ముంబై నగరానికి బాంబుల బెదిరింపులు – విస్తృత తనిఖీలు చేసిన పోలీసుaలు : Threat calls to Mumbai city

1666076 police image2 ముంబై నగరానికి బాంబుల బెదిరింపులు - విస్తృత తనిఖీలు చేసిన పోలీసుaలు : Threat calls to Mumbai city

Threat calls to Mumbai city: ముంబై(Mumbai) లో బాంబులు పెట్టమని అవి పేలబోతున్నాయని ఆగంతకుల నుండి బెదిరింపు కాల్స్ రావడం కొత్తేమి కాదు. గతంలో అనేక మార్లు ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి.(threat calls to Mumbai city) ఇల్లన్తి బెదిరింపు కాల్స్ రావడం వల్ల అటు పోలీసు యంత్రాగం మొత్తం అలర్ట్ అవ్వడమే కాకుండా సాధారణ ప్రజలు కూడా భయాందోళకు గురవుతుంటారు. తాజాగా మరోసారి ముంబై కి ఇలాంటి బెదిరింపు కాల్ వచ్చింది.

ఒకటి రెండు కాదు ఏకంగా ఆరు చోట్ల బాంబులు పెట్టినట్టు ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్ కి ఓ కాల్ వచ్చింది. ఈ కార్ రిసీవ్ చేసుకున్న వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. ముంబై పోలీసులు(Mumbai Police), క్రైమ్ బ్రాంచ్ యాంటీ టెర్ర‌రిజం స్క్వాడ్ అధికారులు పరుగులు పెట్టారు. ఏవైతే ప్రాంతాల్లో బాంబులు పెట్టినట్టు సమాచారం వచ్చిందో ఆయా ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. బాంబు స్క్వాడ్ సహాయంతో ఆణువణువూ జల్లెడ పట్టారు. కానీ పోలీసులకు గాని, క్రైమ్ బ్రాంచ్ యాంటీ టెర్ర‌రిజం స్క్వాడ్ కు గాని, బాంబు స్క్వాడ్ కు గాని ఎటువంటి పేలుడు పదార్ధాలు లభించలేదు. దీంతో ఇది బెదిరింపు కాల్ గానే పరిగణించారు.

ముంబై కి ఇది కొత్త కాదు : This Is Not First Time In Mumbai

ప్రస్తుతం ఈ ఫోన్ కాల్ చేసిన అగంతకుడి ఆచూకీ కోసం ముంబై పోలీసులు గాలిస్తున్నారు. బాంబులు ఉన్నట్టు తప్పుడు సమాచారం ఇచ్చి పోలీసులను పరుగులు పెట్టించిన అతగాడిని అరెస్ట్ చేసేందుకు చర్యలు చేపట్టారు. ఇతగాడు ట్రాఫిక్ పోలీసు హెల్ప్‌లైన్‌కు చెందిన వాట్సాప్ నంబ‌ర్‌కు కాల్ చేసినట్టు తెలుస్తోంది. ముంబై లో గతంలో కూడా ఇటువంటి బెదిరింపు కాల్స్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి.

నూతన సంవత్సరం వేళా కూడా ఒక ఆగంతకుడు నగరంలోని పాల్ ప్రాంతాల్లో బాంబులు ఉన్నట్టు బెదిరింపు కాల్స్ చేశాడు. దానికన్నా ముందు ఒక వ్యక్తి రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా కార్యాలయం(Reserve Bank Of India)తో పాటు పలు బ్యాంకులు ఇతర కార్యాలయాల్లో కూడా బాంబులు పెట్టినట్టు బెదిరించాడు.

Leave a Comment