Trains canceled due to maintenance work : విజయవాడ వెళ్లే రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్

website 6tvnews template 69 Trains canceled due to maintenance work : విజయవాడ వెళ్లే రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్

Trains canceled due to maintenance work: దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) విజయవాడ(Vijayawada) డివిజన్ అధికారులు ఒక కీలక ప్రకటన చేశారు. విజయవాడ మార్గం లో వెళ్లే కొన్ని రైళ్లను పూరిగా రద్దు చేయగా, కొన్నిటిని పాక్షికంగాను మరికొన్నిటిని దారి మళ్లించి నడిపిస్తున్నట్టు గాను పేర్కొన్నారు.

అయితే ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణాలను కూడా వారు తెలిపారు. ఈ మార్గంలో రైలు పట్టాలకు మరమ్మత్తులు, నిర్వహణ కారణాల దృష్ట్యా రైళ్ల రాకపోకల విషయంలో మార్పులు చేర్పులు చేశామని అన్నారు.

ఇక దారి మళ్లించిన రైళ్లు, పాక్షికంగా రద్దైన రైళ్లు, పూర్తిగా రద్దు చేయబడిన వివరాలకు కూడా తెలిపారు. ఈ వివరాలను వెల్లడించడం ద్వారా ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవడం లేదంటే ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడానికి వీలవుతుంది.

train fes 0 sixteen nine Trains canceled due to maintenance work : విజయవాడ వెళ్లే రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్

దారి మళ్లించిన రైళ్లు : Trains Rout Changes

ఇక దారి మళ్ళించబడ్డ రైళ్ల వివరాలు చుస్తే, విజయవాడ, భీమవరం(Bhimavaram), నిడదవోలు(Nidadavolu) మధ్య నడిచే రైళ్ల ను మార్గం మళ్లించారు, వాటి వివరాలు చూస్తే దారి మళ్లింపు యర్నాకుళం(Yarnakulam) నుండి పాట్నా(patna) వెళ్లే 22643 నెంబర్ గల రైలు ఈ నెల 29, ఫిబ్రవరి 5, 12, 19 తేదీల్లో మార్గాన్ని మళ్లిస్తారు, భావనగర్‌(Bhavanagar) నుండి కాకినాడపోర్ట్‌(Kakinada Port) వెళ్లే 12756 నెంబర్ గల రైలు ఫిబ్రవరి 3, 10, 17, 24 తేదీల్లో దారి మళ్ళించబడుతుంది, బెంగళూరు(Banglore) నుండి గౌహతి(Gowhathi) వెళ్లే 12509 నెంబర్ ట్రైన్ ఈ నెల 31, ఫిబ్రవరి 2, 7, 9, 14, 16, 21, 23 తేదీల్లో మరో మార్గంలో వెళుతుంది, ఛత్రపతి శివాజీ టెర్మినస్‌ నుండి భువనశ్వర్‌(Bhuvaneswar) 11019 నెంబర్ గల రైలు ఈ నెల 29, 31 ఫిబ్రవరి 2, 3, 5, 7, 9, 10, 12, 14, 16, 17, 19, 21, 23, 24 తేదీల్లో దారి మళ్ళించబడుతుంది, అలాగే 13351 నెంబర్ గల ధన్‌బాద్‌(Dhanbad)- అల్లపూజ రైలు ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి 25వ తేదీ వరకు దారి మళ్ళించబడుతుంది, టాటా(Tata) – యశ్వంత్‌పూర్‌(yashvanthpur) వెళ్లే 18111 నెంబర్ గల ట్రైన్ కి ఫిబ్రవరి 1, 8, 15, 22 తేదీల్లో మార్గం మళ్లిస్తారు, 22837 నెంబర్ గల రైలు హతియా(Hatiya) నుండి -బెంగళూరు కి వెళుతుండగా దీనిని ఫిబ్రవరి 3, 10, 17, 24 తేదీల్లో దారి మళ్లిస్తారు, హతియా నుండి -బెంగళూరు వెళ్లే 12835 నెంబర్ గల రైలు ఈ నెల 30, ఫిబ్రవరి 4, 6, 11, 13, 18, 20, 25 తేదీల్లో దారి మల్లించబడుతుంది, ఇక ఆఖరుగా 12889 నెంబర్ ట్రైన్ టాటా-బెంగళూరు వెళుతుంది దీనిని ఫిబ్రవరి 2, 9, 16, 23 తేదీల్లో దారి మళ్లించి నడుపుతారు.

Cancelled Trains Deatails :

రద్దు చేయబడిన రైళ్ల వివరాలు చుస్తే .. 17239/17240 గుంటూరు(Guntur) నుండి విశాఖపట్నం వెళ్లే రైళ్లు, 07977, 07978విజయవాడ బిట్రగుంట(Bitragunta) రైలు, 17219/ 17220 మచిలీపట్నం(Machilipatnam) నుండి విశాఖపట్నం(Vishakhapatnam) వెళ్లి వచ్చే రైలు, 17243 / 17244 గుంటూరు నుండి రాయగడ(Rayagada) మధ్య నడిచే రైళ్ళు ఈ నెల 29వ తేదీ నుంచి ఫిబ్రవరి 25 వరకు రద్దు చేయబడ్డాయి.

విజయవాడ రామవరప్పాడు(Ramavarapadu) మధ్య ఈ నెల 29వ తేదీ నుంచి ఫిబ్రవరి 25 వరకు పాక్షికంగా రద్దైన రైళ్ల వివరాలు చుస్తే మచిలీపట్నం నుండి విజయవాడ వెళ్లే 07896 నెంబర్ రైలు, విజయవాడ నుండి మచిలీపట్నం వెళ్లే 07769 నెంబర్ రైలు, విజయవాడ నుండి నర్సాపూర్‌(Narsapur) వేళ్ళు 07863 నెంబర్ రైలు, విజయవాడ నుండి మచిలీపట్నం వరకు వెళ్లే 07866 నెంబర్ రైలు, మచిలీపట్నం నుండి విజయవాడ వెళ్లే 07770 నెంబర్ రైలు, విజయవాడ – భీమవరం జంక్షన్‌(Bhimavaram Juntion) మధ్య నడిచే 07283 రైలు, మచిలీపట్నం – విజయవాడ మధ్య నడిచే 07870 నేబర్ రైలు, విజయవాడ – నర్సాపూర్‌ స్టేషన్ల మధ్య నడిచే 07861 నెంబర్ రైళ్లు పాక్షికంగా రద్దు చేయబడ్డాయి.

Leave a Comment