
Top 5 Best Selling Android Phones.
ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లు వచ్చాక ప్రపంచం తీరు మారిపోయింది అని చెప్పొచ్చు. ఇవాళ్టి రోజున మిలినియర్ మొదలుకొని మధ్యతరగతి వారి వరకు ఆండ్రాయిడ్ ఫోన్లు వాడుతున్నారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు.
అయితే మధ్యతరగతి దిగువ మధ్యతరగతి వారి దగ్గర బడ్జెట్ ఆండ్రాయిడ్ ఫోన్లు ఉంటె, సంపన్నుల వద్ద అత్యుత్తమ నాణ్యత, అనేక రకాల సౌకర్యాలు కలిగిన ఆండ్రాయిడ్ ఫోన్లు ఉంటాయి.
ఇక ప్రతుత రోజుల్లో మనం బయటకు వెళితే అనేక రకాల పేమెంట్లను కూడా ఆన్లైన్ విధానంలో చేయడం చూస్తున్నాం, కరోనా కాలం నాటి నుండి, ఆన్లైన్ ప్రెమెంట్లకు ప్రజలు అలవాటు పడ్డారు.
బ్యాంకు అకౌంట్లకు నగదు టాన్స్ఫర్ చేయడం కానీ, ఆన్లైన్ లో టికెట్లు బుక్ చేసుకోవడం కానీ, అన్నిటికి ఆండ్రాయిడ్ ఫోన్లే ఆధారమయ్యాయి.
మరి ముఖ్యంగా కరోనా సమయంలో ఆన్లైన్ లోనే కూరగాయలు, వెచ్చాలు, బట్టలు, ఎల్ట్రానిక్ సామగ్రి వంటి వాటిని కూడా కొనుగోలు చేశారు.
కాబట్టి ఆండ్రాయిడ్ ఫోన్ల వినియోగం కరోనా ముందు కన్నా కరోనా తరవాతే పెరిగిపోయిందని చెప్పొచ్చు. యాండ్రాయిడ్ ఫోన్ ల మ్మకాలు మాత్రం 2016 – 2017 సంవత్సరం నుండి ఎక్కువగా పెరిగిందని కొన్ని అభ్యాయనాలు చుస్తే తేటతెల్లం అవుతోంది.
మొబైల్ ఇంటర్నెట్ 4జి సేవలు, ఫ్రీ ఇంటర్నెట్ అనే వాటిని ఎప్పుడైతే కొన్ని కంపెనీలు ప్రజలకు అందుబాటులోకి తీసుకోచ్చాయో అప్పటి ఉంది ఆండ్రాయిడ్ ఫోన్ల అమ్మకాలు కూడా పెరిగాయి.
అయితే 2023 సంవత్సరానికి గాను ఎక్కువగా అమ్ముడు పోయిన ఆండ్రాయిడ్ ఫోన్లు ఏమున్నాయి అని తెలుసుకోవాలని ఉంటుంది చాలామందికి. కాబట్టి ఆ వివరాల్లోకి వెళదాం.
2023 లో బాగా ఎక్కువగా అమ్ముడుపోయిన ఆండ్రాయిడ్ ఫోన్లలో చుస్తే
- శాంసంగ్ గాలక్సీ M13,
- రియల్ మీ నార్ జో N55,
- iQOO Z7 Pro 5G,
- నోకియా G42 5G,
- నోకియా నార్ జో N53
శాంసంగ్ గాలక్సీ M13:

వీటిలో ముందుగా శాంసంగ్ గాలక్సీ M13 గురించి మాట్లాడుకోవాలి, సామ్‌సంగ్ గెలాక్సీ ఎం13 ను సామాన్యమైన ప్రజలను దృష్టిలో పెట్టుకుని రూపొందించారు. అందుకే దీనిని బడ్జెట్-ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ అని చెప్పొచ్చు.
ఇది 2022 వ సంవత్సరం లో విడుదల చేయబడింది. దీనికి 6.6 అంగుళాల స్క్రీన్ ఉంటుంది, ఈ స్క్రీన్ PLS LCD డిస్‌ప్లే ను కలిసి ఉంటుంది, ఇక మొబైల్ ఫోన్ లో ఎక్కువ మంది కెమెరాకి ప్రాధాన్యతను ఇస్తుంటారు.
