Pallavi Prashant: రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ గెలుపుకు కారణాలు ఇవే..

These are the reasons for the victory of the farmer's child Pallavi Prashanth.

Pallavi Prashant: రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ గెలుపుకు కారణాలు ఇవే..

బిగ్ బాస్ సీజన్ 7 విజేతగా నిలిచి రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ సెన్సేషనల్ రికార్డు సృష్టించాడు. హౌస్‎లోకి ఎంటరైన మొదటి రోజు నుంచే తనదైన ఆట తీరుతో తోటి కంటెస్టెంట్లకు గట్టి పోటీ ఇచ్చాడు ఈ రైతు బిడ్డ.

ఎలాంటి సపోర్ట్ లేకపోయినా కామన్ మెన్‎గా బిగ్ బాస్ హౌస్‎లోకి రావడంతో జనం నుంచి భారీ ఆదరణ లభించింది. ప్రజల ఓట్లు, తన ఆటతీరుతో ఎట్టకేలకు పల్లవి ప్రశాంత్ టైటిల్ కొట్టేశాడు.

మరి ప్రశాంత్ గెలుపుకు అసలైన కారణాలేమిటో పబ్లిక్ ఏమనుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం.పల్లవి ప్రశాంత్..ఈ పేరు ఇప్పుడు రైతులకు ఓ బ్రాండ్ అయ్యింది.

సోషల్ మీడియాలో ఎక్కడ పల్లవి ప్రశాంత్ పేరు మారుమోగిపోతోంది. సెలబ్రిటీలతో తలపడి బిగ్ బాస్ సీజన్ 7లో విన్నర్ గా నిలిచి కామన్ మెన్ సత్తా ఏంటో చూపించాడు ఈ మట్టి మనిషి.

బిగ్ బాస్ సీజన్ 7లో ఈ సారి కంటెస్టెంట్లు అందరూ ఒకరికి మించి ఒకరు పోటీ పడ్డారు. ఫైనల్స్ వరకు నువ్వా నేనా అన్నట్లు టాస్కుల్లో రెచ్చిపోయారు. ఈ సీజన్ లో సినీ ఇండస్ట్రీ నుంచి, బుల్లితెర సీరియల్స్ లో నటించే నటులు, యూట్యూబర్స్ ఉన్నారు.

వీరందరూ సినీ నేపథ్యం నుంచి వచ్చినవారే. ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ కల్చర్ వీరికి బాగా తెలుసు. అయితే రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ మాత్రం వేరు. పల్లవి ప్రశాంత్ ఓ రైతు. ఇతని నేపథ్యం వేరు.

ఇండస్ట్రీ ఎలా ఉంటుందో అసలు ఐడియా కూడా లేని వ్యక్తి. హాయ్ ఫ్రెండ్స్ అంటూ అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో వీడియోలు చేయడం మాత్రమే తెలుసు.

Add a heading 2023 12 18T134631.118 Pallavi Prashant: రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ గెలుపుకు కారణాలు ఇవే..

అతను పెరిగిన వాతావరణం వేరు పరిస్థితులు వేరు. అలాంటి నేపథ్యం నుంచి వచ్చినా పల్లవి ప్రశాంత్ టైటిల్ సాధించి అందరిని సర్‎ప్రైజ్ చేశాడు.

బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడం అంత ఈజీ విషయం కాదు. వెళ్లడమే కాదు హౌస్ లో ఉండటం కూడా తేలికైన విషయమేం కాదు. స్క్రీన్ ముందు అంతా సరదాగా ..ఫ్రీగా తిరుగుతూ కనిపించినా ..

హౌస్ లోపల ఎక్కువ రోజులు ఉండలేరు. గత సీజన్లలో నటుడు సంపూర్ణేశ్ బాబు హౌస్ లో ఎక్కువ రోజులు ఉండలేకపోయాడు. ఆట మధ్యలోనే వెనుదిరిగాడు. యూట్యూబర్ గంగవ్వది కూడా అదే పరిస్థితి. ఏసీ గదుల్లో ఎక్కువ రోజులు ఉండలేక బయటికి వచ్చేసిన సంగతి తెలిసిందే.

సాధారణంగా సినీ బ్యాక్ గ్రౌండ్, సీరియల్స్ నుంచి వచ్చిన వారి మధ్య కాస్త పరిచయం ఉంటుంది. దీంతో బిగ్ బాస్ హౌస్ వాతావరణానికి వారు తొందరగా అలవాటు పడతారు.

కానీ వీరెవరూ ప్రశాంత్ కి తెలియదు. వారు ఎలా ఉంటారో తెలియదు. అదే ప్రశాంత్ కి ప్లస్ పాయింట్ అయ్యింది. అయినప్పటికి తన గురి టైటిల్ మీద పెట్టాడు అనుకున్నది సాధించాడు.

ఆట మొదటి నుంచి తనని రైతు బిడ్డగా పరిచయం చేసుకుంటూ వచ్చాడు పల్లవి ప్రశాంత్.. తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు.

తనను రైతు బిడ్డా అంటూ ప్రమోట్ చేసుకోవడం హౌస్ లో చాలా మందికి నచ్చేది కాదు అయినా తాను అనుకున్న విషయాన్ని నిర్మొహమాటంగా చెప్పేవాడు ప్రశాంత్.

హౌస్ లో కొంత మంది ప్రశాంత్ కి క్లోజ్ అయ్యారు. వారి పట్ల సాన్నిహిత్యాన్ని పెంచుకున్నాడు ఈ రైతు బిడ్డ. అవసరమైన చోట ‘బరా బర్ చెప్తా … నేను ఇంతే’ అంటూ తనదైన వాదనను గట్టిగా వినిపించాడు.

పల్లవి ప్రశాంత్ ఎందుకు టైటిల్ విన్ అయ్యాడు? అనే ప్రశ్నకి మూడే విషయాలు వినిపిస్తున్నాయి. ఒకటి అతనిలోని పోటీతత్వం..

ఇంకొకట నిజాయతీతో కూడిన అమాయకత్వం మరోకటి రైతుల పట్ల ప్రశాంత్ వ్యక్తం చేసిన ప్రేమ. ఈ మూడే పల్లవి ప్రశాంత్ ను విజేతగా నిలబెట్టాయి. ఆట మొదలైనప్పటి నుంచి చివరి వరకు ఇదే ఫార్ములాను నమ్మాడు.

Leave a Comment