Sankranti Movies 2024: సంక్రాంతికి వచ్చే సినిమాలు ఇవే.

Add a heading 2024 01 04T124128.531 Sankranti Movies 2024: సంక్రాంతికి వచ్చే సినిమాలు ఇవే.

Sankranti Movies 2024: సంక్రాంతి పండుగ అంటే సినిమా పండగ . తెలుగువారు ఎంతో ఘనంగా జరుపుకునే ఈ పండుగ రోజు అనేక సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతుంటాయి.

చాలా మంది మేకర్స్ కుదిరితే శుక్రవారం లేదంటే ఫెస్టివల్ సీజన్ లో సినిమాలను విడుదల చేయాలని భావిస్తుంటారు. అయితే ఈ ఏడాది సంక్రాంతి పండుగన సినిమాల సందడి మామూలుగా ఉండదు.

అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులకు వినోదాల సందడిని అందించేందుకు స్టార్ హీరోలు రెడీ అయ్యారు. న్యూ ఇయర్ కన్నా సంక్రాంతికి వచ్చే సినిమాల లిస్టే పెద్దగా ఉంది.

కేవలం మూడు రోజు లేడాతోనే భారీ బ్జెట్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద రిలీజ్‎కు రెడీ అయ్యాయి. ప్రతీ సంవత్సరం లాగే ఈ సంక్రాంతికి నువ్వా..నేనా అనే టగ్ ఆఫ్ వార్ నడుస్తోంది.

మరి ఈ పెద్ద చిత్రాల్లో బాక్సాఫీస్ ను షేక్ చేస్తాయా? లేదా చతికిలపడతాయా అన్నది చూడాల్సిందే. మరి సంక్రాంతికి పోటా పోటీగా రిలీజ్ కానున్న సినిమాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

Mahesh mass look in Guntur Karam : గుంటూరు కారంలో మాస్ లుక్ లో మహేష్

telugu samayam 6 Sankranti Movies 2024: సంక్రాంతికి వచ్చే సినిమాలు ఇవే.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) డైరెక్షన్ లో వస్తున్న మూవీ గుంటూరు కారం (Guntur Karam). టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు (Mahesh Babu)హీరోగా నటిస్తున్న ఈ మూవీకి నాగవంశీ (Nagavamshi)ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.

గుంటూరు కారం ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద సందడి చేయబోతోంది. జనవరి 12వ పండుగ రోజు రిలీజ్ కు రెడీ అయ్యింది ఈ మూవీ. రూ. 200 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు మేకర్స్.

గుంటూరు కారంలో టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ శ్రీలీల (Srileela), అందాల ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరిలు(Meenakshi Choudary) హీరోయిన్లుగా కనిపించనున్నారు.

మరోవైపు రిలీజ్ డేట్ దగ్గర పడటంతో ఈనెల 6న ప్రిరిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్ గా నిర్వహించేందుకు మేకర్స్ అన్ని ఏర్పాట్లు చేశారు.

హైదరాబాద్ లో జరిగే ఈ ప్రిరిలీజ్ ఈవెంట్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)రానున్నారని సమాచారం. త్వరలో అధికారికంగా ప్రకటన రానుంది.

Teja Sajja Hanuman sentiment: హనుమాన్ సెంటిమెంట్‎తో వస్తున్న తేజ సజ్జ

పాన్ వరల్డ్ సినిమాగా సంక్రాంతి వేళ రిలీజ్ కాబోతోంది హనుమాన్ (Hanuman) మూవీ. యంగ్ హీరో తేజ సజ్జ (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prashanth Varma) డైరెక్షన్ల లో వస్తున్నా ఈ మూవీపై భారీ అంచనాలు పెరిగాయి.

Hanuman Sankranti Movies 2024: సంక్రాంతికి వచ్చే సినిమాలు ఇవే.

ప్రైమ్ షో ఎంట‌ర్‌టైన్‌మెంట్ పతాకంపై కె.నిరంజన్‌ రెడ్డి (Niranjan Reddy) హనుమాన్ మూవీని ప్రొడ్యూజ్ చేస్తున్నారు. హ‌నుమంతుడి సపోర్ట్ తో సూప‌ర్ హీరోగా మారిన ఓ యువ‌కుడి స్టోరీనే హ‌నుమాన్ .

ఈ సినిమాలో తేజ సజ్జకు జోడీగా అమృత అయ్యర్ (Amrutha Ayyar)నటిస్తుండగా.. వరలక్ష్మి శరత్ కుమార్ (Varalakshmi Sharath Kumar)కీలక పాత్రలో కనిపించనుంది.

