అంతా బావున్నా కుడా విడాకులు తీసుకోవడానికి ఇదే కారణం

website 6tvnews template 2024 03 27T113907.731 అంతా బావున్నా కుడా విడాకులు తీసుకోవడానికి ఇదే కారణం

సాధారణం గా పెళ్ళిళ్ళు స్వర్గం లో నిర్ణయించబడతాయి అంటారు పెద్దలు. పెళ్లి అనగానే ఎన్నో చూసుకోవలసి ఉంటుంది. మంచి మొహూర్తం జాతకాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటాయి. కాని దుర్ముహూర్తం లో పెళ్లి చేస్తే ఆ జంటలు ఎక్కువకాలం కలిసి ఉండరు. జీవితాంతం కలిసి ఉండాలనే కదా పెళ్లి చేసేది. కాని కొన్ని చిన్న కారణాలు వల్ల మధ్యలోనే విడాకులు తీసుకుంటున్నారు చాల మంది.

మనలో చాలా మంది కి పెళ్ళిళ్ళు స్వర్గం లో నిర్ణయించినపుడు మరి ఎందుకు విడాకులు తీసుకుంటున్నారు అని చాలా మందికి సందేహం రావచ్చు. సాధారణం గా చాల మంది లో అహంకారం, కోపం, ఇద్దరి మద్య సఖ్యత లేక పోవడం, లేక అనైతికి సంబందం ఇళ్ళ ఎన్నో కారణాలు వాలా విడాకులు తీసుకుంటున్నారు. కొంత మంది జాతకాలు సరి చూసుకోక లేదా మొహూర్తం సరియినది కాకపోవడం ఇలా ఎన్నో కారణాలు ఉన్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతీ విషయాలను అన్ని క్షుణ్ణం గా చూడాలి, మన జాతకం ప్రాకారమ 12 గదులు ఉంటాయి,

ఒక్కక్క గది లో ఒక్కక్క ప్రత్యేకత ఉంటుంది. అలాగే చూసినట్లయితే 4 వ గది ఆనందాన్ని చూచిస్తుంది. 7 వ గది ఇంటి యజమాని ఆరోగ్యం సూచిస్తుంది. 2 వ గది కుటుంబ సంబందాలను గురించి తెలుస్తుంది. 12 గది భార్య భర్తల దాంపత్యం ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది. ఇక్కడి ఓ విషయం చెప్పాలి. ఇప్పుడు సూచించిన గది లో ఏ గ్రహం ఉన్నది తెలుసుకోవాలి. ఇదే ప్రధానం, ఆయా గ్రహాన్ని బట్టి భార్య భర్తలు ఎలా ఉంటారు అనేది చెప్పవచ్చు.

ముఖ్యం గా చుసుకోవలసినది ఇదే. మన జాతక చక్రం లో ఈ గది లో ఎవరు ఉన్నారో చూడకుండా మొహూర్తాలు పెట్టేస్తారు చాల మంది జ్యోతిష్యులు. అంటే ఇది అందరి విషయం లో ఒకే లా ఉండదు. కొంత మంది జ్యోతిష్యులు తెలిసి తెలియక మొహూర్తాలు పెడుతూ ఉంటారు లేదా ఒక్క సారి వారి జాతక చక్రం సరిగ్గా ఉండక పోవచ్చు. లేదా వారు పుట్టిన సమయాలు కరెక్ట్ గా ఉండకపోవచ్చు ఏది ఏమైనా జ్యోతిష్యం అనేది వారి వారి నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది.

కొంత మంది కి అయితే అసలు జాతకాలు అనేవి ఉండవు. కేవలం వారి పేర్ల ఆధారం గా మొహూర్తాలు నిర్ణయిస్తు ఉంటారు. ఇందులో కుడా నిజం ఉండచ్చు ఉండక పోవచ్చు. కొందరు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. అందులో కుడా అందరు కలిసి ఉండచ్చు ఉండక పోవచ్చు. ఇది కేవలం వారి నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. కొంత మంది కి అసలు జాతకాలు చూసుకోకుండా కుడా పెళ్లి చేసుకుంటారు అయిన వారు సంవత్సరాల తరబడి కలిసే ఉంటారు. అది కేవలం వారి మధ్య ఉన్న అన్యోన్య దాంపత్యం, ఒక అవగాహన, అహంకారం లేకపోవడం ఇవే కారణం. ఎన్ని జాతకాలు చుసిన అన్ని కుదిరి పెళ్లి చేసుకున్న వారి మద్య సరియైన అవగాహన, ప్రేమ అనురాగాలు లేకపోతే ఏ జంట ఆయిన ఎక్కువ కాలం కలిసి ఉండరు.

Disclaimer:
ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మీకు అందించడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ 6Tv ఇవ్వడం లేదు. అలాగే ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. మా ఉద్దేశం సమాచారం అందించడం వరకు మాత్రమే. ఏదైనా పాటించే ముందు లేదా సందేహాలు ఉన్న సంబంధిత నిపుణుల సలహా తీసుకోమని మనవి చేస్తున్నాం.

Leave a Comment