VISHWAK SEN: విశ్వక్‌ సేన్‌ మరో సాహసం..వారిలా మెప్పించగలడా?

Vishwak sen interview VISHWAK SEN: విశ్వక్‌ సేన్‌ మరో సాహసం..వారిలా మెప్పించగలడా?

టాలీవుడ్ లో విశ్వక్‌ సేన్‌ (Vishwak Sen)కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. యూనిక్ స్టోరీస్ తో విశ్వక్‌ ఎప్పుడూ ప్రేక్షకులను అలరిస్తుంటాడు. మాస్‌ అండ్‌ బోల్డ్‌ క్యారెక్టర్స్‌కి ఈ యువ హీరో కేరాఫ్‌ అడ్రస్‌ అని చెప్పక తప్పదు. మొన్నటి వరకు మాస్‌ రోల్స్‌తో అల్లాడించిన విశ్వక్‌ ఇప్పుడు తన రూటు మార్చాడు. సరికొత్త క్యారెక్టర్స్ తో సాహసాలు చేస్తున్నాడు.

ఈసారి విశ్వక్ ‘గామి'(Gaami )మూవీలో అఘోరా పాత్రతో భయపెట్టేందుకు రెడీ అవుతున్నాడు. ఇండియాస్ట్రీ లో తనకున్న మాస్‌ ఇమేజ్‌ని పక్కన పెట్టి అఘోరగా అవతారమెత్తాడు. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. మార్చి 8న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ మూవీ ప్రమోషన్స్‌ మొదలు పెట్టారు. తాజాగా విశ్వక్‌ సేన్‌ కూడా ప్రొమోషన్స్ లో భాగంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశాడు. తన అప్ కమింగ్ మూవీపై లీక్‌ ఇచ్చి అందరిని అవాక్కు చేశాడు.

లేడీ గెటప్ లో విశ్వక్ :

ప్రమోషన్ లో భాగంగా మీడియాతో విశ్వక్ మాట్లాడుతూ..” గామి (Gaami )తర్వాత ‘లైలా'(Laila )అనే మూవీ చేస్తున్నాను. ఈ మూవీ స్టోరీ స్క్రిన్‌ ప్లే రాసుకున్నాను.డైరెక్షన్‌ కూడా నేనే చేయాలనుకుంటున్నాను. కానీ కొత్త వాళ్లకు ఆ ఛాన్స్ ఇస్తున్నా. దిల్‌సుఖ్‌నగర్‌ చెందిన కొత్త డైరెక్టర్ ఈ సినిమాతో పరిచయం కాబోతున్నాడు. ఈ మూవీలో నేను లేడీ గెటప్‌ లో కనిపిస్తాను””అని చెప్పి షాక్ ఇచ్చాడు.

లైలా అవతారంలో మెప్పిస్తాడా? :

లైలా మూవీలో సెకండ్ హాఫ్ లో లేడీ గెటప్ లో ఉంటానని విశ్వక్ తన నెక్స్ట్ మూవీ కి సంబంధించి క్రేజీ అప్ డేట్ ఇచ్చాడు. ఇదంతా చూస్తుంటే విశ్వక్‌ మరోసారి సాహసం చేస్తున్నాడనిపిస్తుంది.

అప్పట్లో ఇలాంటి లేడీ గేటప్ లనుసీనియర్ నటులు కమల్ హాసన్(Kamal Haasan) , రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad ), శివ కార్తికేయన్ (Siva Karthikeyan ), మంచు మనోజ్(Manchu Manoj )వంటి స్టార్‌ హీరోలు కనిపించి కడుపుబ్బా నవ్వించారు. ‘భామనే సత్యభామనే’ (Bhamane Satyabhamane )లో కమల్ హాసన్(Kamal Haasan ), ‘మేడం’ (Madam ) సినిమాలో రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad )రెమో’ మూవీలో శివ కార్తికేయన్ (Siva Karthikeyan )..

వంటి హీరోలు ఫుల్‌ లెన్త్‌లో లేడీ గెటప్‌లో కనిపించి ప్రేక్షకులను మెప్పించారు.ఇప్పుడు వీరి బాటలోనే విశ్వక్(Vishwak Sen) కూడా లేడీ క్యారెక్టర్ చేయబోతున్నాడు.

Leave a Comment