దేశంలో బాగా అమ్ముడవుతున్న స్కూటర్లు ఏమిటంటే..ఒక్కో స్కూటర్ ది ఒకో స్టైల్..అప్పట్లో చేతక్ దే హవా..
సంపన్న కుటుంబాలకు రవాణా కోసం వివిధ రకాల కార్లు ఉంటాయి, వాళ్ళ రేంజ్ ను బట్టి అంబాసిడర్ దగ్గరనుండి రోల్స్ రాయిస్ వరకు వాడేవారున్నారు.
అయితే మధ్యతరగతి వారికి మాత్రం రెండే రెండు అందుబాటులో ఉంటాయి. వాటిలో మానవ శక్తితోనే నడిచే సైకిల్ ఒకటయితే, ఇంధన శక్తి తో నడిచే ద్విచక్ర వాహనం రెండవది.
ఈ ద్విచక్ర వాహనాల్లో కూడా ఇప్పుడు అనేక రకాలు వచ్చాయి కానీ ఒకప్పుడు చుస్తే రెండు మూడు రకాలు మాత్రమే ఎక్కువగా వాడుకలో ఉండేవి.
బులెట్ బండి, రాజ్ దూత్, హీరో హోండా వంటివి లిమిటెడ్ గా కనిపించేవి. అయితే వీటితోపాటు ఎక్కువగా కనిపించే వాహనం స్కూటర్.
ఇది పక్కా మిడిల్ క్లాస్ వెహికల్ అని చెప్పాలి. కొంతమంది స్టూడెంట్స్ కాలేజ్ కి కూడా దీనిపైనే వెళ్లేవారు. కాలం మారుతున్న కొద్దీ మోడల్ లో మార్పులేమైనా వచ్చాయేమో కానీ సామాన్య మధ్య తరగతి వారికి దగ్గర ఉండే స్కూటర్ స్థానంలో వేరే వెహికల్ మాత్రం రాలేదు.
కాకపొతే బజాజ్ కంపెనీ విడుదల చేసిన చేతక్ స్కూటర్ బదులుగా ఆటో స్టాట్ పద్దతిలో అనేక రకాల టూ వీలర్ స్కూటర్లు స్కూటీలు వచ్చేశాయి.
ప్రస్తుతం ఈ స్కూటర్లు స్కూటీలలో కూడా అనేకమైన మోడళ్ళు హల్ చల్ చేస్తున్నాయి. కానీ వాటిలో కొన్ని మోడళ్ళు మాత్రమే ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. మరి వెహికల్ లవర్స్ ఇంకా మిడిల్ కాస్ పీపుల్ మనసు గెలుచుకున్న ఆ స్కూటర్ల డీటైల్స్ ఏమిటో చూద్దాం రండి.
They knew this very well in the 80s:
వాటి గురించి తెలుసుకునే ముందు అసలు స్కూటర్ అనే పదం చెప్పగానే ఎనభైల దశకంలో టీనేజర్స్ కి కిడ్స్ కి గుర్తొచ్చే వెహికల్ బజాజ్ చేతక్.
ఈ స్కూటర్ మీదనే వాళ్ళ నాన్న గారితో కలిసి షికారుకు వెళ్లడమో, లేదంటే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ డాడీ స్కూటర్ చూసి ఇంట్లో వాళ్ళ డాడీని కూడా స్కూటర్ కొనమని మారం చేయడమో జరిగేవి.
పైగా డెబ్భై ఎనభైల్లో పుట్టిన వారు అనేక మంది ఈ స్కూటర్ పైనే రైడింగ్ నేర్చుకున్న వారు ఉన్నారంటే ఆశ్చర్యం లేదు. ఈ స్కూటర్ తరవాతనే ఏ బైక్ అయితే నడిపేందుకు ధైర్యం చేసేవారు.
