Today Zodiac Signs: ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది.

Today the financial situation will be hopeless for this zodiac sign.

Today Zodiac Signs: ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది.

మేషరాశి:

మేషరాశి వారికి ఇవాళ చాలాబాగుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.

చిన్ననాటి స్నేహితులతో కాలం గడుపుతారు. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు లభిస్తాయి. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లు లభిస్తాయి.

వృషభ రాశి:

వీరికి మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. ఉద్యోగంలో కాస్త ఒడిదొడుకులు ఉన్నప్పటికీ అధికారులు అనుగ్రహంతో సమస్యల నుండి బయటపడతారు.

నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. బంధుమిత్రులతో శుభకార్యాలకు హాజరవుతారు. రాజకీయ ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.

మిధున రాశి:

వీరికి ఈరోజు సన్నిహితులతో మాటపట్టింపులు తప్పవు. చేపట్టిన పనులు నెమ్మదిగా సాగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు సూచిస్తున్నాయి.

వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. నిరుద్యోగులకు కలిసిరాదు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. దూరప్రయాణాలు చేసే అవకాశాలున్నాయి.

కర్కాటక రాశి:

Add a heading 2023 12 09T100825.049 1 Today Zodiac Signs: ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది.

కర్కాటకరాశివారు దూరప్రయణాలు చేస్తారు. రుణదాతల నుండి ఒత్తిడి అధికమవుతుంది. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. మానసికంగా ప్రశాంతత కరువవుతుంది.

వ్యాపార, ఉద్యోగాలు నిరుత్సాహ పరుస్తాయి. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమతో కానీ పనులు పూర్తి కావు. విద్యార్థులు అతికష్టం మీద విజయాన్ని సాధిస్తారు.

సింహ రాశి:

సింహరాశి వారికి ఈరోజు ఆప్తుల నుంచి ఓ కీలక సమాచారం అందుతుంది. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. చేపట్టిన పనులు విజయవంతం అవుతాయి.

కన్య రాశి:

ఈరోజు ముఖ్యమైన నిర్ణయాలను తీసుకుంటారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి.

దూర ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది. వ్యాపార ఉద్యోగాలలో ఒత్తిడి తప్పదు. ఇంటాబయట పని ఒత్తిడి అధికమై సమయానికి నిద్రాహారాలు ఉండవు.

తుల రాశి:

వీరికి సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో ఆశించినంతగా ప్రయోజనం ఉండదు. కీలక సమయంలో ఆప్తుల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి.

వృశ్చిక రాశి:

వీరికి చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు తప్పవు. స్తిరాస్థి వివాదాలు కొనసాగుతాయి. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. రుణ ప్రయత్నాలు చేస్తారు. బంధువులతో అకారణ విభేదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు.

ధనస్సు రాశి:

ధనస్సు రాశి వారికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నూతన పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి.నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలున్నాయి.

మకర రాశి:

ఇంటాబయట మీ మాటకు విలువ పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. మిత్రుల నుంచి కీలక సమాచారం సేకరిస్తారు. రుణబాధలు తీరుతాయి. విందు వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. బంధు మిత్రుల నుండి విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు..దైవదర్శనాలు చేసుకుంటారు.

కుంభ రాశి:

ఈరాశి వారు ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. ముఖ్యమైన పనులు మందకొండిగా సాగుతాయి.. రుణప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార,ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. దైవ చింతన పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది.

మీన రాశి:

మీనరాశి వారికి ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహకరంగా ఉంటుంది. సన్నిహితులతో మాటపట్టింపులు ఉంటాయి. శ్రమాధిక్యత ఉంది. తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిదికాదు. దైవ,సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.

Leave a Comment