ఈ వస్తువులు కాని మంచం క్రింద పెట్టారా, ఇక అంతే !

website 6tvnews template 2024 03 27T161444.416 ఈ వస్తువులు కాని మంచం క్రింద పెట్టారా, ఇక అంతే !

ప్రపంచంలోని ప్రతిదీ మానవ జీవితానికి సంబంధించినదే దేనితోను సంబందం లేదు అనుకోలేము అది మనుషులు అయిన వస్తువులు అయిన. అంతే కాదు మనం నివసించే ఇంట్లో ఉన్న వంటగది నుంచి ఇంట్లో ఉండే అన్ని వస్తువుల వరకు ప్రతీది మన జీవితాలపై ఎంతో కొంత ప్రభావం చూపుతాయి శాస్త్ర పండితులు. అందుకే మనం ఉండే ఇల్లు పక్కా వాస్తు ఉండేల చూసుకోవాలి అంటారు పండితులు. మీరు ఉంటున్న ఇంటిలో వాస్తు దోషాలు ఉంటే, మీరు జీవితాంతం అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుందని చెప్తున్నారు పండితులు. మన ఇంట్లో పడుకోవడం అనేది చాలా ముఖ్యమైనది, ఎలా పడుకుంటున్నామ్ అనేది కుడా అవసరమైన విషయం అనే చెప్పాలి.

వాస్తు రీత్యా మీరు పడుకునే మంచం కరెక్ట్ గా ఉండాలి, అలా లేకపోతే అనుకోని సంఘటలను జరగడం, పీడ కలలు రావడం లేదా అనారోగ్య సమస్యలు రావడం జారుతూ ఉంటుంది. అలాగే కొందరు పెట్టుకునేందుకు స్ధలం లేకపోవడం లేదా అనువు గా తీసుకునేటట్లు ఉంటుంది అని కొన్ని రకాల వస్తువులు మంచం కింద పెడుతూ ఉంటారు. కొన్ని రకాల వస్తువులను ఎట్టి పరిస్థితుల్లోనూ మంచం కింద ఉంచకూడదు. అలా ఉంటే, అది జీవితంపై హానికరమైన ప్రభావాలను చూపుతూ ఉంటాయి.

ఇప్పుడు ఏ వస్తువులు మంచం కింద పెడితే ఎలాంటి దోషాలు కలుగుతాయో తెలుసుకుందాం !

ఇనుము :

మీరు పడుకునే మంచం కు ఇనుము తో తయారు చేసిన పట్టీలు లేదా ఫ్రేములు ఉంటాయి. ఇవి ఒక విధం గా చాలా చెడు ప్రభావాలను చూపెడుతుంది. కాబట్టి ఇనుముతో కూడిన వస్తువులు మంచం కింద పెట్టకండి. వాస్తు శాస్త్రం ప్రకారం మీ మంచం క్రింద ఉపయోగించని ఇనుప వస్తువులు లేదా చెత్తను ఉంచడం చెయ్యకండి. మీరు ఉపయోగించే వస్తువులు అయిన కుడా వాటిని మంచం క్రింద ఉంచకుండా వేరే
ప్రదేశం లో పెట్టండి. వాస్తు ప్రకారం ఇనుము అనేది నైరుతి దిక్కున పెడితే మంచిది అని శాస్త్ర నిపుణులు చెప్తున్నారు.లేకుంటే కుటుంబం సమస్యలు మిమ్మల్ల్ని ఎప్పుడు వెంటాడుతూ ఉంటాయి.

గాజు :

వాస్తు శాస్త్రం ప్రకారం మేరు పడుకునే మంచం తల వెనుక బాగం లో లేదా మంచం కింద గాజు వస్తువులతో పాటు మీరు అప్పుడప్పుడు మీ ఫేస్ చూసుకుంటూ అద్దం మంచం కింద పెదాతారు అలా పెట్టకూడదు. ఇలాగే వదిలేస్తే భార్య భర్తల మద్య గొడవలు రావడం లేదా వారి దాంపత్య జీవితంలో రక రకాల సమస్యలు రావడం జరుగుతుందని శాస్త్రం చెప్తోందని పెద్దలు చెప్తున్నారు. అలాగే కొత్త గా పెళ్లయిన జంటల మధ్య మనస్పర్థలు ఏర్పడి బంధంలో చీలిక వచ్చే ప్రమాదం కూడా ఉందని శాస్త్ర పండితులు చెప్తున్నారు. కాబట్టి మంచం కింద కాని మంచం మీద కాని ఎప్పుడు అద్దం పెట్టకండి.

