with out holidays the school is running 365 days:ఈ బడికి సెలవులు లేవు కానీ 365 విద్యార్థులు వుంటారు.

Add a heading 2023 12 26T171145.723 with out holidays the school is running 365 days:ఈ బడికి సెలవులు లేవు కానీ 365 విద్యార్థులు వుంటారు.

with out holidays the school is running 365 days:ఈ బడికి సెలవులు లేవు కానీ 365 విద్యార్థులు వుంటారు.

ఈ రోజు స్కూల్ లేదు అని చెపితే, చదువుకునే పిల్లలకు ఎంత సంతోషంగా ఉంటుందో మాటలలో చెప్పలేము.

అలాగే, ఈ స్కూల్ లో చదువుకునే పిల్లలకి 365 రోజులు సెలవలు లేవంటే అంత హ్యాపీ అంట. ఇంతటి అందమైన, అద్భుతమైన ఆ స్కూల్ గురించి తెలుసుకుందామా..

సెలవులే లేని బడి ఇది. 365 రోజులు, ప్రతి రోజు 14 గంటలు క్లాసులు- పిల్లలకు సూపర్​ ఫన్​తో ఎడ్యుకేషన్ ను అందిస్తున్నారు. ఈ బడి ఏడాదిలో 365 రోజులూ పనిచేస్తుంది.

అది కూడా ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు. వినడానికే ఎంత ఆశ్చర్యంగా ఉంది కదా! మహారాష్ట్ర నాసిక్​ జిల్లా త్రయంబకేశ్వర్ మండలం హివాలీలో ఉందీ పాఠశాల.

సెలవులే లేకుండా రోజుకు 14గంటలు పనిచేయడం దీని ప్రత్యేకత. మా బడి ఏడాదిలో 365 రోజులు ఉదయం 7 నుంచి రాత్రి 9 వరకు నడుస్తుంది. ఈ 14 గంటల్లో మేము వ్యవసాయం, పశువుల పెంపకం, చదవడం వంటి అనేక పనులు చేస్తామని తెలుపుతున్నారు

ఎక్కడ పెద్ద పిల్లలు తమకన్నా చిన్నవారికి చదువు చెబుతారు. కేజీ నుంచి 6వ తరగతి వరకు విద్యార్థులు అందరినీ బృందాలుగా విభజించి, ప్రతి విద్యార్థి ఒక బృందంలో సభ్యునిగా ఉంటారంట,

పెద్ద పిల్లలు ఒక్కొక్కరు ఒక్కో సబ్జెక్ట్ తీసుకుని, చిన్నవారికి సైన్స్, మ్యాథ్స్, వ్యాసరచన వంటివన్నీ చక్కగా నేర్పిస్తారనిప్రతీక్షా రామ్​దాస్​ భుసారే, అనే మరో విద్యార్థి తెలిపారు.

కుటుంబానికి అండగా సవ్యసాచి విద్యార్థులుఇక్కడి విద్యార్థులందరికీ పెద్దపెద్ద ఎక్కాలు అన్నీ వచ్చు. వీరంతా ఒకేసారి రెండు చేతులతోనూ రాయగల సవ్యసాచులు. విద్యార్థులు బడిలోనే కూరగాయలు పెంచుతారు.

వాటిని మార్కెట్​లో అమ్మి, వచ్చిన డబ్బులు ఇంట్లో ఇస్తారు. మా బడికి భవనం ఏమీ లేదు. టార్పాలిన్ షీట్​ కిందే ఉంటుంది. ఒక్కోసారి మేము పొలానికి వెళ్తాం.

అక్కడి నుంచి వంకాయలు, గుమ్మడికాయలు, వేరుశెనగ, టమోట, బెండకాయలు వంటివి అమ్మేందుకు మార్కెట్​కు కూడా వెళ్తామని మహేశ్వరీ మోరే, 8వ తరగతి విద్యార్థి తెలిపాడు.

ఈ బడి ఇంత ప్రత్యేకంగా నిలవడానికి కారణం కేశవ్ గావిత్. రాజనీతి శాస్త్రంలో ఎమ్​ఏ చేసిన ఆయన ఐఏఎస్​ కావాలనుకున్నారు. కానీ, పేదరికం వల్ల ఆ కల నెరవేరలేదు. అయినా, కేశవ్ ఏమాత్రం నిరాశ చెందలేదు. హివాలీ గ్రామంలోని గిరిజనుల జీవితాల్ని మార్చాలని సంకల్పించుకున్నారు.

టీచర్​గా మారి అక్కడి పిల్లలకు చదువు చెబుతున్నారు. 2009లో ఇక్కడకు వచ్చినప్పుడు రోడ్లు, విద్యుత్ వంటి సదుపాయాలు ఏమీలేవు. 7ఏళ్లు బడికి నడిచే వచ్చానని ఆయన తెలిపారు.

ఇక్కడి విద్యార్థుల్లోని ప్రతిభను గుర్తించి, ప్రోత్సహించే ప్రయత్నం చేశాను. దీనికి చాలా ఏళ్లు పట్టిందని వివరించారు. 2014-15నాటికి విద్యార్థులు కొన్ని నైపుణ్యాలు సాధించారు. 2016 నుంచి ఈ బడి ఏడాదికి 365 రోజులు నడుస్తోందని కేశవ్ గావిత్, ఉపాధ్యాయుడుతెలిపాడు.

గిరిజన తండా అయిన హివాలీ లో జనాభా 250 మంది. ఎక్కడ కనీస సౌకర్యాలు కూడా అంతంతమాత్రమే. మొబైల్​ సిగ్నల్​ కోసం ఊరికి 2-3కిలోమీటర్లు వెళ్లాల్సిన దుస్థితి.

అలాంటి గ్రామంలో ఉన్న ఈ పాఠశాలలో.. 9వ తరగతి వరకు మొత్తం 55 మంది చదువుకుంటున్నారు. మామూలు సిలబస్​తోపాటు ఈ బడిలో విద్యార్థులకు వృత్తివిద్యా శిక్షణ కూడా లభిస్తుంది.

ప్లంబింగ్, వెల్డింగ్, ఎలక్ట్రికల్ రిపేర్స్, కార్పెంట్రీ వంటి పనుల్ని ఇక్కడి విద్యార్థులు నేర్చుకుంటారు.
ఇక్కడ చదివిన వారందరికి పెద్దయ్యాక ప్రభుత్వ ఉద్యోగం రాకపోవచ్చు.

కానీ, వారు ఎంతో కొంత సంపాదించుకునేందుకు అవసరమైన నైపుణ్యాలను పెంపొందించేలా వృత్తివిద్యా శిక్షణ ద్వారా మేము ప్రయత్నిస్తున్నామని కేశవ్ గావిత్, ఉపాధ్యాయుడు తెపాడు.గుడారంలా ఉండే ఈ బడిలోని పైకప్పును, గోడలను విద్యార్థులే ఎంతో అందంగా అలంకరించుకుంటారు.

Leave a Comment