ఒకప్పుడు ఫోటో దిగాలంటే కెమెరాలు కొనుక్కునే వారు, కానీ ఎప్పుడైతే మొబైల్ ఫోన్ లో కెమెరాలు వచ్చేశాయి మాములు కెమెరాలకు డిమాండ్ తగ్గింది అని చెప్పొచ్చు.
ఇప్పడు కెమెరాలంటే కేవలం పెళ్లిళ్లు ఫంక్షన్ లకు మాత్రమే ఉపయోగించే హై ఎండ్ హ్యాండ్ కెమెరాలు మాత్రమే చూస్తున్నాం, కానీ సాధారణంగా ఫోటోలు తీసుకోవాలంటే మొబైల్ లో ఉండే కెమెరా తోనే క్లిక్ మని ఫోటో తీసుకుంటున్నాం.
పూర్వం లో మాదిరిగా రీల్ కెమెరాలు పోయాయి, రియర్ కెమెరాలు వచ్చేశాయి. అందుకే బడ్జెట్ ఫోన్ కెమెరాల్లో కూడా వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఎక్కువ మెగా పిక్సెల్ ఉండేలా చూస్తున్నాయి కంపెనీలు.
ఇక ప్రస్తుతం చుస్తే శాంసంగ్ గాలక్సీ M13 లో 50MP ప్రధాన కెమెరా అందుబాటులో ఉంది. ఇది ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్ కలిగి ఉంటుంది, ఇక బ్యాటరీ విషయం కూడా మాట్లాడుకోవాలి.
ప్రస్తుత రోజుల్లో మొబైల్ వినియోగం ఎక్కువగా ఉంది, కాబట్టి బ్యాటరీ త్వరగా డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది, అయినప్పటికీ వినియోదారులు కోరుకునేది ఏమిటంటే రీచార్జి చేస్తే బ్యాటరీ త్వరగా ఛార్జ్ అయ్యేలా ఉండాలని కోరుకుంటారు.
శాంసంగ్ కంపెనీ ఇందులో ఆక్టా-కోర్ ప్రాసెసర్ మరియు 5000mAh బ్యాటరీని పొందుపరిచింది. దీని ప్రాసెసర్ చూసినట్లయితే ఆక్టా-కోర్ Exynos 850 గా ఉంది, దీనిలో రామ్ స్టోరేజి రెండు వేరియంట్లలో ఉంది, ఒకటి 4GB రామ్ కాగా రెండవది 6GB రామ్. ఇక ఎక్స్టర్నల్ స్టోరేజ్ చుస్తే కూడా రెండు రకాలు గా అందుబాటు లో ఉంది, 64GB
ఒకటి కాగా, 128GB స్టోరేజ్ తో మరొకటి అందుబాటులో ఉంది. ఇందులో ఫ్రంట్ కెమెరా 8 మెగా పిక్సెల్ తో ఉంది. దీని ఆపరేటింగ్ సిస్టం చుస్తే Android 12 అన్నట్టు తెలుస్తోంది.
శాంసంగ్ గాలక్సీ M13 లో ప్రధాన ఫీచర్లు చుస్తే 6.6-అంగుళాల పెద్ద డిస్‌ప్లే దీని సొంతం, పవర్‌ఫుల్ ఆక్టా-కోర్ ప్రాసెసర్ ఉంటుంది, లాంగ్-లస్టింగ్ 5000mAh బ్యాటరీ కలిగి ఉంది, పైగా Android 12 ఆపరేటింగ్ సిస్టమ్ కలిగి ఉంది.
ప్రయోజనాలు చూసుకుంటే, శాంసంగ్ గాలక్సీ M13 ది బడ్జెట్-ఫ్రెండ్లీ ధర, పెద్ద డిస్‌ప్లే తోపాటు ఆకర్షించే మంచి కెమెరా ఉంది. అయితే ఇలాంటి ఫోన్ లో డ్రా బాక్స్ ఏమి లేవా అంటే అవి కూడా ఉన్నాయి, దీని వేనుక భాగం ప్లాస్టిక్ తో ఉంటుంది.
శాంసంగ్ గాలక్సీ M13 యొక్క డిస్‌ప్లే రిజల్యూషన్ తక్కువ. అంతేకాక ఫింగర్ ప్రింట్ సెన్సార్ కాస్త నెమ్మదిగా పనిచేస్తుంది. అయినప్పటికీ తక్కువ బడ్జెట్ లో ఫోన్ చేయూసేవారికైతే ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు అంటున్నారు టెక్ నిపుణులు.