చీపురు :

అలాగే మనలో చాల మంది ఇల్లు తుడుస్తూ ఒక్కసారి చీపురు ను మంచం కింద వదిలేస్తూ ఉంటారు. చీపురును ఎట్టి పరిస్థితుల్లోనూ మంచం కింద ఉంచకండి. లేదంటే భార్యాభర్తల మధ్య తరచూ ఆర్ధిక సంబందమైన గొడవలు జరుగుతాయి. అలాగే చీపురును బెడ్ కింద పెట్టడం వల్ల అనేక స్త్రీలకూ అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇలా చీపురును వదిలేయడం వల్ల ఎప్పుడు చూడనటువంటి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.

చెప్పులు – పలు రకాల బూట్లు

సాదారణం గా ఈ రోజుల్లో అందరు ఇళ్ళల్లో కూడా చెప్పులు కాని ఒక రకమైన బూట్లు కాని వేసుకుంటి ఇంట్లో తిరుగుతూ ఉంటారు. అలా చెప్పులు వేసుకుని ముఖ్యం గా వంట గది లోకి వెళ్ళకూడదు. ఎందుకంటే ఆ చెప్పులతోనే అందరు వాష్ రూమ్ కి వెళ్తారు మళ్ళి అవే చెప్పులతో ఇంట్లో తిరుగుతూ ఉంటారు. అలా తిరగడం వల్ల లక్ష్మి దేవి అనుగ్రహం తగ్గిపోతుంది అని పండితులు చెప్తున్నారు. కొంత మంది అయితే అవే చెప్పులను కాని బూట్లు కాని మంచం దగ్గర లేదా తల దగ్గర పెట్టుకుని పడుకుంటారు. అలా పడుకుంటే వారి ఆయుష్హు తగ్గిపోతుందని పండితులు చెప్తున్నారు. అది మీ జీవితంలో నెగెటివ్ ఎనర్జీని పెంచి అనేక సమస్యలను ఎదుర్కోనేలా చేస్తుంది. కాబట్టి మంచం కింద చెప్పులు కాని బూట్లు కాని పెట్టకండి. ఒకవేళ అవి వదలాలి అనుకుంటే అవి వాష్ రూమ్ దగ్గర వదిలేయండి.

ఎలెక్ట్రికల్ సామానులు

మీరు పడుకునే మంచం కింద ఎప్పుడు ఎలెక్ట్రికల్ సామానులు పెట్టకండి. అలా పెడితే ఇంట్లో డబ్బు నిల్వ ఉండదని శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. అంతే కాదు మీకు నిద్ర కు సంబందించి అనేక సమస్యలు
వస్తాయి . అలాగే మీకు నిద్ర కూడా పట్టదు. ఇంట్లో ఉండే కుటుంబ సబ్యుల మద్య అనవసరమైన గొడవలు రావడం జరుగుతుంది. కాబట్టి మంచం కింద ఎప్పుడు ఖాళి గా ఉంటె మంచిది అని శాస్త్ర పండితులు చెప్తున్నారు.కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఎల్లపుడు మీ కుటుంబ సబ్యులతో అనందం గా ఉండడమే కాకుండా ఎటువంటి సమస్యలు రాకుండా సుఖ సంతోషాలతో ఉండవచ్చని పండితులు చెప్తున్నారు.

Disclaimer:
ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మీకు అందించడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ 6Tv ఇవ్వడం లేదు. అలాగే ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. మా ఉద్దేశం సమాచారం అందించడం వరకు మాత్రమే. ఏదైనా పాటించే ముందు లేదా సందేహాలు ఉన్న సంబంధిత నిపుణుల సలహా తీసుకోమని మనవి చేస్తున్నాం.

Leave a Comment