అబుదాబి లో హిందూ టెంపుల్ కి వెళ్ళాలంటే ఇవి తప్పనిసరి

website 6tvnews template 2024 03 02T113738.508 అబుదాబి లో హిందూ టెంపుల్ కి వెళ్ళాలంటే ఇవి తప్పనిసరి

Things to note before going to Hindu temple in Abu Dhabi : ముస్లిం దేశం అయిన అబుదాబి లో ఉన్న హిందూ దేవాలయాన్ని దర్శించు కోవాలంటే ఈ నియమ నిబందనలను తప్పక పాటించాలని లేనిచో దేవాలయం లోకి అనుమతించమని ఆలయ ట్రస్ట్ ఒక ప్రకటన విడుదల చేసింది.

ఇకమీదట ఆలయానికి వచ్చేవారు తప్పని సరిగా చుసుకోవలసినవి అవి మెడ,మోచేతులు,మడమల వరకు వస్త్రం తో కవర్ చేసుకోవాలి.మోడరన్ డ్రెస్ లను అనుమతించమని అలాగే టైట్ గా ఉండే డ్రెస్ లు తో పాటు ట్రాన్స్ ఫరెంట్ గా ఉన్న డ్రెస్ లను కూడా అనుమతించమని చెప్పారు.

ఎలెక్ట్రానిక్ గాడ్జెట్ లు, శబ్దాలు చేసే ఎలెక్ట్రానిక్ వస్తువులను ఆలయం లోకి తీసుకెళ్ళడానికి లేదని చెప్పారు.

ముఖ్యం గా పెంపుడు జంతువులు, బయట కొన్న ఆహార పదార్దాలు కూడా ఆలయం లోకి అనుమతించమని చెప్పారు దేవాలయం నాలుగు వైపులా డ్రోన్స్ కు కూడా అనుమతిలేదని చెప్పారు. ఆలయం లోకి ప్రవేశించిన వెంటనే ఆధ్యాత్మికత పాటు ప్రశాంత వాతావరణం ఉండేలా భక్తులు సహకరించాలని ఆలయ ట్రస్ట్ సబ్యులు కోరారు.

Leave a Comment