Pooja Hegde: పూజ హెగ్డేకి బెదిరింపు కాల్స్…నిజమేనా?
పూజ హేగ్ధే.. బుట్ట బొమ్మగా తెలుగు తెరకు బాగా పరిచయం ఉన్న బ్యూటీ. ఒక లైలా కోసం సినిమా తో తెలుగు తెరలో తళుక్కున మెరిసింది.
ఆ తరువాత ముకుంద సినిమాతో ప్రేక్షకులకి మరింత దగ్గరైంది. ఆ తరువాత వరుసగా దువ్వాడ జగన్నాథం, సాక్ష్యం, రంగస్థలం, అరవింద సమేత వీర రాఘవ, మహర్షి, గద్దలకొండ గణేష్ సినిమాలతో తెలుగు ఇండస్ట్రి లో తీరిక లేని హీరోయిన్ గా మారింది.
అల వైకుంఠపురం సినిమాతో బుట్ట బొమ్మగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్, సర్కస్, ఆచార్య, రాధే శ్యామ్, బీస్ట్ వంటి సినిమాల్లో నటించింది.
కొన్నేళ్ళ పాటు తెలుగు ఇండస్ట్రిని ఏలిన పూజా హెగ్డే వరుస ఫ్లాప్ లతో ఒక్కసారిగా బోల్తా పడింది. తెలుగులో ఒక్క సినిమా అవకాశం కూడా చేతిలో లేదు. ఒక్కసారిగా తెలుగు ఇండస్ట్రిలో ఆమె పేరు కనుమరుగయినది.
అయితే ఈ మధ్యలో పూజా హేగ్ధేకి సంబందించి ఒక వార్తా నెట్టింట్లో చెక్కర్లు కొడుతుంది. అదేంటంటే, ఈ మధ్యలో ఆమె దుబాయిలో ఒక ఈవెంట్ కి వెళ్లారని, అక్కడ ఆమెకి పెద్ద గొడవ జరిగిందని,
ఆ గొడవ కారణంగా ఆమెకి చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ ఒక బాలీవుడ్ మీడియాలో వచ్చిన వార్త ద్వారా తెలిసింది. దాంతో పూజా హెగ్ధే అభిమానులు ఆమెకి సపోర్ట్ గా నిలుస్తూ, అసలు ఏం జరిగిందంటూ పోస్ట్ లు పెడుతున్నాయి.
ఇక ఈ గాలి వార్తకి ఒక అడ్డుకట్ట వేసింది, పూజ హేగ్ధే టీం! ఇలాంటి వార్తలు దాదాపు ఫేక్ గానే వస్తాయి. ఈ వార్త కూడా అలాంటిదే అంటూ కొట్టి పారేసింది పూజ హేగ్ధే టీం.
ఆ వార్తలో ఎలాంటి నిజం లేదని, నమ్మి ఇలా ప్రచారం చేయవద్దని టీం వెల్లడించింది.ఇక పూజ హేగ్ధే టీం ఇచ్చిన క్లారిటీ చూసిన మీడియా సంస్థలు కూడా వారి వార్తలను తేసేసాయి.