ఇక్కడ సైబర్ మోసాలు కోసం ట్రైనింగ్ ఇవ్వబడును – పోలీసులు షాక్

d1b9390f f241 4cfe 9f65 d6a40dfc30a8 ఇక్కడ సైబర్ మోసాలు కోసం ట్రైనింగ్ ఇవ్వబడును - పోలీసులు షాక్

దేశం లో సైబర్ నేరాలు అరికట్టాలని పోలీసులు చూస్తుంటే ఇంకో వైపున సరి కొత్త సైబర్ మోసాలకు తెర తీస్తున్నారు సైబర్ మోసగాళ్ళు. ఇక వివరాల లోకి వెళ్తే ఇటీవల ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ పేరుతో వచ్చిన ఒక కేసు ఎంక్వయిరీ కోసం రాజస్దాన్ లో ఒక 19 సంవత్సరాల యువకుడుని విచారణ కోసం అదుపులో తీసుకున్నపుడు అతడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తో వారు రాజస్దాన్ లో బుండి, సవాయి అనే ప్రాంతాలలో ఎంక్వయిరీ చెయ్యడానికి వెళ్ళినప్పుడు పోలీసులుకి ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 500 మంది ఈ సైబర్ మోసాలు ఎలా చెయ్యాలో ట్రైనింగ్ తీసుకుంటున్నారు.

ఇందులో మైనర్లు కూడా ఉండడం తో పోలీసులు ఆశ్చర్యపోయారు. అసలు 100 మంది పట్టని ఆ చిన్న రూమ్ లో ఏకంగా 500 మంది ట్రైనింగ్ తీసుకోవడం అనేది మాములు విషయం కాదు. పైగా వీరందరికీ శిక్షణ ఇచ్చేది ఒక్కడే. రాజస్దాన్ లో BA చదివిన విద్యార్ది యోగేష్ మీనా అనే 21 సంవత్సరాల యువకుడు శిక్షణ ఇస్తునట్లు పోలీసులు ఎంక్వయిరీ లో తేలింది. ఈ యువకుడు సైబర్ మోసం చెయ్యడం శిక్షణ ఇచ్చి మళ్ళి వీరినే టెలి కాలర్లు గా మాట్లాడించి సైబర్ మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు చెప్పారు.

అందుకోసం వీరికి రోజూ ఒక గంట పాటు ట్రైనింగ్ ఇస్తాడని పోలీసులు చెప్పారు. అంతే కాదు ఈ సైబర్ క్లాసులకు మైనర్ లు కుడా వస్తున్నారని పోలీసులు చెప్పారు.ఇప్పటికే వీరు 100 కు పైగా సైబర్ మోసాలు చేసారని ఇప్పడు వీరిందరినీ కస్టడి లోకి తీసుకుని ఎంక్వయిరీ చేస్తున్నామని మాకు వచ్చే కంప్లైంట్ ప్రకారం వీరితో సంబందం ఉన్నవాళ్ళని అరెస్ట్ చేస్తామని పోలీసులు చెప్పారు.

Leave a Comment