CM రేవంత్ రెడ్డి తాము తీసుకొచ్చిన 6 పధకాల అమలుకు ఎంతో ప్రాధాన్యత ను ఇచ్చారు. ప్రతి పధకానికి రేషన్ కార్డు తో ఆధార్ కార్డు తప్పని సరి చెయ్యడం తో అర్హులైన వారందరికి రేషన్ కార్డు తో పాటు ఆధార్ కార్డు లను సత్వరమే అందించడం కోసం ప్రజా పాలన అనే కార్యక్రమం అనే ద్వారా అర్హులైన అభ్యర్ధులు ధరఖాస్తు చేసుకుంటే వాటిని అధికారులు పరిశీలించి అర్హులైన వారందరికీ కార్ధులు అందజేస్తారని CM రేవెంత్ రెడ్డి చెప్పారు.
ఈ ప్రజాపాలన ద్వార లక్షల సంఖ్యలో దరఖాస్తులు రావడం తో ఇప్పుడు అధికారులు తలలు పట్టుకుంటున్నారు. వచ్చిన దరఖాస్తులను కంప్యూటరీకరణ చెయ్యకపోవడం అనేది అధికారుల అలసత్వం బయట పడింది. పేదలు సమర్పించిన ధరఖాస్తుల అభ్యర్ధులను GHMC లోని కొందరు అధికారులు అవినీతి కి తెర లేపారని విమర్శలు వస్తున్నాయి.
కొందరు అధికారులు ఏజన్సీ లతో చేతులు కలిపి అభ్యర్ధులను నిలువునా దొంచుకుంటున్నారని అక్కడకి వచ్చిన పేదలు ఆరోపిస్తున్నారు. లక్ష దరఖాస్తులు వస్తే అందులో 40 వేల దరఖాస్తులు కంప్యూటరీకరణ జరగలేదని కాని ఆయ ఏజన్సీ ల వారికి మాత్రం లక్ష దరఖాస్తుల డబ్బును చెల్లించడం జరిగిందని వారు ఆరోపిస్తున్నారు.