రియల్ మీ నార్ జో N55:

ఇక బడ్జెట్ ఫ్రీ లో ఉండే మరో ఫోన్ చుస్తే మనకు కనిపించేది రియల్‌మీ నార్జో ఎన్55, రియల్‌మీ నుండి 2023లో విడుదలైన మొబైల్ ఇది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.6-అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. దీని ప్రధాన కెమెరా 64మెగా పిక్సెల్ కలిగి ఉంది.
మీడియాటెక్ హీలియో జీ88 ప్రాసెసర్ తో ఇది పనిచేస్తుంది. రియల్‌మీ నార్జో ఎన్55 లో 5000mAh బ్యాటరీ కలిగి ఉంటుంది. ఇందులో రెండు రకాల రామ్ కలిగి ఉంది, 4GB రామ్ తో ఒకటి 6GB రామ్ తో మరొకటి ఉంటుంది.
స్టోరేజి విషయంలో కూడా రెండు రకాలు అందుబాటులో ఉన్నాయి. ఇంటర్నల్ స్టోరేజి లో 64GB ఒక రకమైతే 128GB తో మరో రకం అందుబాటులో ఉంది. కెమెరా విషయంలో గనక గమనిస్తే 64MP ప్రధాన కెమెరా, 8 మెగా పిక్సెల్ తో అల్ట్రావైడ్ కెమెరా ఉంది.
అంతే కాకుండా 2 మెగా పిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంది, వీటన్నిటితోపాటు, 13మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా కూడా అందుబాటులో ఉంది. ఈ 13 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో సెల్ఫీ ప్రియులు ఎంజాయ్ చేయొచ్చు అంటున్నారు టెక్ నిపుణులు.
రియల్‌మీ నార్జో ఎన్55 ;లోని ప్రధాన ఫీచర్ల గురించి చూస్తే, 6.6 అంగుళాల పెద్ద ఫుల్ HD+ డిస్‌ప్లే ఉంటుంది, 64 మెగా పిక్సెల్ ప్రధాన కెమెరాతో ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్ కలిగి ఉంటుంది. ఇక రియల్‌మీ నార్జో ఎన్55 మీడియాటెక్ హీలియో జీ88 ప్రాసెసర్ తో పనిచేస్తుంది.
5000mAh బ్యాటరీ బ్యాటరీ ఉండటం వల్ల బ్యాటరీ ఛార్జింగ్ ఎక్కువ సేపు ఉంటుంది అలాగే బ్యాటరీ త్వరగా ఛార్జ్ అయ్యే వీలుంటుంది. ఇక రియల్‌మీ నార్జో ఎన్55 Android 12 ఆపరేటింగ్ సిస్టమ్ ను కలిగి ఉంటుంది.
అయితే ఇందులో డ్రా బాక్స్ చుస్తే ఇందులో కూడా ప్లాస్టిక్ బ్యాక్ ఉంటుంది, ఈ మోడల్ లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ స్క్రీన్ దిగువన ఉంటుంది. ప్రయోజనాలు ఎలా ఉన్నాయో చూద్దాం, ఈ మొబైల్ లో లాంగ్-లస్టింగ్ బ్యాటరీ ఉంటుంది. మంచి కెమెరా తోపాటు పవర్‌ఫుల్ ప్రాసెసర్ ఉంది.
దీని ధర అందుబాటులో ఉంది. మధ్య-స్థాయి ధరకు మంచి ఫీచర్‌లను అందించే స్మార్ట్‌ఫోన్ కోసం ఎవరైతే ఎదురు చూస్తారో వారికి ఇది బెస్ట్ అప్షన్ అని చెప్పొచ్చు.
iQOO Z7 Pro 5G:

ఇక మరో బడ్జెట్ ఫోన్ గురించి చుస్తే మనకి ఐకూ Z7 ప్రో 5G తారసపడుతుంది. ఈ ఆండ్రాయిడ్ ఫోన్ 2023 సంవత్సరం ఆగస్టు నెలలో విడుదలైన ఫోన్ . ఒక రకంగా చెప్పాలంటే ఇది హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్ అని చెప్పొచ్చు. 120Hz రిఫ్రెష్ రేట్‌తో ఉంటుంది.
