ISRO 10 Key Missions In 2024: 2024 లో ఇస్రో 10 కీలక ప్రయోగాలను ఇవే.
భారతీయులకు జాబిల్లితో ఎంతో అనుబంధం ఉంది. కథల రూపంలో, కలల రూపంలో, ఊహల రూపంలో చందమామ పైకి వెళ్లామని, చందమామ మన దగ్గరికి వస్తుందని చిన్నపిల్లలకి గోరు ముద్దలు తినిపించిన ఘనత మన భారతదేశానిది.
అలాంటి ఊహలోకం వీడి, నిజంగానే చంద్రుని పైన అడుగు పెట్టి, దక్షిణ ధ్రువంపైన అడుగు పెట్టిన మొదటి దేశం గా చరిత్ర సృష్టించింది. అక్కడితో ఆగిపోకుండా ఇంకా ఎన్నో కొత్త ప్రయోగాలకు శ్రీకారం చుట్టింది. దానిలో భాగంగా చంద్రయాన్-3 ప్రాజెక్ట్‌ను ప్రారంభించి..
ఎంతో నైపుణ్యంతో, వ్యూహాత్మకంగా చంద్రుడి కక్ష్య నుంచి భూ కక్ష్యలోకి ప్రొపల్షన్ మాడ్యూల్‌ను ప్రవేశపెట్టింది ఇస్రో. ఇది ఎంతో ప్రత్యేకమైన ప్రయోగమని శాస్త్రవేత్తలు తెలిపారు.
చంద్రుడిపై నుంచి నమూనాలు సేకరించే ప్రణాళికలు చేస్తున్న ఇస్రో, తాజా ప్రయోగం ఆ మిషన్‌కు దోహదపడుతుందని పేర్కొంది.
నమూనాలను తీసుకొని తిరిగి వచ్చే మిషన్ కోసం వ్యూహాలు రూపొందించేందుకు ప్రొపల్షన్ మాడ్యూల్‌లోని అదనపు సమాచారం ఉపయోగపడుతుందని పేర్కొంది.
వరుస విజయాలతో ప్రపంచాన్ని సైతం పలకరించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) వచ్చే ఏడాది కీలక ప్రయోగాలకు సిద్ధమవుతోంది. 2024లో ముందుగా 10 ప్రయోగాలు చేపట్టనున్నట్లు కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు వెల్లడించింది.
ఇందులో 6 పీఎస్‌ఎల్వీ ప్రయోగాలతోపాటు 3 జీఎస్‌ఎల్వీ, ఒక లాంచ్ వెహికల్ మార్క్-3 మిషన్ ఉన్నట్లు తెలిపింది. అంతేకాకుండా ఇస్రో అభివృద్ధి చేసిన సరికొత్త ప్రయోగ వాహక నౌక ఎస్‌ఎస్‌ఎల్వీ (స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్) ద్వారా ప్రయోగాత్మకంగా ఓ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపించనున్నట్లు ఇస్రో చైర్మన్ తెలిపారు.
రోదసిలోకి సొంతంగా వ్యోమగాములను పంపేందుకు ‘గగన్‌యాన్’ పేరిట భారత్ ప్రతిష్ఠాత్మక మిషన్‌ను చేపడుతుంది.
అత్యవసర పరిస్థితుల్లో గగన్‌యాన్‌లోని వ్యోమగాములు సురక్షితంగా బయటపడేందుకు వీలుగా అభివృద్ధి చేసిన ‘క్రూ ఎస్కేప్ సిస్టమ్’ను పరీక్షించడానికి మరో ప్రయోగాన్ని కూడా చేపట్టనున్నట్లు వెల్లడించింది.