Dec 8th Zodiac signs: ఈరోజు ఈ రాశి వారు విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.

Today, people of this sign participate in feasts and entertainment.

Dec 8th Zodiac signs: ఈరోజు ఈ రాశి వారు విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.

మేషరాశి:

ఈరాశి వారు ఈరోజు వృత్తి, ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు.. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అన్ని రంగాల వారికి ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది.

దైవదర్శనం చేసుకుంటారు. ఆకస్మిక ధన, వస్తులాభాలు పొందుతారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

వృషభ రాశి:

వీరికి ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. నూతన పరిచయాలు పెరుగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలకు పెరుగుతాయి. వ్యాపారంలో లాభాలు గడిస్తారు.

ఉద్యోగంలో అనుకూలత ఉంటుంది. విద్యార్థులకు అనుకూలం. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి.

మిధున రాశి:

నిరుద్యోగులకు అనుకూలంగా లేదు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. అన్ని రంగాల వారికి ఒడిదుడుకులు తప్పవు.

అప్పుల బాధ అధికమవుతుంది.. ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తుంది. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు

కర్కాటక రాశి:

నూతన రుణ ప్రయత్నాలు అనుకూలించవు. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. బంధువులతో స్వల్ప విభేదాలు తప్పవు.

కొన్ని వ్యవహారాలలో అంచనాలు అందుకోవడంలో విఫలమవుతారు. వ్యాపార, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి. విద్యార్థులు పరీక్షల్లో ఆశించిన ఫలితాలు పొందకపోవచ్చు.

సింహ రాశి:

Add a heading 2023 12 08T170059.344 Dec 8th Zodiac signs: ఈరోజు ఈ రాశి వారు విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.

వీరికి ఉద్యోగంలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. నిరుద్యోగులుకు అవకాశాలు కలిసి వస్తాయి.. నూతన వ్యక్తుల పరిచయం కలుగుతుంది. కీలక సమయంలో సోదరుల నుండి సాయం అందుతుంది.

వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. విదేశీయానానికి సంబంధించిన అంశాలు అనుకూలంగా ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.

కన్య రాశి:

వ్యాపారాలు కొంత నత్తనడకన సాగుతాయి. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. అయితే వాటన్నింటినీ ఆలస్యంగానైనా నెరవేరుస్తారు. అనారోగ్య సూచనలు ఉన్నాయి.

దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థికంగా కొంత చికాకులు తప్పవు. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు.


తుల రాశి:


ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఆనందంగా ఉంటారు. మానసికోల్లాసం కలుగుతుంది. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి. అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంది.


వృశ్చిక రాశి:


వ్యాపారాలు, ఉద్యోగస్తులకు మిశ్రమంగా ఉంటుంది.. బంధు వర్గం వారితో విభేదాలు తప్పవు. వృధా ఖర్చులు పెరుగుతాయి. గృహ నిర్మాణ ఆలోచనలు ఓ కొలిక్కి రాకుండా ఉంటాయి. సంతానం విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది. చేపట్టిన పనులలో శ్రమ పడ్డా ఫలితం కనిపించదు.


ధనస్సు రాశి:


ఈ రాశి వారు ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగవుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అనుకూలంగా ఉంటుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మిత్రుల నుండి విలువైన సమాచారం అందుతుంది. రాజకీయనాయకులకు అనుకూలంగా ఉంటుంది.


మకర రాశి:


మకరరాశి వారికి ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఉద్యోగస్తులు నూతన ప్రోత్సాహకాలను అందుకుంటారు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. దైవ సేవా కార్యక్రమాలకు ధనసహాయం అందిస్తారు.


కుంభ రాశి:


నిరుద్యోగుల యత్నాలు కొంత నిరాశ కలిగిస్తాయి. చేపట్టిన పనులలో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. డబ్బు ఆచితూచి ఖర్చుపెట్టడం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ముఖ్యమైన పనులు వాయిదా వెయ్యటం మంచిది.


మీన రాశి:


మీనరాశి వారికి వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఆధ్యాత్మిక ఈ విషయాలపై దృష్టి సారిస్తారు. చేపట్టిన పనుల్లో ఆటంగాకలుంటాయి. చిన్నపాటి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ప్రయాణాలు చివరి నిమిషంలో వాయిదా పడతాయి.

Leave a Comment