Truckers Protest on Hit and run Law: హిట్ అండ్ రన్ – హీటెక్కిన దేశంసవరించిన చట్టం ప్రకారం హిట్-అండ్-రన్’ (Hit And Run)కేసుల్లో జైలు శిక్ష ను పెంచడం పై సర్వత్రా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ వ్యవహారంలో దేశవ్యాప్తంగా డ్రైవర్లు(Drivers) తమ నిరసన(Protest) గళాన్ని వినిపిస్తున్నారు. ఇండియన్ పీనల్ కోడ్(Indian Pinal Code)
ప్రకారం ఎవరైనా ప్రమాదం చేసి ఆప్రమదం జరిగిన స్థలం నుండి పారిపోయినట్లయితే అలాగే వారు చేసిన ప్రమాదాన్ని సకాలంలో పోలీసులకు నివేదించకుండా తప్పించుకోవాలని
చూసినట్టయితే వారికి ఐపీసీ ప్రకారం 10 సంవత్సరాల జైలు శిక్ష తప్పనిసరి. అయితే బ్రిటిష్ కలం నాటి ఇండియన్ పీనల్ కోడ్ ను రద్దు చేసి కొత్త రూల్స్ ప్రకారం ఐపీసీ తో ఈ శిక్షను అమలు చేయబడుతుంది అని ప్రకటన వెలువడటంతో నిరసనలు వినిపిస్తున్నాయి.
పదేళ్లకు పెంచారు : Increased To Ten Years
ఇప్పటివరకు ఇలాంటి కేసుల్లో 2 సంవత్సరాల జైలు శిక్ష మాత్రమే విధిచేవారు. కానీ ఉన్నట్టుండి దానిని 10 సంవత్సరాలకు పెంచడం పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
ఈ విషయంలో డ్రైవర్లు కొందరు మాట్లాడుతూ, కొన్ని సార్లు ప్రమాదాలు జరిగినప్పుడు అక్కడకి చేరుకున్న ప్రజలు ఆగ్రహావేశాలకు లోనై తమపై దాడికి యత్నించిన సందర్భాలు ఉన్నాయని,
అందుకే తాము ఆ ప్రమాద స్థలినుండి వేగంగా పారిపోవాల్సి వచ్చిందని(Hit And Run) అంటున్నారు. అయితే ఇప్పుడు తీసుకొచ్చిన కొత్త నిబంధనలు డ్రైవర్లకు శరాఘాతంలా మారేలా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇలాంటి వాటి వల్ల తాము ఎక్కువ కాలం జైలు పాలవ్వడం ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోల్పోయి కుటుంబాలు వీధులపాలవ్వడం వంటివి జరుగుతాయని అంటున్నారు.
తమచేతుల్లో ఏమి లేదంటున్న డ్రైవర్లు : Drivers Says They Are Helpless
పైగా కొన్ని సార్లు ప్రమాదాలు ఎలా ఉంటాయనే విషయాలను సైతం డ్రైవర్లు వివరించారు. సీతాకాలంలో దట్టమైన పొగమంచు వల్ల ప్రమాదం జరిగితే దానిని డ్రైవర్లు ఎలా నియంత్రించగలరో చెప్పాలని నిలదీస్తున్నారు.
కన్ను పొడుచున్నా మంచుపొరల్లో9Fog) అవతల ఏముందో చెప్పలేని స్థితిలో కూడా డ్రైవర్లు డ్రైవింగ్ చేయక తప్పదని, అలంటి స్థితిలో ప్రమాదం జరిగితే పరిస్థితి తమ చేతుల్లో ఉండదని అన్నారు.
అలాంటివాటికి కూడా తమను ఏళ్ళకి ఏళ్ళు జైలు పాలు చేయడం సమంజసం కాదన్నారు. ఈ కొత్త రూల్స్ ను పూర్తిగా తొలగించాలని, లేదంటే జైలు శిక్షను బాగా తగ్గించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.
అంతేకాక అనేకమంది వాహన డ్రైవర్లు నిరసన తెలుపుతూ రోడ్డుపైకి రావడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడించి.
ఆందోళనతో నిలిచిపోయిన ట్రాఫిక్ : Traffic Was structed Due To Protests
ఈ నిరసనలు కొన్ని పట్టణాల్లో ప్రజలకు అవాంతరాలు తెచ్చిపెట్టాయి, ఆందోళనకారులు రాస్తారోకోలు చేయడంతో ట్రాఫిక్ (Traffic Jam) నిలిచిపోయింది.
దీంతో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు బస్టాండ్ లలో నిలిచిపోకతప్పలేదు. కార్ డ్రైవర్లు దగ్గరనుండి ప్రయివేటు బస్ డ్రైవర్లు(Taxi Drivers),
లారీ డ్రైవర్లు(Lorry Drivers), కొన్ని ప్రాంతాల్లో అయితే ప్రభుత్వ బస్ డ్రైవర్లు కూడా నిరసనల్లో భాగస్వాములయ్యారు. ఈ నిరసనలకు సంబంధించిన వీడియోలను స్థానిక ప్రజలు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.