బహుముఖ ప్రజ్ఞాశాలి, రాజనీతిజ్ఞుడు, రాజకీయ కోవిదుడు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అనే చెప్తారు అందరు. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగాను , కేంద్ర మంత్రిగాను, రాజీవ్ గాంధీ హత్యానంతరం ప్రధాన మంత్రిగా పదవిని చేపట్టి తనదైన ముద్రవేశారు మన P.V. నరసింహా రావు గారు. అంతే కాదు మన తెలుగుజాతి గర్వించేలా మన దేశ ఖ్యాతిని దశ దిశలా చాటి చెప్పిన పాములపర్తి వెంకటన నరసింహారావుకు ఈరోజు దేశ అత్యున్నత పౌరపురస్కారం అయిన భారతరత్నను PV నరసింహా రావు కుటుంబ సబ్యులకు అందజేయడం ప్రపంచ నలుమూలల ఉన్న తెలుగువారు అందరు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
P.V. నరసింహా రావు గారు వరంగల్ జిల్లా నర్సంపేట మండలం కు చెందిన లక్నేపల్లి అనే చిన్న గ్రామంలో 1921 జూన్ 28న ఓ బ్రాహ్మణ కుటుంబంలో P.V. జన్మించారు. వీరి తల్లి తండ్రులు సీతారామ రావు, రుక్మాబాయి. P.V. నరసింహా రావు గారు తన ప్రాథమిక విద్య అనంతరం హైదరాబాద్ నగరానికి వచ్చి తన విద్యను కొనసాగించడం చేసారు. నగరం లో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలో ఆయన తన బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చెయ్యడం జరిగింది. చదువు పూర్తి చేసిన అనంతరం ఆయన 1930 సంవత్సరం చివరలో హైదరాబాద్ స్టేట్‌లో అప్పుడు జరుగుచున్న వందేమాతరం ఉద్యమంలో పాల్గొన్నారు.
PV నరసింహా రావు గారు తన డిగ్రీ పూర్తి చేసిన తర్వాత పుణేలో ఉన్న ఫెర్గూసన్ కాలేజీ నుంచి ఆయన న్యాయశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీని అందుకున్నారు. కొంత కాలానికి మరల నగరానికి వచ్చి కొన్ని రోజులు పాటు కాకతీయ పత్రికలో జయ-విజయ అనే పేరుతో చాలా వ్యాసాలు రాయడం జరిగింది. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణా ప్రాంతం లోని మంథని నియోజకవర్గం నుండి 1957 లో కాంగ్రెస్ అభ్యర్థిగామొదటి సారి పోటీ చేసి విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో 1962, 67, 72 సంవత్సరాలలో వరుసగా విజయ ఢoకా మోగించారు . ఇన్ని సార్లు ఎమ్మెల్యేగా విజయం అందుకున్న P. V. కి మంత్రి పదవి వరించింది. అంతే కాదు ఆయన తొమ్మిదేళ్ల పాటు న్యాయ, సమాచార, వైద్య, శాఖల మంత్రిగా పనిచేసి పలువురు రాజకీయ ప్రముఖులచే మన్నలను పొందారు.
ఇక అప్పట్లో కాంగ్రెస్ పార్టీ లో ముఖ్యమంత్రి పదవి ఆశించేవారు ఎక్కువగా ఉండంతో చివరకు వివాదరహితుడు, పార్టీలోని ఏ గ్రూపుకూ చెందనివాడు రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తి అయిన P. V. ని అధిష్ఠానం ఎంపిక చేసి ముఖ్యమంత్రి భాధ్యతలను స్వీకరించాలని కోరడంతో ఆయన 1971 సెప్టెంబరు 30 న ఆయన మొదటి సారి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధత్యలు తీసుకుని కేవలం రెండేళ్ల పాటు మాత్రమే ఆయన పదవిలో ఉన్నారు . ఇక ఆ తర్వాత కేంద్రానికి వెళ్ళి 1977లో మొదటి సారి హనుమకొండ పార్లమెంట్ స్థానంకు పోటీ చేసి కేంద్ర రాజకీయాల్లోకి అడుగుపెట్టడం జరిగింది. తదనంతరం ఆయా పదవులు చేపట్టి వాటిని విజయవంతం గా నిర్వహించారు. ఇక ఎవ్వరు ఊహించని విధం గా రాజీవ్ గాంధీ హత్యతో 1991లో ప్రధాని పదవి P.V.ని వరించింది. అంతే కాదు ప్రధాన మంత్రి పదవిని చేపట్టిన తొలి తెలుగు వ్యక్తి గా, దక్షిణ భారతీయుడిగా చరిత్రలో కల కాలం నిలిచిపోయారు.
ఆయన చేపట్టిన పలు ఆర్ధిక సంస్కరణలు దేశాన్ని బలమైన స్దితి లో ఉండేలా చేసాయి. P.V. ప్రధాని గా ఉన్న కాలం లో ప్రపంచ మార్కెట్లకు భారత్ తన ద్వారాలు తెరిచింది. అంతే కాకుండా అయన అవలంభించిన విదేశాంగ విధానం కాని , భాష అభివృద్ధి కాని , విద్యా రంగాలకు అందించిన సహకారం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటాయి. గతంలో భారత పరిస్థితి చుసుకుంటే ఆహార ఉత్పత్తుల విషయం లో దిగుమతి చేసుకునే అట్టడుగున స్దానం లో ఉన్న భారత్ ఈనాడు ప్రపంచానికి పెద్ద మొత్తంలో ఆహార ధాన్యాలను సరఫరా దేశంగా ఆవిర్భవించిందంటే అది P.V. అనుసరించిన సంస్కరణలే వల్లే అని బల్ల గుద్ది చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.