గెలుపే లక్ష్యంగా టికెట్లు – బడా నేతలకు భంగపాటు

157589 ys jagan గెలుపే లక్ష్యంగా టికెట్లు - బడా నేతలకు భంగపాటు

ఆంధ్ర ప్రదేశ్ లో అధికార వైసీపీ 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు 25 లోక్ సభ నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల జాబితాను ఈరోజు ప్రకటించింది. అయితే ఈ జాబితా ప్రకటించడానికి ముందు వైసీపీ అధినేత జగన్ ఆంద్ర ప్రాతం లో అన్నీ నియోజకవర్గాల వారీగా ఇంఛార్జులను ప్రకటించారు. అయితే అదే ఫైనల్ లిస్ట్ అనుకుని, ఆ లిస్ట్ లో పేర్లు ఉన్నవారినే ఎమ్మెల్యే అభ్యర్థులుగా పరిగణించవచ్చు అని అంతా భావించారు.

కానీ అందుకు విరుద్ధంగా కొన్ని మార్పులు చేర్పులు జరిగాయి. కొందరు ఎమ్మెల్యేలకు స్దాన చలనం అయితే జరిగింది కానీ కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు మాత్రం అదే స్థానం నుండి పోటీ చేయబోతున్నారు. ఇది ఇలా ఉంటె గెలుపే లక్ష్యంగా పెట్టుకున్న జగన్ ఈ సారి ఎన్నికలకు గెలుపు గుర్రాలని ఏరికోరి బరిలోకి దింపాలని చాలా పెద్ద కసరత్తే చేసి ఫైనల్ జాబితాను బయట పెట్టారు.

కానీ ఆ జాబితాలో చోటు దక్కకపోవడం వల్ల భంగపాటుకు గురైన ఆశావహులు కూడా లేకపోలేదు. అలంటి వారిలో జగన్ సొంత సామాజికవర్గానికి చెందిన వారు కూడా ఉన్నారు. ఉదాహరణకు కాపు రామచంద్ర రెడ్డి. ఈయన రాయదుర్గం నియోజకవర్గం నుండి 2019 లో ఎమ్మెల్యే గా గెలుపొందారు. అయితే ఈసారి మాత్రం ఆయనకు ఆ నియోజకవర్గంలో పోటీ చేసేందుకు టికెట్ దక్కలేదు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ స్థానం నుండి మెట్టు గోవిందరెడ్డికి ఛాన్స్ ఇచ్చారు జగన్. టికెట్ లేదని తెలిసిన రోజునే రామచంద్ర రెడ్డి జగన్ పై ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. జగన్ తన గొంతు కోశారని అన్నారు. ఈ మధ్య కాలం లోనే అయన బీజేపీ తీర్ధం పుచ్చుకున్నట్టు తెలుస్తోంది.

ఇక చిలకలూరిపేట విషయానికి వస్తే ఇప్పుడు రాజకీయంగా ఈ స్థానం హాట్ టాపిక్ అయింది. 2019 లో ఈ స్థానం నుండి విడుదల రజని పోటీ చేసి పుల్లారావు లాంటి సీనియర్ ను ఓడించింది. వైసీపీ పెద్దల ఆశీస్సులు మెండుగా ఉండటంతో రజని జగన్ క్యాబినెట్ లో వైద్య శాఖా మంత్రిగా చోటు దక్కించుకుంది. అయితే 2024 ఎన్నికల నాటికి ఆమెకు స్దాన చలనం తప్పలేదు, ఆమె గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుండి పోటీకి సిద్ధమయ్యారు.

