టూరిస్ట్ లను ఆకర్షించ డానికి హోటల్స్, రెస్టారెంట్లు రకరకాల ఆఫర్ లు ఇస్తూ ఉంటారు లేదా లేదా కొత్పెత గా పెళ్లి చేసుకున్న వారికి ఇన్ని రోజులు ఉంటె ఇంత డిస్కౌంట్ అంటూ కస్టమర్ లను ఆకర్షించే విధం గా టారిఫ్స్ అని పెడుతూ ఉంటారు.
అలాంటి ఆఫర్ ఒక హోటల్ ప్లాన్ చేసింది. ఇక వివరాల లోకి వెళ్తే సింగపూర్ కి చెందిన ఓ హోటల్ ఒక విచిత్రమైన ప్రకటన చేసింది. ఎవరైనా మా హోటల్ రూమ్స్ బుక్ చేసుకుని వర్షం వచ్చి మీ ప్రయాణం ఆగిపోతే ఇన్సూరెన్స్ క్రింద మీరు కట్టిన అడ్వాన్సు అమౌంట్ తిరిగి ఇచ్చేస్తామని ఒక ఆఫర్ ఇచ్చింది. సింగపూర్ లో సంవత్సరం లో 171 రోజులు వర్షం పడుతుంది.దీనివల్ల సింగపూర్ కి వచ్చే టూరిస్ట్ లు వారి ప్లాన్ కాన్సిల్ అయ్యి అసహనం తో ఉంటారు.
వీరి సంఖ్య పడిపోకూదదనే ఈ విచిత్ర ఆఫర్ తీసుకువచ్చినట్లు ఆ హోటల్ యాజమాన్యం ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే చివరలో ఈ హోటల్ వాళ్ళు ఈ ఆఫర్ వివరాలు చెప్పారు. ఎవరైతే ఒక్క రాత్రి కి 850 డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీ లో 52,000 వేల రూపాయలు నుండి 4,500 డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీ లో 2,70,000 వరకు ఉండే స్యూట్ బుక్ చేసుకునే టూరిస్ట్ లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది అని చెప్పి షాక్ ఇచ్చారు.
వర్షం పడుతున్న సమయం లో కూడా సింగపూర్ లో సందర్శించ వలసినవి ఆసియన్ మ్యుజియం, టైగర్ బ్రూవేరి అలాగే ఎంతో ప్రసిద్ధి చెందిన కినోకినియా బుక్స్ షాప్ లో షాపింగ్ చెయ్యడం లాంటివి ఒక మంచి అనుభూతిని మిగిలిస్తుందని వారు భరోసా ఇస్తున్నారు.