Sai Pallavi : సాయిపల్లవిని రిజెక్ట్ చేసిన స్టార్ హీరో !

website 6tvnews template 2024 03 21T111457.275 Sai Pallavi : సాయిపల్లవిని రిజెక్ట్ చేసిన స్టార్ హీరో !

నేచురల్ బ్యూటీ సాయి పల్లవి (Sai Pallavi)కి సౌత్ లో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అభిమానులుఈ బ్యూటీని లేడీ పవర్ స్టార్ అని పిలుస్తుంటారు. సాయి పల్లవి యాక్టింగ్, డాన్స్ కు ఫిదా కానీ ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఈ మలయాళ ముద్దుగుమ్మ తెలుగులో నటించిన మొదటి సినిమా ఫిదా (FIda). తొలి సినిమాతోనే ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. ఆతర్వాత బ్రేక్ లేకుండా టాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతోంది సాయిపల్లవి.

ఆచితూచి సినిమాలను ఎన్నుకుని తన పెర్ఫార్మెన్స్ తో కొద్దికాలంలోనే స్టార్ హీరోయిన్ గా మారిోయింది. స్టార్ హీరో సినిమా అయినా సరే తన క్యారెక్టర్ కు ప్రాధాన్యత ఉంటేనే సరే అంటుంది. లేదంటే సైలెంట్ గా నో చెప్పేస్తుంటుంది. సాయి పల్లవితో సినిమా చేయడానికి టాలీవుడ్ లో ప్రతి హీరో ఎదురుచూస్తుంటాడు. మేకర్స్ కూడా ఆమెకు అదిరిపోయే ఆఫర్స్ ఇస్తుంటారు. అయితే ఇదిలా ఉంటే సాయి పల్లవి చాలా సినిమాలను రిజక్ట్ చేసింది. కానీ మొదటిసారిగా సాయి పల్లవిని టాలీవుడ్ కు చెందిన ఓ స్టార్ హీరో రిజెక్ట్ చేశాడు. ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సాయిపల్లవికి నో చెప్పిన రౌడీ బాయ్ :

కోట్ల రూపాయల పారితోషకం ఇస్తామని మేకర్స్ ఆఫర్ చేసిన ఇప్పటి వరకు ఏ సినిమాలో రొమాంటిక్, గ్లామర్ పాత్రలను చేయలేదు సాయిపల్లవి(Sai Pallavi) . అది స్టార్ హీరో సినిమా అయినా సరే సింపుల్ గా నో చెప్పేస్తుంది. ఈ విషయం టాలీవుడ్ లో అందరికీ తెలిసిన విషయమే. అలాంటి సాయిపల్లవికి తెలుగు స్టార్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)నో చెప్పాడు. తన మూవీలో ఆమెను తీసుకోవడానికి విజయ్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. లేటెస్టుగా విజయ్ చేసిని ఫ్యామిలీ స్టార్ (Family Star) మూవీలో మృణాల్ ఠాకూర్ కంటే ముందుగా సాయిపల్లివినే హీరోయిన్ గా తీసుకోవాలని మేకర్స్ అనుకున్నారు. ఆ క్యారెక్టర్ ఎంతో ట్రెడిషనల్ గా ఉన్నప్పటికీ సాయిపల్లవి వద్దని విజయ్ చెప్పాడంట. దీంతో మేకర్స్ మృణాల్ ఠాకుర్ (Mrunal Thakur) ను హీరోయిన్ గా సెలెక్ట్ చేశారు.

అది లేకపోతే ఆ పాత్ర పండదు :

ఎంత ఫ్యామిలీ క్యారెక్టర్ చేసినా సినిమాలో ఎంతోకొంత రొమాన్స్ ఉండాలి. అది లేకపోతే ఆ క్యారెక్టర్ పండదు. దానికి గుర్తింపు రాదు. అలాంటి రొమాంటిక్ సీన్లకు సాయిపల్లవి నో చెబుతుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. అడిగి నో అనిపించుకోవడంకన్నా మనమే వద్దనుకుంటే సరిపోతుందికదా అని విజయ్ (Vijay Devarakonda)తన యూనిట్ తో అన్నట్లు టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. దీంతో సాయిపల్లవి (Sai Pallavi)వద్దని మేకర్స్ కు కూడా డిసైడ్ అయ్యారట. ఇదిలా ఉంటే ఫ్యామిలీస్టార్ మూవీలో విజయ్ దేవరకొండ-మృణాల్ (Mrunal Thakur)జంట బాగుందని అందరూ చెబుతున్నారు. మూవీ రిలీజైన తర్వా వీరి జంట ఎంతగా ఆకట్టుకుంటుందో చూడాల్సిందే.

బుజ్జితల్లిగా సాయి పల్లవి :

సాయి పల్లవి(Sai Pallavi) వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ప్రస్తుతం నాగ చైతన్య (Naga Chaitanya)కు జోడీగా తండేల్ (Thandel)మూవీ చేస్తోంది. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అప్పట్లో లవ్ స్టోరీ (Love Story)మూవీలో నాగ చైతన్య, సాయి పల్లవి కలిసి నటించారు. ఈ సినిమా ప్రేక్షకులను అలరించింది. ఇక ఇప్పుడు ఈ జోడీ రెండోసారి తెరముందు కనిపించబోతోంది. మరి ఈ సినిమా కూడా హిట్ అవుతుందని ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా విడుదల కోసం ఎదురుచూస్తున్నారు.

Leave a Comment