Tiger – 3 New song : టైగర్ 3 నుండి “రువాన్” లిరికల్ సాంగ్ విడుదల.. సల్మాన్ – కత్రినా జోడి

ezgif 1 26f1654ffc Tiger - 3 New song : టైగర్ 3 నుండి "రువాన్" లిరికల్ సాంగ్ విడుదల.. సల్మాన్ - కత్రినా జోడి

Tiger – 3 New song : టైగర్ 3 నుండి “రువాన్” లిరికల్ సాంగ్ విడుదల..విపరీతంగా వైరల్ అవుతున్న పాట..మరోసారి అలరించనున్న సల్మాన్ – కత్రినా జోడి

యష్ రాజ్ ఫిలిమ్స్ పతాకంపై ఆదిత్య చోప్రా నిర్మించిన తాజా చిత్రం టైగర్ – 3 ఈ సినిమా లో సల్మాన్ ఖాన్ కత్రినా కైఫ్ జోడి గా నటించారు. 2012 లో వచ్చిన ఏక్ థా టైగర్, 2017లో వచ్చిన టైగర్ జిందా హై సినిమాలకు ఇది కొనసాగింపు.

ఈ సినిమా కోసం సల్మాన్ ఫాన్స్ చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మనీష్ శర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా లో సీరియల్ కిస్సర్ ఇమ్రాన్ హష్మి ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు.

నవంబర్ 12 వతేదీన ఈ సినిమాను దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకి తీసుకురానున్నారు. మేకర్స్ ఈ చిత్రం నుండి రువాన్ అంటూ సాగె లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు. అరిజిత్ సింగ్ గాత్రం నుండి జాలువారిన ఈ పాటకు ప్రీతం సంగీతాన్ని సమకూర్చారు.

సల్మాన్ ఖాన్ పై చితీరాకరించిన ఈ పాటను ప్రేక్షకుల కోసం విడుదల చేయడం చాలా సంతోషకరంగా ఉందన్నారు. ఈ పాట సినిమాపై మరింత ఆశక్తిని పెంచుతుందని వారు ఆశిస్తున్నామన్నారు.

ఈ సినిమాలో కత్రినా సల్మాన్ ఇద్దరు కూడా గూఢ చర్యం చేసే పాత్రలను పోషించారని అన్నారు

Leave a Comment