ఇందులో 6.78 అంగుళాల AMOLED డిస్‌ప్లే కలిగి ఉంది, ఇందులోని ప్రాసెసర్ చూస్తే 7200 5G మీడియాటెక్ డిమెన్సీటి ఉంటుంది, ఈ మొబైల్ లో 8GB RAM ఉండగా 128GB ఇంటెర్నల్ స్టోరేజ్ ఉంటుంది, అదే విధంగా 8GB RAM తోటే, 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో మరో వేరియంట్ కలిగి ఉంది.
ఇక బ్యాక్ కెమెరా 64 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఉంటుంది, దానికితోడు 2-మెగాపిక్సెల్ మాక్రో కెమెరా అందుబాటులో ఉంది. ఇక సెల్ఫీలను ఇష్టపడే వారికోసం16 మెగాపిక్సెల్ ఫ్రంట్-ఫేసింగ్ కెమెరా అందుబాటులో ఉంది.
ఇందులో బ్యాటరీ 5000 mAh బ్యాటరీ ఉంటుంది, అలాగే దీనిని లో ఉన్న 66W బ్యాటరీ త్వరగా ఛార్జింగ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఇక ఇందులో 3.5mm హెడ్‌ఫోన్ జాక్, స్టీరియో స్పీకర్లు ఉన్నాయి. కనెక్టివిటీ గురించి చుస్తే ఇది 5G, Wi-Fi 6, బ్లూటూత్ 5.2, NFC తో ఉంది. దీని బరువు 196 గ్రాములు ఉంటుంది.
ఇందులోని ప్రయోజనాలు చూద్దాం. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల AMOLED డిస్‌ప్లే దీని ప్రధాన ఆకర్షణ. MediaTek Dimensity 7200 5G ప్రాసెసర్ కలిగి ఉంది.
8GB RAM ఉండటం వల్ల ఫోన్ హ్యాంగ్ అయ్యే ఛాన్స్ తక్కువగా ఉంటుంది. 64-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాలు ఉన్నాయి.
ఇక ఇందులో డ్రా బాక్స్ చుస్తే ఇందులో ఇబ్బడి ముబ్బడిగా స్టోరేజ్ లేదు. వైర్‌లెస్ ఛార్జింగ్ లేదు కూడా ఇందులో లేదు. అంతేకాక నీటిని ధూళిని నిరోధించే IP రేటింగ్ లేదు.
నోకియా G42 5G:

నోకియా కంపెనీ విడుదల చేసిన ఆండ్రాయిడ్ ఫోన్లలో ఎక్కువశాతం ఫోన్లు ప్రజాదరణ పొందలేకపోయాయి అనే వదంతి ఉంది. కానీ ఈ G42 5G మోడల్ మాత్రం మంచి బడ్జెట్ ఫోన్ అనే చెప్పొచ్చు. ఇది 2023 సంవత్సరం సెప్టెంబర్ నెలలో విడుదలైంది.
ఈ ఫోన్ 6.56 అంగుళాల HD+ LCD డిస్‌ప్లే ను కలిగి ఉంది, 50MP ప్రధాన కెమెరాతో ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్ ఇందులో మనం చూడొచ్చు, స్నాప్‌డ్రాగన్ 480+ 5G ప్రాసెసర్ అందుబాటులో ఉంటుంది. అలాగే 5000 mAh బ్యాటరీ ఏ ఫోన్ సొంతం.
ఒక్కసారి దీని స్పెసిఫికేషన్లు చూస్తే, 6.56-అంగుళాల HD+ LCD డిస్‌ప్లే ఉంటుంది. 480+ 5G స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ ఉంటుంది. ఇందులో 4GB తో పాటు 64 జిబి ఇంటర్నల్ సొరెజ్ ఉంటుంది.
కెమెరా విషయానికి వస్తే 50మెగా పిక్సెల్ ప్రధాన కెమెరా, 2మెగా పిక్సెల్ మాక్రో కెమెరా, 2మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్ ఇందులో మనం చూడొచ్చు.
అయితే ఫ్రాన్స్ కెమెరా మాత్రం 8 మెగా పిక్సెల్ మాత్రమే ఉంటుంది. 5000mAh బ్యాటరీ తో పనిచేసే ఈ ఫోన్, Android 12 ఆపరేటింగ్ సిస్టం తో పనిచేస్తుంది.
