These13 ‘dangerous’ Android apps: ఈ 13 యాప్స్ పైన గూగుల్ తల్లి వేటు వేసింది.
ప్రపంచం మొత్తం డిజిటల్ టెక్నాలజీ వైపు అడుగులు వేస్తుంది. కానీ, అంతే వేగంగా ఫేక్ న్యూస్ తో పాటు, ఫేక్ ప్రొడక్ట్స్ కూడా డిజిటల్ మార్కెట్ లో రోజు రోజుకు పెరిగి పోతున్నాయి.
ఇలాంటి, వాటిని గురతుపట్టి గూగుల్ ఎప్పటికప్పుడు డిలేట్ చేస్తూనే ఉంటుంది. అదేవిధంగా, రీసేంట్ గా ఒక 13 యాప్స్ పైన గూగుల్ తల్లి వేటు వేసింది.
అలాంటి యాప్స్ మీ మొబైల్ లో ఉంటే వెంటనే వాటిని డిలీట్ చేయండి. ఆ యాప్స్ ఏమితో ఇప్పుడు తెలుసుకుందాం
యూజర్ల ఫోన్స్ కు నష్టం కలిగించే 13 ఆండ్రాయిడ్ యాప్స్‌ను గూగుల్ బ్యాన్ చేసింది. వాటిని ప్లే స్టోర్ నుంచి కూడా తొలగించింది.
25 యాప్‌ల్లో Xamalicious మాల్వేర్ ఉన్నట్లు ఇటీవల మెక్అఫీ మొబైల్ రిసెర్చ్ టీమ్ గుర్తించింది. అందుకే, అలాంటి యాప్స్ పైన వేటు వేసింది.
అలాంటి ఫేక్ యాప్స్ గూగుల్ ప్లేస్టోర్‌లో ఉన్నట్లు గూగుల్ గుర్తించింది. ఈ డేటా ఆధారంగా వినియోగదారుల భద్రతను దృష్టిలో పెట్టుకుని తాజా నిర్ణయం తీసుకుంది గూగుల్ తెలిపింది.
Xamalicious అంటే Xamarin అనే ఓపెన్ సోర్స్ ప్లాట్‌ఫామ్‌పై రూపొందిన మాల్వేర్ అని అర్ధం. దీనికి మెక్అఫీ మొబైల్ రిసెర్చ్ టీమ్ తెలిపింది. ఈ Xamalicious చేసే మోసాల గురించి అది వివరించింది.
‘Xamalicious బారిన పడిన యాప్‌లు సోషల్ ఇంజినీరింగ్ వ్యూహాల ద్వారా యూజర్ల ఖాతాల యాక్సెస్‌ను పొంది, తరువాత మొబైల్ యూజర్‌కు తెలియకుండా కమాండ్-అండ్-కంట్రోల్ సర్వర్‌తో కమ్యూనికేషన్ ఏర్పడుతుంది.
ఆ తర్వాత సర్వర్, మొబైల్లో రెండో మాల్వేర్ ను ఇన్స్టాల్ చేస్తుంది. దానితరువాత యూజర్ మొబైల్ సర్వర్ నియంత్రణలోకి వెళ్లిపోతుంది. అప్పటి నుంచి యాజర్‌కు తెలియకుండా యాడ్లపై క్లిక్ లు చేయడం స్టార్ట్ అవుతుంది
ఇతర యాప్‌లను ఇన్స్టాల్ చేయడం వంటి మోసపూరిత చర్యలకు ఆ మాల్వేర్ పాల్పడుతుందని, రిసెర్చ్ టీమ్ పేర్కొంది. అయితే, ఇప్పటికే ఈ యాప్స్‌ని లక్షలాది మంది యూజర్లు డౌన్‌లోడ్ చేశారు.
ఒకవేళ మీరు కూడా వాటిని డౌన్‌లోడ్ చేసినట్లైతే గూగుల్ ప్లేస్టోర్ నుంచి తొలగించాలని పేర్కొంది. అందుకే, వీలైనంత త్వరగా మీ మొబైళ్ల నుంచి వాటిని డిలీడ్ చేయండి. ఇప్పుడుగూగుల్ బ్యాన్ చేసిన యాప్స్ ఏమితో తెలుసుకుందాం
ఎసెన్షియల్ హోరోస్కోప్ ఫర్ ఆండ్రాయ్,త్రిడీ స్కిన్ ఎడిటర్ ఫర్ పీఈ మైన్క్రాప్ట్, లోగో మేకర్ ప్రో, ఆటో క్లిక్ రిపీటర్, కౌంట్ ఈజీ క్యాలరీ క్యాలుక్యూలేటర్, సౌండ్ వాల్యూమ్ ఎక్స్టెండర్,
లెటర్ లింక్, న్యూమరాలజీ : పర్సనల్ హోరోస్కోప్ & నంబర్ ప్రిడిక్షన్స్, స్టెప్ కీపర్ : ఈజీ పెడో మీటర్, ట్రాక్ యువర్ స్లీప్,
సౌండ్ వాల్యూమ్ బూస్టర్, ఆస్ట్రోలాజికల్ నావిగేటర్ :డెయిలీ హోరోస్కోప్ & టరోట్, యునివర్సల్ కాల్క్యులేటర్ ఈ యాప్స్ మీ మొబైల్ లో ఉంటే వెంటనే డిలీట్ చేయండి.