అసలు ఈ స్కూటర్ ను ఈ మోడల్ లో తయారు చేసింది ఆసవారికోసమని కాకపొతే అది అందరికి పనికొచ్చేలా ఉండటం తో కేవలం ఆడవారే కాక కాలేజ్ కి వెళ్లే కుర్రాళ్ళు, ఉద్యోగాలకు వెళ్లే ఎంప్లాయిస్ అందరు దీనికే ఓటు చేశారు.
పైగా ప్పట్లో కొత్తగా పెళ్ళైన అల్లుళ్ళకి బహుమానం క్రింద మామగారు తప్పక స్కూటర్ కొని ఇవ్వాల్సి వచ్చేది. అది స్కూటర్ మహిమ.
అటువంటి స్కూటర్ గురించి కొన్ని డీటైల్స్ చూద్దాం. బజాజ్ చేతక్ స్కూటర్ 1980 మోడల్ గురించి చుస్తే ఇది 145.5 cc 2-స్ట్రోక్ ఇంజన్ తో ఉండేది.
దీని ఆయిల్ ట్యాంక్ లో 6.5 లీటర్ల పెట్రోల్ పడుతుంది ట్యాంక్ ఫుల్ చేస్తే. ఇక మిడిల్ క్లాస్ వారు ఎక్కువగా చూసేది మైలేజ్, మరి మైలేజ్ గురించి చెప్పకపోతే ఎలా, దేని మైలేజ్ 60 కిలేటర్లు లీటర్ కి.
నాణ్యత లో మెరుగ్గా ఉంటూ సరసమైన ధరకు దొరుకుతూ ఉండేది. అప్పట్లో దీని క్రేజ్ యమాగా ఉండేది.
Electric in Chetak:
ప్రస్తుతం బజాజ్ చేతక్ కంపెనీ వారు ఒక కొత్త మోడల్ ను ప్రవేశ పెట్టారు. బజాజ్ కంపెనీ 1972 లో బజాజ్ చేతక్ స్కూటర్ ను మొదలు పెట్టింది, అయితే దానికి కొనసాగింపుగా ఈ బజాజ్ చేతక్ ఎలెక్ట్రిక్ స్కూటర్ ను అందుబాటులోకి తెచ్చింది.
అప్పట్లో వచ్చిన బజాజ్ చేతక్ స్కూటర్ కి మాదిరిగానే ఈ బజాజ్ చేతక్ ఎలెక్ట్రిక్ స్కూటర్ కి కూడా మంచి ఆదరణ దక్కింది. దీనికి 3.8 కిలోవాట్స్ బ్యాటరీ ఉంటుంది.
ఒకసారి గనుక ఫుల్ ఛార్జింగ్ చేస్తే 95 కిలోమీటర్ల వరకు పరుగులు పెట్టగలడు. ఇందులో ఉన్న 4.4 కిలోవాట్స్ విద్యుత్ మోటార్ వల్ల 65 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడానికి వీలవుతుంది.
ఇందులో స్మార్ట్ టచ్ డిస్ ప్లే ఉదయమే కాకుండా రివర్స్ మోడ్ కూడా అందుబాటులో ఉంది. అన్నిటికి మించి ఒక మిడిల్ క్లాస్ పర్సన్ చూసేది ధర, కాబట్టి దీని ధర గురించిన వివరాలు చూస్తే ఇది 1.31 లక్షల రూపాయల నుండి మొదలవుతుంది.
బజాజ్ చేతక్ కన్నా ముందు అచ్చగా అటువంటి మోడల్ మరొకటి అందుబాటులోఉండేది అదే బజాజ్ వెస్పా స్కూటర్. అయితే దీని ధర బజాజ్ చేతక్ కన్నా కాస్త ఎక్కువే అన్నట్టు తెలుస్తోంది.
కానీ ఇది కాస్త స్టైలిష్ గా ఉండేది అని అంటారు వెహికల్ లవర్స్. ఈ బజాజ్ వెస్ప ఇటాలియన్ మోడల్ అన్నట్టు తెలుస్తోంది. ఇక ఈ వెస్పా నుండి కొత్త మోడళ్ళు అందుబాటులో ఉన్నాయి.
