బూటాన్ తో మరింత సన్నిహిత సంబందాలు కోసం ఈ పర్యటన – మోడీ

Screenshot 2024 03 22 142800 బూటాన్ తో మరింత సన్నిహిత సంబందాలు కోసం ఈ పర్యటన - మోడీ

ఈరోజు ఉదయం భారత ప్రధాని మోడీ రెండు రోజుల పర్యటన కోసం ఆయన బూటాన్ ప్రత్యేక విమానంలో చేరుకున్నారు. ఇరు దేశాధినేతలు పరస్పర చర్చల వివరాలు ప్రకటిస్తామని అధికారులు తెలిపారు. అయితే ఇటీవల బుటాన్ ప్రధాని 4 రోజులు పర్యటన కోసం భారత్ కి వచ్చారు. కాని అదే సమయం లో ఇక్కడ ఎన్నికల ప్రచారం కోసం పర్యటనలకు బయలుదేరి వెళ్లారు.

దీని వల్ల ఇద్దరు కలుసుకోవడానికి కొద్ది గా ఆలస్యం అయిందని అధికారులు తెలిపారు. వివిధ రాష్ట్రాల పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరుకున్న ప్రధాని మోడీ బుటాన్ ప్రధాని ని కల్సి అన్ని విషయాలు మీద చర్చించారు. ముఖ్యం గా చైనా తో సరిహద్దు సమస్యలు ఎక్కువ అవుతున్నాయని. రోజు రోజుకి తమ ప్రాంతాలను అక్రమిస్తోందని బుటాన్ ఆరోపించింది.

తైవాన్ మీద ఎప్పుడైనా దాడి చేస్తామని ఆ దేశాన్ని మా దేశం లో కలుపుకున్తామని చైనా చెప్తోంది. అలాగే మా మీద కూడా దాడి చేసే అవకాశాలు కూడా ఉన్నాయని ఈ తరుణం లో భారత్ మాత్రమే మాకు అండగా నిలుబడుతుందనే ఆశాబావం వ్యక్తం చేసారు బుటాన్ ప్రధాని. ఇప్పడు ఈ ద్వైపాక్షిక అంశాల తో పాటు సైనిక,వైద్య, ఆరోగ్య , ఆహార తదితర అంశాలను ఇరు దేశాధినేతలు చర్చించనున్నారని ఒక ప్రకటన లో ఇండియన్ ఎం బ సి అధికారులు ఒక ప్రకటన విడుదల చేసారు.

Leave a Comment