Anushka Shetty: షాకింగ్ లుక్‎లో స్వీటీ..వామ్మో ఎంత మార్పు

WhatsApp Image 2024 03 12 at 5.02.40 PM Anushka Shetty: షాకింగ్ లుక్‎లో స్వీటీ..వామ్మో ఎంత మార్పు

గత రెండు దశాబ్దాల పాటు తెలుగు ఇండస్ట్రీని ఏలిన నటి అనుష్క శెట్టి (Anushka Shetty). తెలుగులోనే కాదు అటు తమిళంలోనూ స్టార్ హీరోలందరితో నటించింది. స్టార్డమ్ సంపాదించింది. ఆ తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాలకే పరిమితమంది జేజమ్మ. ప్రస్తుతం అనుష్క్ ఫామ్ లో లేకపోయినా ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్‌ మాత్రం భారీగానే ఉంటుంది.

ఈ మధ్యనే మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి (Ms Shetty Mrs Polishetty)మూవీలో నటించి ప్రేక్షకులను అలరించింది. ఆ తర్వాత మళ్లీ సినిమా చేయలేదు. అయితే తమ హీరోయిన్ సినిమాలే చేయకపోవడంతో అభిమానులంతా ప్రస్తుతం లబోదిబోమన్నారు. అనుష్క ఇక సినిమాలు చేయదనుకుంటున్న తరుణంలో ఓ గుడ్ న్యూస్ తో ముందుకు వచ్చింది అనుష్క.

అంతే కాదు బొద్దుగా ఉన్న ఈ ముద్దుగుమ్మ కాస్త సన్నబడి అందరిని ఆశ్చర్యపరుస్తోంది. అమ్మడి లుక్ చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. సినీ ఇండస్ట్రీకి వచ్చిన 19 ఏళ్ల తర్వాత ఆమె అలా మారిపోవడం చూసి అభిమానులు అవాక్కవుతున్నారు.

ఆ సినిమా కోసమే అంతలా మారిందా? :

WhatsApp Image 2024 03 12 at 5.03.09 PM 1 Anushka Shetty: షాకింగ్ లుక్‎లో స్వీటీ..వామ్మో ఎంత మార్పు

అనుష్క శెట్టి (Anushka Shetty)ని అందరూ ముద్దుగా స్వీటీ అని పిలుస్తారు. చూడచక్కని రూపం, చక్కటి అభినయంతో తెలుగు, తమిళ ఇండస్ట్రీలో ఎంతోమంది అభిమానుల‌ను సొంతం చేసుకుంది. ఇక తాజాగా స్వీటీ మాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతోంది. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ (Ms Shetty Mrs Polishetty)మూవీ కంటే ముందే ఈ ప్రాజెక్ట్ కి అనుష్క సైన్ చేసింది. ‘కథానర్’ (Kathanar)అనే మూవీలో జయసూర్య తో కలిసి నటించనుంది. ఈ రోజే స్వీటీని తమ సెట్స్‌లోకి మూవీ యూనిట్ బొకే ఇచ్చి వెల్కమ్ చెప్పింది. తాజాగా ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ట్విట్టర్ లో అనుష్క లేటెస్ట్ ఫొటోలు చూసిన ఫ్యాన్స్ ఆమె లుక్స్ కి ఫిదా అవుతున్నారు. అనుష్క ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ మూవీ కోసం అనుష్క చాలా సన్నబడిపోయినట్లు తెలుస్తోంది.

నెగ‌టివ్ రోల్ లో అనుష్క

రోజిన్ థామ‌స్ (Rojin Thomas) డైరెక్షన్ లో వస్తున్న మూవీ ‘కథానర్’ (Kathanar) ఫ‌స్ట్ గ్లింప్స్ ఈ మధ్యనే విడుదలైంది. అయితే అందులో స్వీటీ ఎక్కడా కనిపించలేదు. అతీంద్రియ శక్తులు ఉన్నాయని నమ్మే కేరళ పూజారి కడమతుత్తు కథనార్ (Kadamatuthu Kathanaar) రియల్ స్టోరీ ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో అనుష్క (Anushka) నెగ‌టివ్ రోల్ ప్లే చేస్తున్న‌ట్లు టాక్ వినిపిస్తోంది. అరుంధ‌తి (Arundathi)త‌ర‌హాలో ఈ సినిమా ఉంటుందని సమాచారం. మొత్తం 14 భాష‌ల్లో ఈ సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.

ఆసక్తికరంగా గ్లింప్స్ :

ఈ గ్లిమ్స్ లో జయసూర్య (Jayasurya)ను చర్చి ఆపీసర్లు ఓ నేరస్తుడిగా చూపించారు. జయ సూర్య తమ చర్చిని నాశనం చేసే కొన్ని దుష్టశక్తులను కలిగి ఉన్నాడని వారి నమ్మకం. మరోపక్క గ్రామస్తులు కూడా ఓ వింత వ్యాధితో బాధపడుతున్నట్లు చూపించారు. గ్లింప్స్‌లో ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందరిని ఆకట్టుంది.

Leave a Comment