వివిధ రంగులలో ఉన్న ఈ ఆటో స్టార్ట్ స్కూటర్లు రోడ్లపై తెగ హల చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం బాగా ప్రజాదరణ పొందిన మోడల్స్ గురించి చూద్దాం, అవి వెస్పా LX, వెస్పా S, వెస్పా GTS, ఇంకా వెస్పా ప్రిమవేరా ఉన్నాయి.
ప్రస్తుతం ఈ వెస్పా స్కూటర్ లను పియాజియో సేల్స్ చేస్తోంది. ఇది చాలా స్టైలిష్ లుక్ ఉండటం తో ధర ఎక్కువే ఉన్నప్పటికీ దీనికే ఎక్కువ మంది ఓటు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక వీటిలో మోడల్స్ ను బట్టి ధరలు ఉన్నాయి.
ఇక ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎక్కువ గా అమ్ముడవుతున్న స్కూటర్ల వివరాలు చూద్దాం.
Honda Active 6G:
భారత దేశంలో యాక్టీవా స్కూటర్లు విరివిగా కనిపిస్తూ ఉంటాయి. ఇక దేశంలో బాగా పాపులారిటీ డిమాండ్ ఉన్న స్కూటర్లలో యాక్టీవా కూడా ఒకటి. హొండా యాక్టీవా 2020 లో 6జి ని ప్రవేశ పెట్టింది.
ఇది బలమైన శక్తివంతమైనది కావడంతో ఎక్కువ శతం మంది దీనిని ఎంపిక చేస్తున్నారు. ఇది 110 సిసి కలది, పైగా 4 స్ట్రోక్ ఇంజన్ దీని సొంతం.
పైగా దీని ఇంజన్ లో సింగల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ సౌకర్యం ఉన్నాయి. ఇక మైలేజి విషయానికి వస్తే ఇది లీటర్ కు 52 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. మన ఇండియాలో దీని ధర 76,234 రూపాయలు పలుకుతున్నట్టు తెలుస్తోంది.
Suzuki Access 125:
దీని పేరు లోనే ఉంది 125 అని అంటే ఈ సుజుకి యాక్సస్ బైక్ 125 సిసి ఇంజన్ ను కలిగి ఉంటుంది. ఇది కూడా సైగలే సిలిండర్ 4 స్ట్రోక్ ఇంజన్. దీని మైలేజి విషయానికి వస్తే ఇది లీటర్ కు 45 నుండి 50 కిలోమీటర్ల మైలేజిని ఇస్తుంది.
ఇందులో డిస్క్ బ్రేకులు కూడా ఉంటాయి. దీని మోడల్ ఆకర్షణీయంగా ఉండటంతో ఎక్కువ మంది దీనిని కొనేందుకు ఎంపిక చేసుకుంటున్నారు.
Honda Dio:
హోండా నుండి వచ్చిన ఈ మోడల్ కూడా బాగా క్రేజ్ ఎచ్చుకుంది. దీని సైజ్ కొంచం చిన్నగా ఉండటంతో దీన్ని మైంటైన్ చేయడం కూడా ఈజీగా ఉండటం వల్ల చిన్నగా ఉన్నప్పటికీ దీనిని కొనేందుకు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు.
పైగా ఇది మంచి మైలేజిని కూడా ఇస్తున్నట్టు వినియోగదారుల ద్వారా తెలుస్తోంది. దీని ఇంజన్ సిసి చుస్తే 109.05 సిసి గా ఉంది. సింగల్ సీలిండర్, 4 స్ట్రోక్ ఉండడటం తోపాటు, ఇంజన్ ఓవర్ హెడ్ కాంషాప్ట్ నిర్మాణంతో ఉంటుంది.
దీని ముందు వెనుక చక్రాలకు డ్రై డ్రిల్ల్డ్ డ్రమ్ బ్రేక్‌లు ఉంటాయి. దీని ఫుల్ ట్యాంక్ కెపాసిటీ 9 లీటర్లు కాగా లీటర్ కు సుమారు 50 కిలోమీటర్ల మైలేజి ఇస్తున్నట్టు తెలుస్తోంది.
