నాకు బ్రెయిన్‎తో పనిలేదు. అలాంటి అబ్బాయే కావాలి : Tollywood Actress Sreeleela funny comments about his life partner

website 6tvnews template 58 నాకు బ్రెయిన్‎తో పనిలేదు. అలాంటి అబ్బాయే కావాలి : Tollywood Actress Sreeleela funny comments about his life partner

Tollywood Actress Sreeleela funny comments about his life partner : తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన కొద్దికాలంలోనే లక్కీ లేడీగా పేరు సంపాదించుకుంది శ్రీలీల (Sreeleela). కుర్ర హీరోల నుంచి స్టార్ హీరోల వరకు అందరితో స్క్రీన్ షేర్ చేసుకుంటూ వరుసగా భారీ ప్రాజెక్టులతో దూసుకుపోతుంది శ్రీలీల.

ఈ మధ్యనే శ్రీలీల టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు (Mahesh Babu)తో గుంటూరు కారం (Guntur Kaaram)సినిమా చేసి తన నటనతో , డ్యాన్స్ మూమెంట్స్‎తో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. ఓ వైపు యాక్టింగ్ మరోవైపు డాక్టర్ చదువులతో బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ.

రీసెంట్ గా శ్రీలీల పీపుల్ మీడియా ఎంటర్టైన్మెంట్స్ (People Media Entertainments)నిర్మాణ సంస్థ ‘ఒరిజినల్’ అనే ఓ కొత్త సెలబ్రిటీ ఇంటర్వ్యూ ప్రోగ్రాంని స్టార్ట్ చేసింది. ఈ షోకు సౌమ్య (Sowmya)హోస్ట్ గా వ్యవహరిస్తోంది. ఈ ఒరిజినల్ ఇంటర్వ్యూ ఫస్ట్ ఎపిసోడ్ కి శ్రీలీల గెస్ట్ గా వచ్చింది. యాంకర్ అడిగిన ప్రశ్నలకు ఎంతో క్యూట్ గా, ఫన్నీగా సమాధానాలు చెప్పింది శ్రీలీల.

ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ ప్రోమోలో శ్రీలీల తనకు కాబోయే వరుడు ఎలా ఉండాలో చెప్పి అందరిని షాక్ చేసింది.

beautiful sreeleela నాకు బ్రెయిన్‎తో పనిలేదు. అలాంటి అబ్బాయే కావాలి : Tollywood Actress Sreeleela funny comments about his life partner

My Partner Should be like: నా పార్టనర్ అలా ఉండాలి :

రాఘవేంద్రరావు( Raghavendra Rao) డైరెక్షన్ లో వచ్చిన పెళ్లి సందడి (Pelli Sandadi)సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది యంగ్ బ్యూటీ శ్రీలీల (Sreeleela). ఫస్ట్ మూవీతోనే ప్రొడ్యూజర్ల కళ్లల్లో పడిన ఈ బ్యూటీ తెలుగులో వరుసగా క్రేజీ ఆఫర్లను అందుకుంటూ కెరీర్ లో దూసుకెళ్తోంది.

ఓ వైపు చదువు, మరోవైపు సినిమాలను రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ క్షణం తీరిక లేకుండా ముందుకెళ్తోంది. హిట్టు ఫ్లాపు అన్న దానితో సంబంధం లేకుండా దీపం ఉండగానే ఇళ్లు చక్కదిద్దుకోవాలనే సామెతను ఫాలో అవుతోంది. తాజాగా ఈ చిన్నది చేసిన ఇంటర్వ్యూ ప్రోమో అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ వీడియోలో తన అమ్మకు తెలియకుండా చేసిన అల్లరి అల్లరి పనులు గురించి చెప్పింది ఈ బ్యూటి. అంతే కాదు తనకు ఇప్పటి వరకు ఎవరూ లవ్ ప్రపోజ్ చేయలేదని తెలిపింది.

ఇదే టైంలో యాంకర్ సౌమ్య (Sowmya)మీకు బ్రెయిన్ ఉన్న అబ్బాయి పార్టనర్ గా కావాలా..లేదా ఫన్నీగా, జోవియల్ గా ఉండే అతను కావాలా అని అడిగింది. దీనికి శ్రీలీల మాట్లాడుతూ.. ” నాకు ఫన్నీగా, ఫ్రెండ్లీగా ఉండే అబ్బాయే పార్టనర్ గా కావాలి. ఎలాగో బ్రెయిన్ తో చేసే పనులను నేనే చూసుకుంటా”అని ఫన్నీగా ఆన్సర్ ఇచ్చి అందరిని నవ్వించింది ఈ బ్యూటీ. దీంతో ఈ వీడియో నెట్టింట్లో చెక్కర్లు కొడుతోంది.

Sreeleela Did’t Signed New Projects : కొత్త ప్రాజెక్టులు ఒప్పుకోని శ్రీలీల

శ్రీలీల చేతుల్లో ప్రస్తుతం పలు ప్రాజెక్టులు ఉన్నాయి. ఇవి ఇదివరకే సైన్ చసినవి. టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)కు జోడిగా ఓ సినిమాలో నటిస్తుంది. అలాగే పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) , డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar) కాంబోలో ఉస్తాద్ భగత్ సింగ్ (Ustad Baghat Singh) సినిమాలో నటిస్తుంది.

గత కొంత కాలంగా ఈ మూవీ షూటింగ్ కూడా శరవేగంగా సాగుతోంది. అయితే ప్రస్తుతం శ్రీలీల కెరీర్ ప్రమాదంలో పడినట్లైంది. ఈ బ్యూటీ గుంటూరు కారం తర్వాత మరో కొత్త ప్రాజెక్ట్ సైన్ చేయలేదు. ఇప్పటికే కమిట్ అయిన సినిమాలు తప్ప వేరే ఆఫర్స్ లేవని ప్రచారం జరుగుతోంది. దీంతో శ్రీలీల ఇప్పుడే మూవీస్ ఎంపికలో మరింత శ్రద్ధగా ఉంటోందని టాక్.

Leave a Comment