Tillu Square Trailer: లిల్లీ చేతుల మళ్లీ బలైన టిల్లు…ట్రైలర్ కిరాక్ ఉంది గురూ

WhatsApp Image 2024 03 28 at 11.49.49 AM 1 Tillu Square Trailer: లిల్లీ చేతుల మళ్లీ బలైన టిల్లు…ట్రైలర్ కిరాక్ ఉంది గురూ

డీజే టిల్లు (DJ Tillu)మూవీతో సూపర్ సక్సెస్‌‌ను అందుకున్న సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda)ఇప్పుడు టిల్లు స్క్వేర్ (Tillu Square)తో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యాడు. మల్లిక్ రామ్ (Malllik Ram )డైరెక్షన్ పై ప్రజలకు మంచి ఒపీనియన్ ఉంద. ఇపపటికే ఈ సినిమా నుంచి రిలీజైన పాటలు, పోస్టర్లు, టీజర్ తో పాటు ప్రస్తుతం ట్రైలర్ కూడా అంచనాలను పెంచేసతోంది. సినిమా రిలీజ్ కి రోజుల ట్రైలర్ రావడంతో సిద్ధు ఫ్యాన్స్ పడగచేసుకుంటున్నారు. ఇక ట్రైలర్ తో మరోసరి అందరు సిద్ధు పొట్ట చెక్కలయ్యేలా నవ్వించడం ఖాయం అని తెలుస్తోంది. మార్కస్ చెప్పు అనే డైలాగ్ మరోసారి నెట్టింట్లో మారుమోగుతోంది.

లిల్లీ చేతిలో టిల్లు బలి :

‘టిల్లు స్వ్కేర్’ (Tillu Square)సినిమా కోసం సినీ ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ నటించిన ఈ మూవీ కోసం యూత్ ఎంతగానో వెయిట్ చేస్తోంది. ఈ మూవీలో టాలీవుడ్ నటి అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) సిద్ధుకి జోడీగా నటించింది.

WhatsApp Image 2024 03 28 at 11.50.16 AM Tillu Square Trailer: లిల్లీ చేతుల మళ్లీ బలైన టిల్లు…ట్రైలర్ కిరాక్ ఉంది గురూ

అనుపమ ఈ మూవీలో లిల్లీ క్యారెక్టర్ చేస్తోంది. అప్పట్టో డీజే టిల్లూలో రాధిక పేరు ఏ విధంగా ట్రెండైందో..ఈ సారి లిల్లీ పేరు అలాగే మారుమోగడం పక్కా అంటున్నారు ట్రైలర్ చూసిన ఫ్యాన్స్. ఇక ఈ మూవీలో గతంలో ఎన్నడూ లేని విధంగా అనుపమ గ్లామర్ డోస్ పెంచేసింది. బోల్డ్ క్యారెక్టర్ లో ఓ రేంజ్ లో రెచ్చిపోయింది. ఇక ఈ మూవీ సితార ఎంటర్టయిన్‎మెంట్స్ బ్యానర్ లో మార్చి 29న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ మూవీకి రామ్ మిర్యాల (Ram Miryala)తో పాటు అచ్చు రాజమణి మ్యూజిక్ అందిస్తుండగా.

ఎక్కడ పడతావ్ రా ఇలాంటి జంబల్ హాట్ లేడీస్ని :

ట్రైలర్ లో మరోసారి సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) తనదైన కామెడీ టైమింగ్ తో పిచ్చెక్కించాడు. ట్రైలర్ ను చూసి సిద్ధు ఫ్యాన్స్ పిచ్చిపిచ్చిగా నవ్వుకుంటున్నారు. టిల్లు కారులో వెళ్తున్న క్రమంలో టిల్లు ఫాధర్ మళ్ళా ఏ పంచాయితీలా ఇరుక్కున్నావ్రా అని అడిగిన వెంటనే అనుపమతో సిద్ధు రొమాన్స్ చూపించడం ఈ ట్రైలర్ లో హైలైట్ గా నిలుస్తుంది. ట్రైలర్ లో డైరెక్ట్ గా టిల్లు అనుపమ(Anupama Parameswaran)తోనే పంచాయితీ పెట్టుకున్నట్టు చూపించాడు డైరెక్టర్ . ప్రతిసారి ఎక్కడ పడతావ్ రా ఇలాంటి జంబల్ హాట్ లేడీస్ని అని ప్రిన్స్ (Prince) చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది.

Leave a Comment