TVS Jupiter:
మన దేశంలో ఈ టీవీఎస్ జూపిటర్ ద్విచక్ర స్కూటర్ ను కొనేందుకు కూడా ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది.
ఇది ETFI టెక్నాలజీ తో పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. పైగా ఇది మంచి మైలేజి ఇవ్వడం, ధర అందుబాటులో ఉండటం, నడిపేందుకు సౌకర్యవతంగా ఉండటం తో కొన్నవారు మరింత ఇష్టాన్ని చూపెడుతున్నారు.
దీనికి 109.7 సీసీ ఇంజన్ ఉంది. అలాగే 5 స్పీడ్ ట్రాన్స్ మిషన్ కూడా ఉంది. దీని ముందు చక్రానికి డిస్క్ బ్రేక్ ఉండగా, వెనుక చక్రానికి రియర్ డ్రం బ్రేక్ ఉంటుంది. డేటైమ్ రన్నింగ్ లైట్లు ఉండటం తోపాటు led లైట్లు ఉన్నాయి. అలాగే డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ దీని సొంతం.
ఇది మొత్తం ఆరు వేరియంట్లలో ఉన్నాయి, ధరలు కూడా వేరియంట్లను బట్టి మారుతూ ఉంటాయి. వీటి ధరలు 76,738 రూపాయల నుండి 91,739 వరకు ఉంటుంది.
Yamaha Fascino 125:
ఈ ద్విచక్ర వాహనం చూసేందుకు క్లాసిక్ గా ఉంటుంది. 125 cc ఇంజన్ తో ఉంటుంది. అలాగే ఈ ఇంజన్ సింగల్ సిలిండర్ 4 స్ట్రోక్ తో ఉటుంది.
దీనిని ముందు వెనుక రెండు చక్రాలకు డిస్క్ బ్రేకులు ఉంటాయి. హైడ్రోలిక్ ట్యూన్డ్ సస్పెన్షన్ దీని సొంతం. అలాగే దీని ఆయిల్ ట్యాంక్ కెపాసిటీ 10 లీటర్లు ఉంది.
కేవలం టౌన్ లో వరకు మాత్రమే కాకుండా దూర ప్రయాణాలకు కూడా ఇది సౌకర్యంగానే ఉంటున్నట్టు తెలుస్తోంది. పైగా ఇది లీటర్ కు 66 కిలోమీటర్ల మైలేజి ఇస్తున్నట్టు తెలుస్తోంది.
Ola S1 X:
ఇది పూర్తిగా విద్యుత్ శక్తితో నడిచే స్కూటర్, ఇది మధ్య శ్రేణి మోడల్ వాహనం. ఇంతకు మునుపు వచ్చిన మోడల్ ఓలా s కి ఇది అప్ గ్రేడ్ వర్షన్. ఇందులో 8.5 కిలో వాట్స్ శక్తివంతమైన ఇంజన్ ఉంటుంది.
దీని వేగం 0 నుండి 45 కిలోమీటర్ల వేగం పుంజుకోవడానికి 3.6 సెకన్ల సమయాన్ని తీసుకుంటుందని తెలుస్తోంది. ఇక ఇందులో 3.9 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ఉంటుంది. కాబట్టి దేనిని ఫుల్ ఛార్జ్ చేస్తే 180 కిమీ వరకు నడువగలుగుతుంది.
దీనికి ఉన్న డిజిటల్ డిస్ ప్లే లో స్పీడోమీటర్, టాకోమీటర్, బ్యాటరీ స్టేటస్ వంటి వాటి ఇన్ఫర్మేషన్ చూపెడుతుంది. అలాగే బ్లూ టూత్ కనెక్టివిటి అందుబాటులో ఉంది.
అంతే కాదు మన మొబైల్ ను దీనికి కనెక్ట్ చేసి నావిగేషన్, మ్యూజిక్ వంటి వాటికీ ఆపరేట్ చేసుకునే సౌలభ్యం కూడా ఉంటుందని తెలుస్తోంది.