Trains canceled in Vijayawada Railway Division: రైలు ప్రయాణికులు ఏ రైళ్లు రద్దు అయ్యాయో తెలుసా.. ఏ రైళ్లు ఆలస్యం కాబోతున్నాయో తెలుసా.

Trains canceled in Vijayawada Railway Division

Trains canceled in Vijayawada Railway Division: రైలు ప్రయాణికులు ఏ రైళ్లు రద్దు అయ్యాయో తెలుసా.. ఏ రైళ్లు ఆలస్యం కాబోతున్నాయో తెలుసా.

ఆంధ్ర ప్రదేశ్ లోని రైలు ప్రయాణికులకు ఇది ముఖ్య గమనికే అని చెప్పాలి. ఎందుకంటే ఈ నెలలో కొన్ని రైళ్లు రద్దు కానుండగా మరి కొన్నింటిని దారి మళ్లించనున్నారు.

మరి కొన్ని నిర్దిష్ట సమయంకన్నా ఆలస్యంగా బయలు దేరనున్నాయని, మరి కొన్ని మార్గ మధ్యంలో కొంత సమయం పాటు నిలిచిపోనున్నాయి.

అయితే ఆ రైళ్లు ఎందుకు నిలిచిపోనున్నాయి, మార్గం మళ్ళించబడ్డ రైళ్ళు ఏవి, మార్గ మధ్యంలో ఆలస్యం కానున్న రైళ్లు ఏవి అనే వివరాలు చూద్దాం. వాల్తేర్‌ డివిజన్‌ రాయగడ-విజయనగరం సెక్షన్‌లో పలు చోట్ల భద్రతా పరమైన ఆధునికీకరణ పనులను అధికారులు చేపడుతున్నారు. ఈ భద్రతాపరమైన పనులు

చేప్పట్టడం వల్ల పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు కొన్నింటిని దారి మళ్లించనున్నట్లు వాల్తేర్‌ డివిజన్ సీనియర్‌ డీసీఎం అధికారి పేర్కొన్నారు. ఈ నెల 19వ తేదీన విశాఖ-రాయగడ పాసెంజర్ ను, 20వ తేదీన రాయగడ-విశాఖ పాసెంజర్ ను రద్దు చేయనున్నారు,

ఇదే 20వ తేదీన విశాఖ-కొరాపుట్‌-విశాఖ, విశాఖ-కొరాపుట్‌, పాసెంజర్ స్పెషల్ ట్రైన్ లను రద్దు చేయనున్నట్టు తెలిపారు. ఇక 21వ తేదీన చుస్తే కొరాపుట్‌-విశాఖ పాసెంజర్ రైలును కూడా రద్దు చేసినట్లు చెప్పారు.

ఇక ఆలస్యంగా నడవనున్న రైళ్ల వివరాలు చుస్తే, ఎర్నాకుళం-టాటా ఎక్స్ ప్రెస్ మార్గమధ్యలో 2గంటలు నిలిచిపోనుంది. అల్పూజా నుండి ధన్‌బాద్‌ వెళ్ళు బొకారో ఎక్స్ ప్రెస్ గంట పాటు నిలిచిపోనున్నట్లు తెలిపారు.

మరో వైపు ఖుర్ధా రోడ్‌ డివిజన్‌ కిషన్‌గంజ్‌-నెరగుండి స్టేషన్ల మధ్య ఆర్‌వోబీ పనులను చేపట్టారు. దీంతో ఈనెల 15వ తేదీన ఎస్‌ఎంవీ బెంగళూరు నుండి హౌరా వెళ్లే ఎక్స్ ప్రెస్ రైలు 3 గంటలు ఆలస్యంగా బయలుదేరుతుందని చెప్పారు.

ఇక 16వ తేదీన హౌరా నుండి సికింద్రాబాద్‌ వెళ్ళు ఫలక్ నామ ఎక్స్ ప్రెస్ రైలు 2 గంటల.30 నిముషాలు ఆలస్యంగా బయలు దేరుతుందన్నారు. కేవలం వాల్తేరు డివిజన్ లో మాత్రమే కాక గుంతకల్‌ డివిజన్‌లో కూడా భద్రతా పరమైన పనులను చేపడుతున్నారు.

దీంతో ఈ డివిజన్ లోని కొన్ని రైళ్ల వేళల్లో మార్పులు చేర్పులు చోటుచేసుకున్నాయి. ఈ నెల 18వ తేదీన యశ్వంత్‌పూర్‌ నుండి పూరీ వేళ్ళు ఎక్స్ ప్రెస్ రైలు సాధారణంగా వెళ్లే మార్గం లో కాకుండా గుత్తి ఫోర్ట్‌, ఎర్రగుంట్ల మీదుగా నడవనుంది.

ఇక ఇదే రోజున డోన్‌ హాల్ట్‌ను రద్దు చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ మధ్య కాలంలో చోటుచేసుకున్న రైళ్ల ప్రమాదాలను దృషిటిలో పెట్టుకునే ఈ భద్రతా పరమైన పనులకు రైల్వే శాఖా ఉపక్రమించి ఉంటుందని ప్రజలు భావిస్తున్నారు.

కేవలం కొన్ని రైళ్లు ఆలస్యం అయినా, కొన్ని రైళ్లు రద్దు చేసినా, కొన్ని రైళ్లు మార్గం మళ్లించినా, భవిష్యత్తులో ఎటువంటి ప్రమాదాలు పునరావృతం కాకూడదని భావిస్తున్నారు.

Leave a Comment