Atlee-Allu Arjun : అట్లీతో అల్లు అర్జున్..అప్డేట్ అదిరిపోలా

WhatsApp Image 2024 03 15 at 5.08.44 PM Atlee-Allu Arjun : అట్లీతో అల్లు అర్జున్..అప్డేట్ అదిరిపోలా

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun ) నటించి పుష్ప2 (Pushpa 2) కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతే కాదు ఈ సినిమా తర్వాత బన్నీ చేయబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి అభిమానులు తెగ చర్చించుకుంటున్నారు. ఎందుకంటే పుష్పను మించి ఉండేలా తన నెక్స్ట్ సినిమాలను ప్లాన్ చేసుకుంటున్నాడు అల్లు అర్జున్.

పుష్ప 2 నే కాదు తర్వాత చేయబోయే సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలే. డైరెక్టర్లు కూడా మంచి స్టార్ ఇమేజ్ ఉన్నవారే. జవాన్ (Jawaan) సినిమాతో బాలీవుడ్ లో దుమ్ముదులిపేసిన కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అట్లీ(Atlee )తో బన్నీ నెక్స్ట్ సినిమా చేయబోతున్నట్లు టాక్ ఇండస్ట్రీ లో వినిపిస్తోంది. బన్నీతో మంచి మాస్ యాక్షన్ సినిమాను తీయబోతున్నాడట. దీనితో బన్నీ – అట్లీ కాంబినేషన్ పై ఫ్యాన్స్, లో ఆసక్తి నెలకొంది.

అట్లీ నుంచి అదిరిపోయే అప్డేట్ :

కింగ్ ఖాన్ షారుక్ ఖాన్‌(Sharukh Khan ) హీరోగా, యంగ్ డైరెక్టర్ అట్లీ(Atlee ) తీసిన ‘జవాన్’ (Jawaan) మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేసేసింది. రూ.1000 కోట్ల వసూళ్లను రాబట్టి అట్లీకి పాన్ ఇండియా ఇమేజ్ తీయనుకోచ్చింది. దీంతో బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ లో అట్లీ చేయబోయే నెక్స్ట్ ప్రాజెక్టు గురించి అందరిలో ఆసక్తి పెరిగింది. ఈ టైం లోనే అట్లీ, అల్లు అర్జున్(Allu Arjun ) తో మూవీ చేయబోతున్నాడని సోషల్ మీడియాలో న్యూస్ హల్ చల్ చేస్తోంది.

WhatsApp Image 2024 03 15 at 5.09.06 PM Atlee-Allu Arjun : అట్లీతో అల్లు అర్జున్..అప్డేట్ అదిరిపోలా

వాస్తవానికి ‘జవాన్’ మూవీలో అల్లు అర్జున్ తో ఓ స్పెషల్ క్యామియో ప్లాన్ చేశాడు అట్లీ. అయితే కొన్ని కారణాల వల్ల అది వర్కౌట్ కాలేదు. దీనితో ఈసారి అట్లీ బన్నీ తో ఓ మాస్ మూవీ తీసేందుకు రెడీ అయ్యాడు. అంతే కాదు తాజా గా తన టీమ్ తో కలిసి డిస్కస్ చేస్తున్న ఓ వీడియో విడుద లై వైరల్ అయ్యింది. ఈ సమావేశం అంతా అల్లు అర్జున్ సినిమా కోసమే అని సమాచారం . అంతేకాదు బన్నీ బర్త్ డే గిఫ్ట్ గా ఏప్రిల్ 7 తన ప్రాజెక్ట్ ని అధికారికంగా అనౌన్స్ చేయనున్నట్లు టాక్.

పుష్ప2′ తర్వాత బన్నీ ప్రాజెక్ట్ ఏంటి :

పుష్ప 2 (pushpa 2) తర్వాత బన్నీ కి వరుస ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అట్లీ(Atlee )కంటే ముందు స్టార్ డైరెక్టర్స్ త్రివిక్రమ్(Trivikram ), సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy Vanga ) తో సినిమాలకు సైన్ చేశాడు. ఈ రెండు సినిమాలకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా ఎప్పుడో వచ్చేసింది. అయితే ఈ ముగ్గురు డైరెక్టర్లల్లో బన్నీ ఎవరితో ముందు మూవీ చేస్తాడన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టాపిక్. సందీప్ రెడ్డి వంగాతో ఇప్పట్లో సినిమా చేసే ఛాన్స్ లేదు.

ఎందుకంటే సందీప్ ప్రస్తుతం ప్రభాస్ (Prabhas )తో ‘స్పిరిట్’ (Spirit ) చేసే ప్లాన్ లో ఉన్నాడు. ఈ సినిమా తర్వాత ‘యానిమల్(Animal ) సీక్వెల్ పైనే సందీప్ దృష్టి పెట్టాడు. ఇక త్రివిక్రమ్ ప్రస్తుతం ‘గుంటూరు కారం’ (Gunturukaraam )ఫ్లాప్ తో నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో చేయాలో తెలియక కన్ఫ్యూషన్ లో ఉన్నాడు. బన్నీ కూడా ప్రస్తుతం గురూజీతో మూవీ చేయడానికి ఆసక్తి గా లేడనేది టాక్. అంటే ‘పుష్ప2’ తర్వాత బన్నీ అట్లీ తో సినిమా చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

Leave a Comment