మన గృహం లో ఏదైనా శుభకార్యం జరిగినపుడు మామిడి తోరణాలు కడతాం అందుకు కారణం అది ఒక సుభ సూచికం. అంతే కాదు మన ఇంటికే కాదు ఆలయాలలో కూడా ఈ మామిడి తోరణాలు కట్టడం అనేదిచూస్తూనే ఉంటాం. మామిడి తోరణాలు కట్టడం అనేది మనకు అనాదిగా వస్తున్న సాంప్రదాయం. ఇలా కట్టడం వెనుక ఎంతో ఆంతర్యం ఉంది. ఈ మామిడాకులకు ఒక మంచి గుణం ఉందని పురాణాలలో కుడా చెప్పడం జరిగింది.
మామిడాకులు అనేవి మనలో ఉండే పని ఒత్తిడిని, శ్రమను పొగడుతుంది. మామిడి ఆకులు మనలో ఒక ప్రశాంత కలిగేల చేస్తుందని మనసులో దేవుడి నామం తలుస్తూ మామిడి ఆకులను ఇంటి గుమ్మాలకు కడితే మన కోరికలు తీరతాయని, పచ్చగా మామిడి ఆకులతో ఏ గృహం అయిన కళ కళలాడుతూ ఉంటె ఆ ఇంట దేవతలు కొలువై ఉంటారని శాస్త్రాలలో చెప్పడం జరిగింది అని పండితులు చెప్తారు. అసలు ఏ గృహంలో నైనా శుభకార్యాలు చేసేటప్పుడు ముందుగా మామిడి తోరణాలు కట్టనిదే ఆ శుభకార్యం మొదలు పెట్టరు. అంతటి ప్రాముఖ్యత ఉంది ఈ మామిడి ఆకులకు.
ఇంటి ఆవరణలో మామిడి చెట్టు ఉంటె ఆ ఇంట సిరుల పంట అని శాస్త్రంలో ఉంది. మామిడి ఆకుల నుండి వచ్చే గాలి వల్ల ఆరోగ్యవంతమైన మంచి నిద్ర పడుతుందని ఆయుర్వేదం లో చెప్పబడింది. పూజా కార్యక్రమాలలో మామిడి ఆకులతో పాటు రావి,జువ్వి,ఉత్తరేణి,మర్రి ఆయా సదంర్భం బట్టి వీటిని వాడతారు. ఈ 5 రకాల ఆకుల కలిపి పంచవల్లవాలు అంటారు. వీటిని వాడడం వల్ల ఇంటి లోపల తో ఆ ఇంటి ఆవరణలో క్రిమి కీటకాలు అనేవి రావు. అంతే కాదు పలు రకాల అనారోగ్య సమస్యలకు ఆయుర్వేదం లో వీటిని ఎక్కువగా వాడాతారు.
ఇంకా ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకుందాం
a. ఈ మామిడి ఆకుల తోరణాలు వల్ల ఇంటిలో ఉన్న గాలి శుభ్రపడుతుంది. ఆక్సిజన్ శాతం పెరిగి మనం స్వచ్చమైన గాలిని పీలుస్తాము.
b.ఈ మామిడి తోరణాలు మన ఇంటి ప్రధాన గుమ్మానికి కట్టడం వల్ల ఇంట్లో వాస్తు దోషం ఏమైనా ఉంటె పోతుంది. అంతే కాదు ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. దీనివల్ల శుభకార్యాలను మరింత ఆనందోత్సాలతో చేసుకోగాల్గుతాం.
c.మామిడి ఆకులు ఎంతో పవిత్రమైనవి. ఆ ఆకులలో లక్ష్మి దేవి కొలువై ఉంటుందని పండితులు చెప్తున్నారు. ఆర్ధిక సమస్యలు పోయి ధనం రావడం ప్రారంబం అవుతుంది అని చెప్తున్నారు. కొంతమంది తోరణాలు కట్టేటప్పుడు రాసి గా పోసిన ఆకులను కాలితో తన్నడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురై ఆ ఇంట ధనం ఎప్పటికి నిలబడని శాస్త్రాలలో చెప్పడం జరిగింది.
d.మన ఇంట సింహ ద్వారం కు ఈ మామిడి ఆకులను కట్టడం వల్ల ఇంటిలోకి దుష్ట శక్తులు ఇంటిలోనికి రాలేవు. ఆ ఇంట దేవతల అనుగ్రం లభిస్తుంది. ఎల్లప్పుడూ మనసు ప్రశాంతం ఉంటుంది.