COP28 last chance to global warming America: భూతాపాన్ని నియంత్రించడానికి ఇదే చివరి అవకాశం..అమెరికా.

This is the last chance to control global warming..America.

COP28 last chance to global warming America: భూతాపాన్ని నియంత్రించడానికి ఇదే చివరి అవకాశం..అమెరికా.

పర్యావరణాన్ని కాపాడుకొని, భవిష్యత్ తరాలకు మంచి జీవనాన్ని అందించడం అనేది అందరి బాధ్యత. కానీ, ప్రపంచవ్యాప్తంగా పర్యావరణం కలుషితమవుతుంది.

పర్యావరణాన్ని రక్షించడానికి ప్రపంచదేశాలన్నీ ఏకమై ఎన్నో సదస్సులు నిర్వహిస్తున్నాయి. కాప్‌-28 (COP28)’ వాతావరణ సదస్సు దుబాయి వేదికగా జరుగుతున్న ఈ శిఖరాగ్ర సదస్సులో భూతాపాన్ని(global warming)

నియంత్రించడానికి ఇదే చివరి అవకాశామని అమెరికా ప్రతినిధి జాన్‌ కెర్రీ ప్రకటించారు.కాప్‌ 28 అధ్యక్షుడు సుల్తాన్‌ అల్‌ జాబెర్‌ ప్రతిపాదించిన ముసాయిదాలో శిలాజ ఇంధనానికి దశలవారీగా స్వస్తి చెప్పాలని పేర్కొనలేదు. ఈ అంశం ఎంతగానో నిరూత్సహపర్చిందని జాన్‌ కెర్రీ

శిలాజఇంధనాలను ఉపయోగించడం పూర్తిగా తగ్గించాలని, దాని కోసం ప్రపంచం అంతా ప్రతిజ్ఞ చేయాలని తెలిపారు.. కానీ, మనలో చాలా మంది ఆ ప్రతిజ్ఞను వ్యతిరేకించదానికే ముందున్నారని కెర్రీ తెలిపారు.

పారిస్‌ ఒప్పందం ప్రకారం భూతాపం పెరుగుదలను 1.5 సెల్సియస్‌ డిగ్రీల వద్ద స్థిరీకరించాలి. ఇందుకోసం 2030 నాటికి కర్బన ఉద్గారాలను 50 శాతం మేర తగ్గించాలి.

దాని ద్వారా భూతాపాన్ని నియంత్రించాలి. ఈ లక్ష్యాన్ని చేరడానికి ఇదే మనకు చివరి అవకాశామని కెర్రీ తెలిపారు. ఈ బాధ్యతను నిర్వర్తించడంలో కాప్‌ 28 భాగస్వామ్య దేశాలు వైఫల్యం చెందకుండా ముందుకు నడుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

వాతావరణ మార్పులకు ప్రతిస్పందనగా ప్రపంచ స్థాయిలో కార్యాచరణ-ఆధారిత చర్యలకు మద్దతు ఇవ్వడంలో భారతదేశం ముందు ఉందని, ఈ భూమికి, దాని పైన నివసించే ప్రజలకు విడదీయరాని అనుబంధం ఉందని తెలిపారు.

దీనిలో భాగంగానేమిషన్ లైఫ్ – లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్‌మెంట్‌లో చేరాలని భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రపంచ సమాజానికి పిలుపునిచ్చారు. భారతదేశ కార్యాచరణ-ఆధారిత విధానానికి నిదర్శనం.

మిషన్ లైఫ్ యొక్క ఆదర్శాలను మరింతగా పెంచుతూ, వినూత్న పర్యావరణం కోసం భాగస్వామ్య ప్రపంచ వేదికను రూపొందించడానికి డిసెంబర్ 1st COP28 న భారతదేశం గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్‌ను ప్రారంభించింది.

ఈ సంవత్సరం ప్రారంభంలో, న్యూ ఢిల్లీ డిక్లరేషన్‌లో భాగంగా G20 దేశాలు గ్రీన్ డెవలప్‌మెంట్ ఒడంబడికను చారిత్రాత్మకంగా ఆమోదించడం జరిగింది.

భారతదేశం ఇప్పుడు ప్రారంభ అడాప్టేషన్ కమ్యూనికేషన్‌తో పాటు 2019 GHG ఇన్వెంటరీ ఆధారంగా మూడవ జాతీయ కమ్యూనికేషన్‌ను ఖరారు చేసింది. ఇది మన ప్రజల అభివృద్ధికి శ్రేయస్సుకు ప్రాధాన్యతనిస్తూ, మంచి వాతావరణం కోసం స్థిరమైన సహకారం గురించి తెలుపుతుంది.

భారతదేశం 2005 మరియు 2019 మధ్యకాలంలో దాని జీడీపీకి సంబంధించి ఉద్గార తీవ్రతను 33% విజయవంతంగా తగ్గించుకుంది, తద్వారా 2030లో ప్రారంభ NDC లక్ష్యాన్ని నిర్ణీత సమయానికి 11 సంవత్సరాల ముందుగానే సాధించింది.

భారతదేశం కూడా 2030 లక్ష్యానికి తొమ్మిదేళ్లు ముందుగానే 40% ఎలక్ట్రిక్ ఇన్‌స్టాల్ కెపాసిటీని శిలాజ ఇంధన వనరుల ద్వారా సాధించింది. 2017 మరియు 2023 మధ్య, భారతదేశం దాదాపు 100 GW స్థాపిత విద్యుత్ సామర్థ్యాన్ని సాధించింది.

ఈ సంవత్సరం ప్రారంభంలో G20 నాయకులు న్యూఢిల్లీలో సమావేశమైనప్పుడు ప్రారంభించబడిన గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్, జీవ ఇంధనాల అభివృద్ధికి ప్రపంచ సహకారాన్ని పెంపొందించే ఉత్ప్రేరక వేదికగా ఉపయోగపడుతుందని భావింంచింది.

Leave a Comment