పరీక్షలు వస్తున్నాయంటే విద్యార్దులు కష్టపడి చదవడం హాల్ టికెట్ తీసుకోవడం , ఎగ్జాం హాల్ కి వెళ్ళి పరీక్ష రాయడం ఇదే కదా జరిగేది ఎక్కడైనా. మరి ఇలాంటి వారిని ఏమనాలో మీరే చెప్పండి. మద్య ప్రదేశ్ లోని జబల్ పూర్ లో రాణి దుర్గావతి విశ్వవిద్యాలయం ఉంది. ఇక్కడ ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్సు మొదటి సెమిస్టరు ఎగ్జాం కోసం పరీక్షలు జరిగే షెడ్యుల్ ని ప్రకతించారు యూనివర్సిటీ వారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. దీనికి సంబందించిన విద్యార్దులకు హాల్ టికెట్ లు కుడా ఇవ్వడం జరిగింది. తీర పరీక్షల సమయం రానే వచ్చింది.
స్టూడెంట్స్ అందరు ఎక్కడ నుండో ఎగ్జాం రాయడానికి యూనివర్సిటీ కి చేరుకున్నారు. తీర విద్యార్దులు అందరు వచ్చిన ఎగ్జాం హాల్ తలుపులు కాదు కదా అసలు మెయిన్ గెట్ కుడా తియ్యలేదు. స్టూడెంట్స్ అందరు అవాక్కు అయ్యారు. అసలు వారికి ఎం జరుగుతోందో కూడా అర్ధం కాలేదు చాల సేపటికి. ఎలాగైతేనే యూనివర్సిటీ ఆఫీస్ లో ఉన్న స్టాఫ్ కి కాల్ చేసి మాట్లాడితే వారు చెప్పిన సమాధానం స్టూడెంట్స్ కి పిచ్చి ఎక్కినంత పని అయ్యింది.
వాళ్ళు ఇచ్చిన సమాదానం ఏంటి రా అని ఆరా తీస్తే అసలు పరీక్షలు ఉన్నాయనే సంగతి మాకు గుర్తు లేదు మర్చిపోయాము అని చెప్పారుట ఆ యూనివర్సిటీ అధికారులు. చాల దురాల నుండి వచ్చామని ఇప్పుడు మా పరిస్థితి ఏంటని అడిగితే యూనివర్సిటీ చాన్సలర్ స్టాఫ్ ని సేస్పెండ్ చేస్తామని ఈరోజు జరగాల్సిన పరీక్షను వాయిదా వేస్తామని తర్వాత ఎప్పుడు నిర్వహించేది అందరికి తెలియచేస్తామని చెప్పారు. ఇలా ఉన్నాయి మన దేశం లో కొన్ని విశ్వవిద్యాలయాలు పరిస్థితి. మరి వీరిలో మార్పు ఎప్పుడు వస్తుందో ఆ దేవుడికే తెలియాలి అనుకుంటున్నారు ఆ యూనివర్సిటీ విద్యార్ధులు.