They said I am not fit for movies says actress shobhita dhulipalla : సినిమా ఇండస్ట్రీలో ఫ్యామిలీ మెంబర్స్ ఉంటేనే రాణిస్తారు అన్నది ఒకప్పటి మాట. టాలెంట్ ఉంటే చాలు ఎవ్వరైనా స్టార్ అవ్వగలరని నేటి యువత నిరూపిస్తోంది.
బడా స్టార్లు నటించిన బడా సినిమాలే కాదు, వెండితెరకు తొలిసారిగా పరిచయమవుతున్న యంగ్ హీరోలు, హీరోయిన్లు, ఆర్టిస్టులు తమ టాలెంట్ తో ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకుంటున్నారు. ఇక సోషల్ మీడియా పుణ్యమా గల్లీకో స్టార్ పుట్టుకొస్తున్నాడు. వెండి తెరమీద అవకాశాలను సొంతం చేసుకుంటున్నారు. ఇండస్ట్రీలో కొత్త టాలెంట్ కనిపిస్తున్నప్పటికీ నెపొటీజం గురించి ఏదో ఒక వార్త ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటుంది. తాజాగా శోభిత ధూళిపాళ్ల (Shobhita Dhulipalla ) నెపొటిజంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ప్రతిభ ఉంటేనే ఇండస్ట్రీ లో రాణిస్తారని తెలిపింది.
నెపోటిజంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు :
ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ కి వచ్చిన తెలుగమ్మాయి శోభితా ధూళిపాళ్ల (Shobhita Dhulipalla). ఇక్కడి అమ్మాయి అయినా మొదట బాలీవుడ్ నుంచే పరిచయమైంది.
నార్త్, సౌత్ అనే తేడా లేకుండా వరుస సినిమాలతో, వెబ్ సిరీస్ లతో ప్రేక్షకులను అలరిస్తూ కెరీర్ లో విజయవంతంగా కొనసాగుతోంది. లేటెస్ట్ గా ఈ ముద్దుగుమ్మ ఓ ఈవెంట్ లో గెస్ట్ గా పాల్గొని తన కెరీర్ గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది.
సినీ ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్స్ ఎవరూ లేకున్నా..తను ఎలా సక్సెస్ అయిందో చెప్పుకొచ్చింది. అంతేకాదు నెపోటిజం గురించి మాట్లాడింది. ” ఇండస్ట్రీలో నా కుటుంబ సభ్యులు ఎవరూ లేరు. నా ఇంట్రెస్ట్ తో సొంతంగా నేనే సినీ రంగంలోకి వచ్చాను. మిస్ ఇండియా పోటీల అనంతరం యాడ్స్ షూట్ చేసే ఛాన్స్ వచ్చింది. మోడల్ గా నేను ఎన్నో ఆడిషన్స్ కు వెళ్లాను. స్వాతహాగా క్లాసికల్ డ్యాన్సర్ కావడంతో ఎక్స్ ప్రెషన్స్ కూడా బాగానే ఇచ్చేదాన్ని.
ముఖ్యంగా నాకు మూవీస్ లో యాక్ట్ చేయడం అంటే ఎంతో ఆసక్తి. సినిమా ఛాన్స్ ల కోసం కూడా చాలా ఆడిషన్స్ కు వెళ్లాను. నా కెరీర్ లో ఇప్పటి వరకు 600లకు పైగా ఆడిషన్స్ కు వెళ్ళాను. నా దృష్టిలో ఆడిషన్ అనేది PH పరీక్ష లాంటిది. ఒక సినిమాలో ఆయా క్యారెక్టర్ కు ఎంత వరకు సెట్ అవుతాం అనేది ఆడిషన్స్ ద్వారానే మేకర్స్ తెలుసుకుంటారు . అందులో తప్పేమి లేదు”అని చెప్పుకొచ్చింది శోభిత.
తెల్లగా లేనని హేళన చేశారు :
“ఏ రంగంలోనైనా మొదట్లో ఇబ్బందులు తప్పవు. నేను యాడ్ షూట్ చేసేప్పుడు చాలా మంది నన్ను చూసి హేళన చేసే వారు. అందంగా లేవని, తెల్లగా లేనని, నటించేందుకు పనికిరానని ముఖం మీదే చెప్పే వాళ్లు. అయినా నేను వెనకడుగు వేయలేదు. నా దృష్టిలో అందం అనేది ఆలోచన మాత్రమే అని ఫిక్స్ అయ్యాను. నన్ను చూసి ఆడియన్స్ ఏమనుకుంటారో అనే ఫీలింగ్ తేసేసాను. అందం గురించి పక్కనపెట్టి…కొత్తగా ఎలా నటించాలి?
అనే దానిపైనే మనసు పెట్టాను. నేను చేసే పని మీదే ఫోకస్ పెట్టేదాన్ని. అదే నా కెరీర్ కి ఉపయోగపడింది. ఈ రోజు ఇండస్ట్రీలో రాణించేందుకు కారణం అయ్యింది. కమర్షియల్ సినిమాల్లోనే యాక్ట్ చేయాలనే ఆలోచన మైండ్ నుంచి తీసేసి, ప్రతి సినిమా ఆడిషన్ కు వెళ్లేదాన్ని . ఫస్ట్ ఆడిషన్ నుంచి ఇప్పటి వరకు ఒకేలా కష్టపడుతున్నాను.
యాక్టింగ్ బాగుంటే కచ్చితంగా ఛాన్సులు వస్తాయి. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నెపోటిజం ఉందని నేను అనుకున్నాను. కానీ సినీ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చిన కరీనా కపూర్ (Kareena Kapoor ) ను నన్ను ఒకే వేదిక పైన అంతే గౌరవంగా చూస్తున్నారు అంటే దానికి నటన మాత్రమే కారణం అని భావిస్తాను. ” అని శోభిత తెలిపింది.