Top Searched Movies in 2023: 2023లో భారతీయులు ఎక్కువగా గూగుల్ లో శోధించిన టాప్ 10 సినిమాలివే.

Top 10 movies most searched by Indians in Google in 2023.

Top Searched Movies in 2023: 2023లో భారతీయులు ఎక్కువగా గూగుల్ లో శోధించిన టాప్ 10 సినిమాలివే.

2023 లో భారతీయులు ఎక్కువ శోధించిన సినిమాలు:

  • జవాన్
  • గదర్ 2
  • ఓపెన్ హైమర్
  • ఆది పురుష్
  • పటాన్
  • కేరళ కథ
  • జైలర్
  • లియో
  • టైగర్ 3
  • వరిసు

2023లో ఎక్కువ వెతికినా సినిమా అంశాలను పరిశీలిస్తే అందులో జవాన్ మొదటి స్థానంలో ఉంది.
టాప్ 3 లో జవాన్, గదర్ 2, ఓపెన్ హైమర్ ఉన్నాయి.

ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా నాలుగవ స్థానంలో నిలిచింది. అంతటి విజయాన్ని సాధించనప్పటికి ఈ సినిమాని ప్రేక్షకులు ఆసక్తిగా వెతికారు. ఈ శోధనల్లో ఆదిపురుష్ వివాదంలో చిక్కుకోవడం ప్రేక్షకులకి మరో ఆసక్తికరమైన అంశం.

ఇక రజినీకాంత్ నటించిన జైలర్ కూడా ఈ టాప్ 10 లో స్థానాన్ని సంపాదించుకుంది.సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ నటించిన టైగర్ 3 ఈ ఏడాది ప్రేక్షకులు వెతికిన సినిమాల్లో టాప్ 10 లో నిలిచింది.కేరళ కథ ఈ టాప్ 10లో ఒకటిగా నిలిచి అందరినీ ఆశ్చర్య పరిచింది.

విజయ్ నటించిన లియో మరియు వరిసు ఈ శోధనల్లో ఒకటిగా నిలిచాయి. ఒకే ఏడాదిలో ఒక హీరో నటించిన రెండు సినిమాలను ప్రేక్షకులు ఇంతగా శోధించడం మామూలు విషయం కాదు. ఈ ఘనత విజయ్ మరియు షారూఖ్ ఖాన్ లకు మాత్రమే దక్కుతుంది.

ఈ సంవత్సరం ప్రేక్షకులు ఎక్కువగా వెతికినా సినిమాలలో గాదర్ 2 ఉంది. ఈ సినిమా ఒక హిందీ యాక్షన్ సినిమా. ఇంతకు ముందు వచ్చిన గడర్ ఏక ప్రేమ కథ కి ఇది దజీ కథా కంటిన్యూయస్ అంటూ మొదలవుతుంది. ఇండో పాకిస్థాన్ యుద్దపు సన్నివేశాలు ఈ చిత్రంలో ఉంటాయి.

అనిల్ శర్మ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.భారతీయులు వెతిన కినిమాల్లో మూడవ సినిమా ఓపెన్ హైమర్. క్రిస్టోఫర్ నోలాన్ నుంచి వచ్చిన మరో అద్భుతం ఈ చిత్రం.

ఇదొక జీవిత కథ మరియు థ్రిల్లర్. ఇది ఆంగ్ల చిత్రమే అయినప్పటికీ భారతీయులు దీనికోసం ఎదురుచూడటం, వెతకడం విశేషం.

Leave a Comment