ఈ మూవీకి గ్రాఫిక్స్ హైలెట్ అనే చెప్పాలి. గత ఏడాది విడుదలైన భారీ బడ్జెట్ సినిమా ఆదిపురుష్ ని మించి గ్రాఫిక్స్ ని పండించారు మేకర్స్. దీంతో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది.

ఈ జనవరి 12న తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్ భాషల్లో హనుమాన్ విడుదల కాబోతోంది.

ఇదే క్రమంలో ఈ మూవీలో అంజ‌నేయుడి క్యారెక్టర్ కి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. హ‌నుమాన్ పాత్ర‌లో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)అతిథి పాత్రలో క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

Venkatesh Saindhav is ready for Sankranti : సంక్రాంతికి వెంకటేష్ సైంధవ్ రెడీ

టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేశ్(Venkatesh) సైంధవ్ (Saindhav)సినిమాతో సంక్రాత్ బరిలో నిలిచారు. వెంకీ నటిస్తున్న 75వ చిత్రం సైంధవ కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

219590 4 Sankranti Movies 2024: సంక్రాంతికి వచ్చే సినిమాలు ఇవే.

హిట్ మూవీ ఫేమ్ డైరెక్టర్ శైలేష్ కొలను (Shailesh Kolanu) రూపొందించిన ఈ మూవీలో శ్రద్ధ శ్రీనాథ్ (Shraddha Srinath)హీరోయిన్ గా నటిస్తుంది.

ప్రొడ్యూసర్ వెంకట్ బోయనపల్లి (Venkat Boinapally) నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ (Niharika Entertainment)పతాకంపై ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని నిర్మించారు.

ఓ వైపు పాప సెంటిమెంట్ మరోవైపు యాక్షన్ ఎలిమెంట్స్‎తో తాజాగా విడుదలైన ట్రైలర్ అంచనాలను పెంచింది. ఎప్పటిలాగే ఈ సంక్రాంతికి వెంకటేష్ ఖాతాలో భారీ హిట్ ఖాయమని తెలుస్తోంది. ఈ మూవీని జనవరి 13న విడుదల చేస్తున్నారు.

Action thriller Eagle : యాక్షన్ థ్రిల్లర్ ఈగల్

మాస్ మహారాజ రవితేజ (Raviteja) హీరోగా కార్తిక్ ఘట్టమనేని డైరెక్షన్ లోవ స్తున్న మూవీ ఈగల్ (Eagle). యంగ్ బ్యూటీస్ కావ్యా థాపర్ (Kavya Thapur),

ravi teja eagle 33 1686575270 Sankranti Movies 2024: సంక్రాంతికి వచ్చే సినిమాలు ఇవే.

అనుపమా పరమేశ్వరన్‌ (Anupama Parameshwaran) ఈ మూవీలో హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీని సంక్రాంతి సందర్భంగా ఈ నెల 13న విడుదల చేయనున్నారు.

తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ కు రెడీ అయ్యింది. రీసెంట్ గా విడుదలైన రవితేజ లుక్ మూవీపై అంచనాలను పెంచేసింది.

perfect Sankranti movie Naa Samiranga : సంక్రాంతి సినిమాగా వస్తున్న నా సామిరంగ

maxresdefault 14 Sankranti Movies 2024: సంక్రాంతికి వచ్చే సినిమాలు ఇవే.

బంగార్రాజు (Bangaraju)మూవీ తర్వాత సీనియర్ యాక్టర్ నాగార్జున(Nagarjuna) చేసిన ది ఘోస్ట్ (The Ghost)మూవీ పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

నాగార్జున స్టార్ డమ్‌పై ఎఫెక్ట్ చూపించింది. ఈ క్రమంలో ఈ సంక్రాతికి మళ్లీ తన సత్తా చూపించేందుకు రెడీ అయ్యారు నాగార్జున. మాస్ ఓరియంటెడ్ సబ్జెక్ట్‌తో సంక్రాంతి బరిలోకి దిగనున్నాడు.

కొరియోగ్రాఫర్ విజయ్ బన్నీ (Vijay Bunny) డైరెక్టర్ గా మొదటిసారి ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. నా సామి రంగ (Na Sami Ranga)అనే టైటిల్‌తో వస్తున్న ఈ సినిమాలో అమిగోస్ బ్యూటీ ఆశికా రంగనాథ్ (Ashika Ranganath)

హీరోయిన్ గా నటిస్తుండగా , కీలక పాత్రల్లో హీరో అల్లరి నరేష్ (Allari Naresh), రాజ్ తరుణ్ (Raj Tharun) కనిపించనున్నారు. ఈ మూవీని ముందుగా జనవరి 24న రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదల చేయనున్నారు.

Leave a Comment