1073203 ysjaganmohanreddy గెలుపే లక్ష్యంగా టికెట్లు - బడా నేతలకు భంగపాటు

కాబట్టి ప్రస్తుతం ఖాళీగా ఉన్న పేట స్థానంలో మల్లెల రాజేష్ నాయుడుని ఇంచార్జ్ గా నియమించింది వైసీపీ అధిష్టానం. దీంతో తానే ఎమ్మెల్యే అభ్యర్థిని అని భావించిన రాజేష్ నాయుడు, సామజిక సాధికార బస్సు యాత్ర దగ్గరనుండి, చిలకలూరిపేటలో జగన్ సభ వరకు అన్ని పార్టీ కార్యక్రమాలను భుజాన వేసుకుని నడిపించారు. కానీ అనూహ్యంగా పేట లో మార్పులు జరిగాయి. ఈ దఫా పేట నుండి పోటీ చేయడానికి బి ఫార్మ్ అందుకోబోయేది రాజేష్ నాయుడు కాదని, అందుకు కావటి మనోహర్ నాయుడు అయితే సెట్ అవుతాడని భావించారు ఆపార్టీ పెద్దలు. గుంటూరు నగర మేయర్ గా ఉన్న మనోహర్ నాయుడిని ఎమ్మెల్యే అభ్యర్థిగా మార్చిన ఘనత కూడా రజనిదే అని పేటలో వినిపిస్తున్న టాక్. వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ రజని చలువతోనే మనోహర్ కి టికెట్ దక్కిందని పొలిటికల్ గాసిప్.

ఇక వైసీపీ నుండి బయటకు వచ్చి ఆపార్టీ లోని లొసుగులను లోగుట్టును బయటపెట్టిన మరో నేత వసంత కృష్ణ ప్రసాద్. ఈయన 2019 ఎన్నికల్లో ఉమ్మడి కృష్ణ జిల్లా మైలవరం నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలుపొందారు. కానీ వసంత కృష్ణ ప్రసాద్ కు బయట కన్నా ఇంటిపోరు ఎక్కువైంది. సొంత పార్టీవారే వసంత పై వార్ మొదలెట్టారు. పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ కి వసంత కృష్ణ ప్రసాద్ కి మధ్య పచ్చ గడ్డి వేస్తె భగ్గు మనే స్థాయికి చేరుకుంది వివాదం.

ఈ వ్యవహారం మీద అధినేత జగన్ కి కంప్లైంట్ చేసినా ఫలితం లేకపోయిందని, పైగా తానూ ప్రాతినిధ్యం వహిస్తున్న మైలవరం నియోజకవర్గం లో పెడన ఎమ్మెల్యే జోగి పెత్తనం కూడా ఎక్కువైందని, అయన అనుచరులు దాష్టీకం పెరిగిపోయిందని వసంత వ్యాఖ్యానించారు. తీరా చుస్తే మైలవరం టికెట్ ను జోగి రమేష్ కు కాకుండా, వసంత కృష్ణ ప్రసాద్ కు కాకుండా మరో వ్యక్తికీ కేటాయించారు, 2024 ఎన్నికల్లో ఈ స్థానం నుండి శరణాల తిరుపతిరావు పోటీ చేయనున్నారు. జోగితో వైరం బాగా ముదిరిన నేపథ్యంలో వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీ గూటికి చేరిపోయారు.

వైసీపీ అధినేత జగన్ కు బాగా సన్నిహితంగా ఉండే మరో నేత మాజీ ఎమ్మెల్సీ జాంగా కృష్ణ మూర్తి, అయన 1999, 2004 ఎన్నికల్లో వరుసగా రెండుపర్యాయాలు గురజాల నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1994 నుండి ఈ నియోజకవర్గంలో జంగా కృష్ణమూర్తి, యరపతినేని శ్రీనివాసరావు మధ్యనే పోటీ ఉండేది. కానీ 2019 ఎన్నికల్లో ఈ స్థానం నుండి మాజీ మంత్రి కాసు కృష్ణా రెడ్డి తనయుడు కాసు మహేష్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీచేసి యరపతినేని విజయం సాధించారు. కాసు మహేష్ రెడ్డి జగన్ కి మంచి స్నేహితుడు కూడా.

అయితే కాసు గురజాలకు ఎంటర్ అయ్యాక జంగా వర్గాన్ని పెద్దగా పట్టించుకున్నది లేదని వినికిడి. పైగా జంగా కూడా 2024 ఎన్నికల్లో గురజాల నుండి పోటీ చేయాలనీ కృత నిశ్చయంతో ఉన్నారు. కానీ జగన్ జంగా కి మొండి చేయి చూపెట్టారు. ఈ క్రమం లోనే జంగా టీడీపీ వైపు చుస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఆయనకు నరసారావు పేట సీటు కేటాయించే వీలుందని అంటున్నారు. అయితే ఇప్పటికే ఆ సీటును డాక్టర్ అరవింద్ బాబుకి కేటాయించింది టీడీపీ అధిష్టానం. మరి టికెట్ విషయంలో మార్పులు చేర్పులు ఉండవా అంటే, ఉండవని కూడా చెప్పలేం. కొన్ని సందర్భాల్లో బి ఫార్మ్ ఇచ్చిన తరువాత కూడా అభ్యర్థిని మార్చిన దాఖలాలు మన దేశంలో ఉన్నాయి.

