి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఖమ్మం జిల్లా రాజకీయాల్లో తుమ్మలది విశిష్ట స్థానం. 1985,1994,1999,2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుండి, 2016లలో తెరాస పార్టీ నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ప్రతుతం ఆయన సీనియారిటీని పరిగణలోకి తీసుకుని రేవంత్ రెడ్డి తుమ్మలకు క్యాబినెట్ లో చోటు కల్పించారు.

కొండా సురేఖ:

కొండా సురేఖ ఈ పేరు తెలంగాణ పాలిటిక్స్ లో ఫైర్ బ్రాండ్, ఫైర్ బ్రాండ్ అంటే బూతులు తిట్టడంలో కాదు, పొలిటికల్ సబ్జెక్టు మీద మాట్లాడటం అని ప్రూవ్ చేసిన మహిళ కొండా సురేఖ. 1999 లో ఆమె శాయంపేట నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే గా గెలుపొందారు. మంత్రిగా కాకపోయినా 2009 వరకు కాంగ్రెస్ పార్టీలో వివిధ శాఖల్లో పని చేశారు సురేఖ. 2004, 2009 లో కూడా శాసనసభ్యురాలు అయ్యారు. హ్యాట్రిక్ విజయం అందుకుని సీనియర్ లీడర్ అనిపించుకోవడంతో వై.ఎస్ తన క్యాబినెట్ లో సురేఖ కు స్థానం కల్పించారు. వై.ఎస్ మరణానంతరం ఆమె తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.

అనంతర కాలంలో 2011 లో ఆమె తనశాసన సభ్యత్వానికి కూడా రిసైన్ చేశారు. 2014 లో ఆమె వరంగల్ తూర్పు నియోజకవర్గం టిఆర్.ఎస్ నుండి పోటీ చేసి విజయం సాధించారు. కానీ కొన్ని పరిణామాల వల్ల ఆమె ఆ పార్టీని వీడి 2018 లో కాంగ్రెస్ గూటికే వచ్చారు. ప్రస్తుతం 2023 లో మరల వరంగల్ తూర్పు నుండే పోటీ చేసి గెలుపును కైవశం చేసుకున్నారు. ఆమె సీనియారిటీ సిన్సియారిటీ ను దృష్టిలో పెట్టుకునే రేవంత్ రెడ్డి సురేఖకు క్యాబినెట్ లో చోటు కల్పించారు.

జూపల్లి కృష్ణారావు:

1999 నుండి 2009 వరకు కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి గెలుపును దక్కించుకున్నారు జూపల్లి. కానీ రాష్ట్ర విభజన అనంతరం 2011 లో టిఆర్.ఎస్ తీర్ధం పుచ్చుకున్నారు. 2014 లో కొల్లాపూర్ లో గెలిచినా, 2018 లో మాత్రం ఓడిపోయారు. జూపల్లి వై.ఎస్.ఆర్, కిరణ్ కుమార్ రెడ్డి, కేసీఆర్ క్యాబినెట్ లో మంత్రిగా పనిచేశారు. 2023 ఎన్నికల నాటికి అయన బి.ఆర్.ఎస్ నుండి కాకుండా కాంగ్రెస్ నుండి పోటీ చేసి కొల్లాపూర్ లో విజయాన్ని కైవశం చేసుకున్నారు. సీనియారిటీని దృష్టి లో పెట్టుకుని జూలపల్లికి పార్టీ అధిష్టానం క్యాబినెట్ లో స్థానాన్ని కల్పించింది.

పొంగులేటి శ్రీనివాస రెడ్డి:

పొంగులేటి కూడా సీనియర్ రాజకీయ నేతే అని చెప్పాలి, ఆయన 2014 లో ఖమ్మం నియోజకవర్గం నుండి వైసీపీ నుండి లోక్ సభ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఆతరువాత పొంగులేటి టిఆర్.ఎస్ కండువా కప్పుకున్నారు. 2018 లో బిఆర్.ఎస్ పార్టీ నుండి పోటీ చేయకుండా ఆపార్టీ అభ్యర్ధికి మద్దతు పలికారు. తదనంతర కాలంలో పొంగులేటిని గులాబీ బాస్ పార్టీ నుండి సస్పెండ్ చేయగా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2023 ఎన్నికల్లో అదే ఖమ్మం నుండి గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. ప్రస్తుతం రేవంత్ క్యాబినెట్ లో మంత్రిగా స్తానం దక్కించుకున్నారు.

Leave a Comment