Samantha Ruth Prabhu: రెండో పెళ్లిపై సమంత క్లారిటీ ఇదే.

This is Samantha's clarity on the second marriage

Samantha Ruth Prabhu: రెండో పెళ్లిపై సమంత క్లారిటీ ఇదే.

మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సౌత్ స్టార్ బ్యూటీ సమంత ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ ట్రీట్మెంట్ తీసుకుంటోంది.

సినిమాలు చేయకపోయినా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తూ తన ఫ్యాన్స్ ను ఖషీ చేస్తోంది. హాట్ ఫోటో షూట్ లతో ట్రీట్ ఇస్తోంది. రీసెంట్ గానే సమంత ఒక కొత్త ప్రొడక్షన్ హౌస్ ని ప్రరంభించింది.

ఆ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా వేదికగా సమంత అనౌన్స్ చేసింది. దీంతో ఇక సమంత హీరోయిన్‎గా ఇండస్ట్రీకి బై బై చెప్పేసిందని, నిర్మాత గా సెటిల్ అవుతుందని అందరూ భావించారు. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు ఈ బ్యూటీ.

అయితే చాలా రోజుల తర్వాత సామ్ తన ఫ్యాన్స్‎తో ముచ్చటించింది. అభిమాన తాన ఆన్‎లైన్‎లోకి రావడంతో అభిమానులు ప్రశ్నల వర్షం కురిపించారు. వాటన్నింటికీ తీరికగా సమాధానం చెబుతూ వచ్చింది.

ఇక అందులో ఒక ఫ్యాన్ మీరు రెండో పెళ్లి చేసుకుంటారా? చేసుకుంటే ఎప్పుడు చేసుకుంటారు? అని తన మనసులోని ప్రశ్నను అడిగేశాడు. ఈ ప్రశ్నకు సమంత ఎలాంటి సమాధానం ఇస్తుందో అని ఆసక్తిగా ఎదురుచూశారు.

అయితే సమంత మాత్రం ఎవరికి అర్థం కాని ఒక సమాధానం చెప్పి అందరినీ కన్ఫ్యూజన్ లో పడేసింది. అదేంటంటే రీసెంట్ గా జరిగిన నివేదికల ప్రకారం ఈ ఆలోచన ఒక చెడ్డ పెట్టుబడి అవుతుంది అంటూ ఒక షాకింగ్ సామాధానం ఇచ్చింది.

సామ్ 2023 లో విడాకులు తీసుకుంటుందని ఒక స్టడీ స్క్రీన్ షాట్ తీసి ఫోటోను షేర్ చేసింది. అయితేఈ స్క్రీన్ షాట్ లో ఏముందంటే…2023 డివోర్స్ నివేదిక ప్రకారం చూసుకుంటే మొదటిసారి వివాహం చేసుకున్నవారు 50 శాతం మంది విడాకులు తీసుకుంటున్నారని ఉంది.

Add a heading 2023 12 18T104621.713 Samantha Ruth Prabhu: రెండో పెళ్లిపై సమంత క్లారిటీ ఇదే.

అదే విధంగా సెకెండ్ మ్యారేజ్ చేసుకున్నవారు 67శాతం విడాకులు తీసుకుంటున్నారని ఉంది. ఇక మూడోసారి పెళ్లి చేసుకున్న వారైతే ఏకంగా 73 శాతం మంది డివోర్స్ తీసుకుంటారని ఉంది.

అయితే సమంత ఆ స్క్రీన్ షాట్ పెట్టడానికి ఉద్దేశమేంటంటే ఎన్నిసార్లు పెళ్లిళ్లు చేసుకున్నా చివరికి డివోర్స్ తీసుకుంటారు అని చెప్పకనే చెప్పింది సమంత.

ఈ స్క్రీన్ షాట్ ను బట్టి ఇక సమంతకు వివాహం చేసుకునే ఆలోచన లేదని క్లారిటీ వచ్చేసింది. దీంతో ప్రస్తుతం సమంతా ఇచ్చిన ఈ సమాధానం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

నాగచైతన్య.. సమంత.. వీరిద్దరూ ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఫేవరేట్ కపుల్. ఏం మాయ చేసావే సినిమాతో ఈ కపుల్ అందరిని మాయ చేసేసింది.

ఈ సినిమా తర్వాత వీరిద్దరూ ప్రేమించుకోవడం, పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవడం అంతా జరిగిపోయింది. వీరిద్దరి పెళ్లితో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. కానీ వీరి బంధం ఎంతో కాలం నిలవలేదు. పెళ్లి చేసుకున్న కొన్ని సంవత్సరాలకే డివోర్స్ తీసుకున్నారు.

వీరిద్దరూ విడాకులు తీసుకున్నా ఇప్పటికీ వారి అభిమానులు మళ్లీ కలిస్తే బాగుంటుందని అప్పుడప్పుడు నెట్టింట్లో పోస్టులు పెడుతుంటారు.

ఇదే క్రమంలో సమంత రెండో పెళ్లిపైనా చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. ఇక ఇదే సందేహాన్ని సమంత ఫ్యాన్ తాజాగా వ్యక్తం చేశాడు. అందుకు తగ్గట్లుగానే సమంత క్లియర్ గా యాన్సర్ ఇచ్చేసింది.

Leave a Comment