Margasira month of Festivals: మార్గశిర మాసంలో వచ్చే పండగలు ఇవే.

These are the festivals that occur in the month of Margasira

Margasira month of Festivals: మార్గశిర మాసంలో వచ్చే పండగలు ఇవే.

కార్తికం ముగిసిపోబోతోంది. త్వరలో మార్గశిర మాసం వస్తోంది. అయితే అన్ని మాసాల లాగానే మార్గశిర మాసంకూడా పుణ్యప్రదమైన మాసంగా భావిస్తారు.

మాసానాం మార్గశీర్షానాం అంటూ మాసాలలో మార్గశిర మాసాన్ని నేనని శ్రీకఈష్ణ పరమాత్మ గీతలో విభూతి యోగంలో చెప్పాడు. ఈమాసంలో చేసే ఏ పూజైనా, హోమమైనా, అభిషేకమైనా ఏ దైవకార్యం అయినా సరే దాన్ని తానే స్వయంగా స్వీకరిస్తానని భగవానుడు చెప్పాడు.


సూర్యుడు, గురువుకు సంబంధించిన ధనస్సురాశిలో సంచరించే పుణ్యకాలాన్నే మార్గశిరం అంటారు. హేమంత రుతువులో వచ్చే మొదటి నెల ఇది.

మార్గశిర మాసంలోనే ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ ధనుర్మాస వైభవాన్ని గురించి బ్రహ్మాండ పురాణం, భాగవతం, వైఖానసం వంటి గ్రంథాలలో ప్రత్యేకంగా వివరించడం జరిగింది.

ఈ మాసంలో వచ్చే పండుగలు ఇవే:

మార్గశిర శుద్ద పంచమి:

మార్గశిర శుద్ద పంచమి రోజున నాగపూజ చేయడం విశేషంగా చెప్పవచ్చు. అదేవిధంగా శుభకార్యాలు ప్రారంభించడానికి అనువైన రోజుగా ఈరోజును పేర్కొంటారు.

సుబ్రహ్మణ్య షష్టి:

మార్గశిర శుద్ధ షష్టినే సుబ్రహ్మణ్య షష్టిగా పేర్కొంటారు. కొన్ని చోట్ల దీన్ని సుబ్బరాయడి షష్ఠిగా కూడా వ్యవహరిస్తారు. ఈరోజు పాము పుట్టలో పాలుపోసే ఆచారం కూడా ఉంది. ఈరోజున విశేషించి పెళ్లి కావాల్సిన వారు, సంతానం కావాల్సిన వారు, నాగదోషాలు ఉన్నవారు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తే విశేషమైన ఫలితం కలుగుతుందని ప్రతీతి.

భానుసప్తమి:

మార్గశిర శుద్ద సప్తమిని భాను సప్తమి అంటారు. దీన్నే జయసప్తమి, మిత్ర సప్తమి అని కూడా పిలుస్తారు. ఈరోజు సూర్యారాధన చేయడం, సూర్యుడికి పాయసాన్ని నివేదించడం చేస్తే అనేక శుభ ఫలితాలు కలుగుతాయి.

భైరవాష్టమి:

మార్గశిర శుద్ద అష్టమిని భైరవాష్టమి అని పిలుస్తాం. కాలభైరవుడి ఆరాధన ఈరోజు విశేషంగా చెప్పబడుతుంది. కుక్కలకు పాలు, పెరుగు, రొట్టెలు వంటివి ఆహారంగా సమర్పించాలి. ఈరోజున గంగా స్నానం చేస్తే లౌకిక బాధల నుంచి విముక్తి కలుగుతుందని పెద్దలు సూచిస్తారు.

మార్గశిర శుద్ద ఏకాదశి:

మార్గశిర శుద్ద ఏకదాశినే మోక్షదా ఏకాదశి అని పిలుస్తారు. ఈరోజున ఏకాదశి వ్రతాన్ని పాటిస్తారు. భగవద్గీత పుట్టింది కూడా ఈరోజే. గీతాజయంతిని ఈరోజే జరుపుకుంటారు. తెల్లవారి వచ్చే ద్వాదశికి అఖండ ద్వాదశి అని పేరు.

మార్గశిర శుద్ద త్రయోదశి:

ఈరోజున హనుమత్ పూజ విశేషంగా చెప్పబడింది. హనుమాన్ వ్రతాన్ని ఆచరిస్తారు.

మార్గశిర శుద్ద పౌర్ణమి:

ఈరోజును దత్త జయంతిగా జరరుపుకుంటారు. త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయుడు ఆవిర్భవించింది ఈరోజే. ఈరోజున దత్తాత్రేయుడి ఆరాధించి, అనఘా వ్రతాన్ని నిర్వహిస్తే సకల శుభాలు కలుగుతాయి.

మార్గశిర పూర్ణమి:

ఈ పూర్ణమికే కోరల పున్నమి, నరక పూర్ణమి అని పేరు. ఈ రోజున యమధర్మరాజును ఆరాధిస్తారు. కార్తిక పౌర్ణమి నుండి మార్గశిర పౌర్ణమి వరకు యమధర్మ రాజు కోరలు తెరుచుకొని ఉంటాడు, ఈ రోజుల్ని యమదంష్ట్రులుగా చెబుతారు.

మార్గశిర పౌర్ణమి తో అనేక రకమైన వ్యాదులు, అనారోగ్య సమస్యలు తొలగుతాయి, కనుక కృతజ్ఞత పూర్వకం గా ఈరోజు యమధర్మ రాజుని ఆరాదిస్తారు

Leave a Comment