Silk Smitha: సిల్క్ స్మిత అందుకే చనిపోయింది : జయమాలిని

WhatsApp Image 2024 03 19 at 5.25.03 PM Silk Smitha: సిల్క్ స్మిత అందుకే చనిపోయింది : జయమాలిని

సినీ రంగుల ప్రపంచంలోకి ఎంతో మంది తారలు వస్తుంటారు, పోతుంటారు. కానీ కొంత మంది మాత్రం ఎప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో గుర్తుండిపోతారు. అలాంటి వారిలో సౌత్ సెన్సేషనల్ స్టార్ సిల్క్ స్మిత (SilkSmitha)ఒకరు. ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ ఇండస్ట్రీలో అప్పట్లో ఈ బ్యూటీకి ఉన్న క్రేజే వేరు. ఈ బ్యూటీ ఒక్క పాట చేస్తే చాలు సినిమా హిట్ అని మేకర్స్ ఆమెకు భారీ ఆఫర్లు ఇచ్చేవారు. ఆమె స్పెషల్ సాంగ్ లేకుండా సినిమా రిలీజైయ్యేది కాదంటే అతిశయోక్తి కాదేమో. తమిళ సినిమా చక్రం (Chakram) తో ఇండస్ట్రీకి పరిచయమైంది ఈ భామ. తెలుగులో సీతాకోక చిలుక (Seethakoka chiluka) సినిమాలో ఆమె పాత్ర విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సినిమావాళ్లే ఆమెకు సిల్క్ స్మిత అని పేరు పెట్టారు. తెలుగు, తమిళం, కన్నడం, మళయాళం, హిందీ ఇలా ఎన్నో భాషల్లో 200లకు పైగా సినిమాలలో ఎన్నో వైవిధ్యమైన క్యారెక్టర్లలలో నటించి ప్రేక్షకులను మెప్పించింది .

సిల్క్‎ను వెంటాడిన డిప్రెషన్ :

సినిమాల్లో వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ, స్పెషల్ సాంగ్స్ తో అలరిస్తూ మూడు పువ్వులు ఆరు కాయలుగా ఆమె సినీ జీవితం సాగుతున్న టైంలోనే ఎవరూ ఊహించని విధంగా సిల్క్ స్మిత (SilkSmitha)లైఫ్ ఒక్కసారిగా టర్న్ అయ్యింది. అందానికి అందం . డబ్బుకు డబ్బు ఉన్నా ఆమె జీవితం మాత్రం ఇప్పటికీ మిస్టరీనే. కెరీర్ పీక్స్ లోనే ఆమె ఆత్మహత్య చేసుకుని ఇండస్ట్రీని శోకసంద్రంలో ముంచేసింది.

WhatsApp Image 2024 03 19 at 5.25.52 PM Silk Smitha: సిల్క్ స్మిత అందుకే చనిపోయింది : జయమాలిని

డిప్రెషన్ వల్లే ఆమె సూసైడ్ చేసుకుని ఉంటుందని అందరూ ఇప్పటీకి అనుకుంటుంటారు. ఆమె చనిపోయి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ తమ మధ్యే ఉనందని అప్పటి వారు భావిస్తుంటారు. తాజాగా అప్పటి డ్యాన్సర్ , నటి జయమాలిని (Jayamalini) సిల్క్ స్మిత (SilkSmitha)మరణం గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. సిల్క్ మాదిరిగానే జయమాలిని కూడా అప్పట్లో సినిమాల్లో స్పెషల్ సాంగ్స్, వ్యాంప్ క్యారెక్టర్లు చేసేవారు. వారి పాత్రలతో ప్రేక్షకులను అలరించేవారు.

అతను మోసం చేశాడు :

WhatsApp Image 2024 03 19 at 5.24.02 PM Silk Smitha: సిల్క్ స్మిత అందుకే చనిపోయింది : జయమాలిని

ఇంటర్వ్యూలో జయమాలిని (Jayamalini) మాట్లాడుతూ..”ఇండస్ట్రీలోకి వచ్చిన తక్కువ సమయంలోనే పేరుకు పేరు, డబ్బు, పాపులారిటీ సంపాదించింది స్మిత. షూటింగ్స్ ఉన్నప్పుడు మేము పెద్దగా మాట్లాడుకునేవాళ్లము కాదు. మేమిద్దరిం కలిసి కూడా పెద్దగా సినిమాలు చేయలేదు. కానీ ఓ స్టార్ హీరో మూవీలో నేను, మా అక్క జ్యోతిలక్ష్మి (Jyothilakshmi), సిల్క్‌ స్మిత (Silksmitha) కలిసి నటించాం.. కానీ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే స్మిత్ ఇలా సూసైడ్ చేసుకుని ఉండకూడదు. ఆమె చేసిన పెద్ద తప్పు అదే. ప్రేమించడం తప్పుకాదు.. కానీ కన్నవారిని విడిచిపెట్టి ఆమె రావడం వల్లే ఇదంతా జరిగింది. ప్రేమించిన వాడిని గుడ్డిగా నమ్మింది. కానీ అతను మోసం చేశాడు. అయినవారు ఎవరూ ఆపదలో లేరు. దీంతో నిస్సహాయస్థితిలో ఉన్న సిల్క్ స్మిత ప్రేమలో మోసపోయి ఆ ప్రేమకే బలైంది “అని తెలిపారు జయమాలిని.

Leave a Comment