ఇక గాజువాక నియోజకవర్గం గురించి మాట్లాడుకోవాలి. ఈ నియోజకవర్గం ఆంధ్ర ప్రదేశ్ లో చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ స్థానం నుండి పోటీ చేయడానికి ప్రస్తుత వైసీపీ నేతలు జంకుతున్నారని చెప్పాలి. అందుకు ప్రధాన కారణం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటైజేషన్. అయితే 2019 ఎన్నికలు మాత్రం అందుకు పూర్తి విరుద్ధం, ఆనాడు ఈ స్థానంలో వైసీపీ చాలా బలంగా ఉంది. ఎంత అంటే అక్కడ పోటీ చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ఓడించే అంత. కానీ ఈ సారి ఆ స్థానం నుండి తిప్పల నాగిరెడ్డిని తప్పించి మంత్రి గుడివాడ అమర్నాథ్ ను నిలబెట్టింది వైసీపీ అధిష్టానం. 2019 లో అనకాపల్లి నుండి ఎమ్మెల్యే గా గెలిచి ఆపై కేబినెట్ లో చోటు దక్కించుకున్నారు అమర్నాథ్. కానీ 2024 ఎన్నికల్లో అనకాపల్లి నుండి స్దాన చలనం తప్పదని తెలుసుకున్న అయన కొంత భావోద్వేగానికి గురయ్యారు. మరి ఇక్కడ టికెట్ దక్కకపోవడంతోనే నాగిరెడ్డి తనయుడు దేవన్ రెడ్డి వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది.

ఇది కేవలం వైసీపీ లోనే కాదు ప్రతిపక్ష టీడీపీ లో కూడా అసమ్మతి జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. సీఎం జగన్ జగన్ మోహన్ రెడ్డిది ఒకరకం తలనొప్పితో బాధపడుతుంటే టీడీపీ అధినేత చంద్రబాబు మరో రకం తలనొప్పితో బాధపడుతున్నారు. చంద్రబాబు జనసేన, బీజేపీ తో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళుతుండటం వల్ల సీట్లు సర్దుబాటు చేయడం కోసం ఒక రకం సర్కస్ చేస్తుంటే అసమ్మతి నేతలను బుజ్జగించడం కోసం మరోరకం సర్కస్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మొదటి జాబితా విడుదల అయిన సమయంలో చాల మంది రెండవ జాబితాపై ఆశలు పీటుకున్నారు. తీరా రెండవ జాబితా లో కూడా తమ పేరు లేకపోవడం వల్ల రచ్చ రచ్చ చేశారు. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గం, రంపచోడవరం, చింతలపూడి నియోజకవర్గాలకు చెందిన నేతలు నిరాశకు గురయ్యారు. ముఖ్యంగా రంపచోడవరం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు. చింతలపూడి మాజీ ఎమ్మెల్యే పీతల సుజాత భావోద్వేగభరితంగా మాట్లాడారు. అధినేత చంద్రబాబు టికెట్ల విషయంలో పునరాలోచన చేయాలనీ కోరారు.

ఇప్పటికిప్పుడు చూసినా ఎన్నికలకు చాలా సమయం ఉంది. మార్చ్ 16 వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. మే 13 వతేదీన ఎన్నికలు నిర్వహించనున్నారు. నామినేషన్లకు ఆఖరు తేదీ ఏప్రియల్ 29 కాబట్టి ఏప్రియల్ 29 లోపు కూడా ఏవైనా మార్పులు జరిగితే జరగవచ్చు.కాబట్టి తమ మనసులోని మాటలను అసమతినేతలు, ఆశావహులు నిర్మొహమాటంగా బయటపెడుతున్నారు.

Leave a Comment