ఇందులో ప్రధాన ఫీచర్లు చూసుకుంటే, 6.56-అంగుళాల HD+ డిస్‌ప్లే ఉంటుంది, ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్ తోపాటు, స్నాప్‌డ్రాగన్ 480+ 5G ప్రాసెసర్ అందుబాటులో ఉంటుంది. అలాగే ఎక్కువ సేపు కొనసాగే విధంగా 5000mAh బ్యాటరీ ఉంటుంది.
ఇందులో ప్రయోజనాలు చుస్తే, ఇది బడ్జెట్-ఫ్రెండ్లీ ధర లో ఉంటుంది. 5G కనెక్టివిటీ అందుబాటులో ఉంది. శుభ్రమైన మరియు స్టాక్ ఆండ్రాయిడ్ అనుభవం తోపాటు, బాటరీ ఎక్కువ కాలం మన్నుతుంది.
అయితే ఇందులో ఉన్న లోపాలు ఏమిటంటే ఈ మోడల్ లో డిస్‌ప్లే రిజల్యూషన్ తక్కువగా ఉంటుంది.ఇక ఇందులో ఓపో లాంగ్-రేంజ్ ఛార్జింగ్ అందుబాటులో లేదు. దీని ప్రాసెసర్ నెమ్మదిగా ఉంటుంది అని తెలుస్తోంది.
నోకియా నార్ జో N53:

రియల్‌మీ నార్జో ఎన్53 ఈ మోడల్ రియల్‌మీ కంపెనీ నుండి 2023లో రిలీజ్ చేయబడింది. ఇది కూడా బడ్జెట్ ఫోన్ కావడంతో సెల్ ఫోన్ కొనుగోలుదారులు దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.
6.6-అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లే ఉంటుంది. ఈ డిస్‌ప్లే IPS LCD తో 2400×1080 పిక్సెల్ కలిగి ఉంది. 50MP ప్రధాన కెమెరాతో ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్ దీని సొంతం. హీలియో జీ88 ప్రాసెసర్ కలిగి ఉంది. 5000mAh బ్యాటరీ ని మనం ఇందులో చూడొచ్చు.
ఇందులో స్పెసిఫికేషన్లు ఏమున్నాయంటే, 6.6-అంగుళాల ఫుల్ HD+ IPS LCD ఉంటుంది, మీడియాటెక్ హీలియో జీ88 ప్రాసెసర్ తో ఇది పనిచేస్తుంది.
ఇది 4GB రామ్ తో ఒక రకం 6GB రామ్ తో మరో రకం ఉంటుంది. ఇక ఇంటర్నల్ స్టోరేజి లో కూడా రెండు రకాలు ఉన్నాయి 64GB స్టోరేజ్ తో ఒకటి అలాగే 128GB స్టోరేజ్ తో మరొకటి ఉంటుంది.
ఇక కెమెరా చుస్తే 50MP ప్రధాన కెమెరా, 8MP అల్ట్రావైడ్ కెమెరా, 2MP మ్యాక్రో కెమెరాలను ఇందులో మనం చూడొచ్చు. వీటితో పాటు 16MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. 5000mAh తో నడిచే బ్యాటరీ ఉంటుంది. Android 12 ఆపరేటింగ్ సిస్టం దీని సొంతం.
ఇందులో లోపం ఏమైనా ఉండ అంటే అది బ్యాక్ ప్లాస్టిక్ తో ఉంటుంది. పైగా ఫింగర్‌ప్రింట్ సెన్సార్ స్క్రీన్ దిగువన ఆరెంజ్ చేయబడింది. ఇందులో బెనిఫిట్స్ చుస్తే ఇది మధ్య-స్థాయి ధరతో అందుబాటులో ఉంటుంది. పెద్ద ఫుల్ HD+ డిస్‌ప్లే దీని సొంతం.
మంచి కెమెరా కూడా ఉంది. దీని బ్యాటరీ కూడఎక్కువ కాలం మన్నుతుంది. కాబట్టి మధ్య-స్థాయి ధరకు మంచి ఫీచర్‌లను అందించే స్మార్ట్‌ఫోన్ కోసం వెదికే వారికి రియల్‌మీ నార్జో ఎన్53 మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు.