ఎవరైనా ఫిబ్రవరి 29 వ తేదీ రోజున పెళ్లి చేసుకున్నా లేదంటే ఫ్రిబ్రవరి 29 వ తేదీన పుట్టిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నా చాలా లక్కీ ఫెలో అని చెప్పొచ్చు. ఎందుకంటే పెళ్లి రోజును జీవితంలో మర్చిపోలేడు, భార్య చేతిలో తిట్లు చీవాట్లు తినే బాధ తప్పుతుంది.
ఇక భార్య పుట్టిన రోజు మర్చిపోయిన మగవాడి జీవితం ఎలా ఉంటుందో చెప్పాలా, ఎత్తిపొడుపు మాటలు, దెప్పి పొడుపులు వినలేక విసుగొస్తుంది. కాబట్టి ఫిబ్రవరి 29 న బర్త్ డే ఉన్నా మ్యారేజ్ డే ఉన్నా చాలా లక్కీ అనే చెప్పాలి. ఈ మాటలను సీరియస్ గా తీసుకోవద్దు సుమండీ, లీఫ్ ఇయర్ గురించి చెప్పడానికి సరదా కోసం వాడిన మాటలే తప్ప ఆడవారిని నొప్పించాలని కాదు.
చాలా మదిలో ఉన్న సందేహ అదే : That is the doubt in many minds
లీఫ్ ఇయర్ పేరు చెప్పగానే చాలా మందికి చాలా సందేహాలు ఉన్నాయి. లీఫ్ ఇయర్ అనేది అసలు నాలుగేళ్లకు ఒకసారి మాత్రమే ఎందుకు వస్తుంది, అందులోను ఫిబ్రవరిలో నే ఎందుకు వస్తుంది, అసలు ఫిబ్రవరికి 28 రోజులే ఎందుకు ఉన్నాయి. ఇలాంటి సందేహాలు చిన్నతనంలో మీకు కూడా వచ్చే ఉంటాయి కదా ? అయితే ఈ లీఫ్ సంవత్సరం గురించి తెలియని వారికి మాత్రం ఇది చాల బాగా ఉపయోగపడుతుంది.
లీఫ్ ఇయర్ ఎందుకు వస్తుంది అంటే ? Why does the leap year come?
ర్యుడు చుట్టూ భూమి తిరుగుతూ ఉంటుంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూరా తిరిగి రావడానికి 365 రోజులు పడుతుంది అని మనందరికీ తెలుసు, కానీ సరిగ్గా 365 రోజులు మాత్రమే కాదు, అంతకన్నా కొన్ని గంటలు నిమిషాలు ఎక్కువే పడుతుంది. సరిగ్గా చెప్పాలంటే 365 రోజుల 5 గంటల 48 నిమిషాల 46 సెకండ్లు పడుతుంది.
అంటే మరి ఈ అధిక సమయాన్ని తీసి పక్కన పెట్టలేము, కేవలం ఐదు గంటలకు ఒక రోజును పూర్తిగా కేటాయించను లేము. అందుకే ఈ 365 రోజుల తరవాత వచ్చే 5 గంటల 48 నిమిషాల 46 సెకండ్ల సమయాన్ని మొత్తాన్ని నాలుగు సంవత్సరాలకు ఒకసారి కలిపితే ఒక రోజు అవుతుంది, కాబట్టి దానిని నాలుగు సంవత్సరాల తరవాత ఒక రోజుగా చేర్చుకుని దానినే లీఫ్ ఇయర్ ఎక్స్ట్రా డే గా పిలుచుకుంటున్నాం.
ఆ ఎక్స్ ట్రా డే ఫిబ్రవరిలోనే ఎందుకు ? Why is that extra day in February?
లీఫ్ ఇయర్ లో వచ్చే అదనపు రోజుతో కలుపుకుంటే మొత్తం 366 రోజులు అవుతాయి, అయితే అదనంగా వచ్చిన ఆ రోజును ఫిబ్రవరి లోనే ఎందుకు కలపాలి, జనవరి మాసానికి 31 రోజులు ఉన్నాయి కదా అలాగే ఈ అదనపు రోజును తీసుకువెళ్లి ఏదైనా 30 రోజులు ఉన్న నెలకు కలిపి దానిని 31 రోజులు చేయొచ్చు కదా అని అనిపించవచ్చు.
అలా చేసినా తప్పులేదు. కానీ కాలెండర్ కనిపెట్టిన తరువాతి కాలంలో వారు నాలుగేళ్లకు ఒకసారి వస్తున్న ఈ అదనపు రోజును ఫిబ్రవరిలోనే కలిపారు కాబట్టి మనం కూడా దానినే అనుసరిస్తున్నాం.
మొదట్లో ఈ లీఫ్ ఇయర్ ఏ నెలలో ఉండేదంటే ? Initially this leap year was in which month?
ఈ ఇంగ్లిష్ కాలెండర్ అనేదానిని క్రీస్తు పూర్వమే కనిపెట్టారు, అయితే క్రీస్తు పూర్వం రోమన్లు, గ్రీస్ వారు కాలెండర్ ను తమ ఇష్టా రీతిన మార్చేస్తూ ఉండేవారు. కానీ రోమ్ చక్రవర్తి జూలియస్ కాసర్ అధికార పగ్గాలు చేపట్టాక ఆ మార్పులకు చెక్ పెట్టాడు.
తన హయాంలోనే కాలెండర్ కి 365 రోజులు అనేదానిని ప్రవేశపెట్టాడు. అలాగే ప్రతి నాలుగేళ్లకు ఒక అదనపు రోజును కలిపాడు. దానినే లీఫ్ ఇయర్ అని పిలవడం స్టార్ట్ చేశారు. కానీ అప్పట్లో ఈ అదనపు రోజు ఆగస్టు లో ఉండేది. అంటే ఆగస్టులో అప్పటికి 28 రోజులు మాత్రమే ఉండగా లీఫ్ ఇయర్ లో వచ్చే ఈ అదనపు రోజు కలవడం వల్ల 29 రోజులు వచ్చేవి. కాగా అప్పట్లో ఫిబ్రవరికి 30 రోజులు జూలైకి 31 రోజులు ఉండేవి.
మరి ఫిబ్రవరికి 2 రోజులు ఎలా తగ్గాయి ? how 2 days have decreased in February?
జూలియస్ కాసర్ తరవాత రోమ్ చక్రవర్తిగా కాసర్ ఆగస్టస్ వచ్చాడు. అతనికి ఈ విధానం నచ్చలేదు, అందుకు ప్రధాన కారణం అయన పుట్టిన ఆగస్టు నెలలో కావడమే. తాను పుట్టిన నెలకి ఒకరోజు తక్కువగా ఉండటాన్ని అవమానంగా ఫీలయ్యాడు. అందుకే తక్కువ రోజులుగా ఉన్న ఆగస్టు నెలకు రెండు రోజులు కలిపి ఫిబ్రవరి నెలలో రెండు రోజులు తీసేశాడు.
అంతా బాగానే ఉంది కానీ ఫిబ్రవరి నెలలోనే ఎందుకు తీసేయాలి ? మరేదైనా నెలలో తీసేయొచ్చు కదా అని అనుమానం రావచ్చు. అందుకు కూడా కారణం ఉంది, తనకన్నా ముందు పాలించిన రాజు జూలియస్ కాసర్ పుట్టింది ఫిబ్రవరిలో కాబట్టి ఆ రెండు రోజులను ఫిబ్రవరి నుండి కత్తిరించాడు. కానీ కాసర్ ఆగస్టస్ తరవాత వచ్చిన వారెవరు కూడా ఈ కాలెండర్ లో ఎటువంటి మార్పులు చేయలేదు కాబట్టే ఇప్పటికీ ఫిబ్రవరిలో 28 రోజులే ఉన్నాయి, లీఫ్ ఇయర్ లో 29 వ రోజు వస్తోంది.
మరి లీఫ్ ఇయర్ లో పుట్టిన వాళ్ల పరిస్థితి ఏంటి ? what is the situation of those born in a leap year?
ఎవరైనా సంవత్సరానికి ఒక పుట్టిన రోజు చేసుకుంటారు, కాబట్టి ప్రతిఏడాది ఒక సంవత్సరం పెరుగుతుంది, మరి లీఫ్ ఇయర్ లో పుట్టిన వాళ్ళు పుట్టిన రోజు నాలుగేళ్లకు ఒకసారి చేసుకోవాలా అంటే, అలాంటి రూల్ ఏమి లేదు, అది వారిష్టం, హిందువులైతే పుట్టిన సమయాన్ని బట్టి తిధుల ప్రకారం చేసుకుంటారు, ఇతర మతాలలోని వారు ఫిబ్రవరి 28 వ తేదీన గాని లేదంటే మార్చ్ 1వ తేదీన కానీ పుట్టిన రోజు చేసుకుంటారు.
కొన్ని సవరణలు : Some modifications
46 BC సమయంలో జూలియస్ సీజర్, జూలియన్ అని పిలవబడే క్యాలెండర్‌ను ప్రవేశపెట్టాడు. కానీ ఆ కాలెండర్ లో కొన్ని అవకతవకలు ఉన్నాయి. ఆలోపాలను 1582లో సరిచేశారు, అలా సరిచేయబడ్డ కాలెండర్ కు గ్రెగోరియన్ క్యాలెండర్ అని పిలిచేవారు.
ఇప్పటికీ మనం దానినే వాడుతున్నాం.ఇక ఈ ఫిబ్రవరి 29వ తేదీకి కొన్ని విశేషాలు ఉన్నాయి. ఫిబ్రవరి 29 న కొన్ని దేశాలు కొన్ని నిబంధనలు పాటిస్తాయి, అందులో గ్రీస్ దేశం ఒకటి, ఫిబ్రవరి 29 వ తేదీన ఆ దేశంలో పేకాట కానీ జూదం కానీ ఆడటం నిషేధం. అలాగే ఐర్లాండ్ లో ఫిబ్రవరి 29 వ తేదీన తమ మనసుకు నచ్చిన వారికి తమ ప్రేమను వ్యక్త పరచడం అదృష్టంగా భావిస్తారట. అది స్త్రీలైనా పురుషులైనా సరే.