హైదరాబాద్ కు వచ్చే రైళ్ళు ఆలస్యం కావు – త్వరలో మరో స్టేషన్ అందుబాటు లోకి

6030 new railway terminal Cherla హైదరాబాద్ కు వచ్చే రైళ్ళు ఆలస్యం కావు - త్వరలో మరో స్టేషన్ అందుబాటు లోకి

నగరానికి తనలమానికంగా బావించే మరొక రైల్వే స్టేషన్ మరి కొద్ది రోజుల్లో ప్రారంభం కావడానికి సిద్దం అయ్యింది అదే చర్లపల్లి రైల్వే స్టేషన్. అప్పుడెప్పుడో నిజాం కాలం నాటి 3 స్టేషన్ లు కాచీగూడ,నామ్ పల్లి, సికింద్రాబాద్ స్టేషన్ లు మీదే ఆధారపడిన నగర ప్రజలు ఈ 3 స్టేషన్ లేనా అనే స్ధితి నుండి ఇప్పుడు 4 స్టేషన్ లు అనే చెప్పుకునే స్దాయికి చేరుకున్నాం అని చెప్పుకోవడానికి ఇప్పుడు మరొక రైల్వే స్టేషన్ రెడీ అయ్యింది అదే చర్ల పల్లి రైల్వే టెర్మినల్ స్టేషన్ ఇంకొద్దు రోజుల్లో అందుబాటు లోకి రానుంది. అక్కడ జరుగుతున్న నిర్మాణ పనులు అన్ని దాదాపు పూర్తి కావచ్చాయి.

ఇప్పుడు 6 రైళ్ళను అక్కడ నిలుపుతుండగా మరి కొన్న ఆపడమే కాదు ఎకంగా అక్కడ నుండి బయలుదేరాల రైల్వే బోర్డు సన్నాహాలు చేసింది అలాగే రైల్వే బోర్డ్ ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సనత్ నగర్ – మౌలాలి స్టేషన్ ల మద్య రెండవ లైన్ కూడా రెడీ అవ్వడం తో ఇక మీదట నగరం మీదుగా వెళ్ళే రైళ్ళను బైపాస్ చేయడం కోసం ఇపుడు ఈ చర్ల పల్లి రైల్వే టెర్మినల్ స్టేషన్ ఎంత గానో ఉపయోగపడుతుంది.

ఈ నెలాఖరుకు ఈ చర్ల పల్లి రైల్వే టెర్మినల్ స్టేషన్ పూర్తి స్దాయిలో పనిచెయ్యడానికి రైల్వ బోర్డు అధికారులు ప్రణాలికలు సిద్ధం చేస్తున్నారు.ఈ చర్ల పల్లి టెర్మినల్ రైల్వే స్టేషన్ అందుబాటు లోకి వస్తే ఇకమీదట రైళ్ళ ఆలస్యం కాకుండా చెయ్యవచ్చు అని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు భావిస్తున్నారు.ఈ అత్యాధునిక చర్ల పల్లి టెర్మినల్ రైల్వే స్టేషన్ ప్రయాణికుల కు అవసరమైన అన్ని రకాల సౌకర్యాలను పొందేలా దాదాపు 430 కోట్ల అంచాన వ్యయం తో అనేక వసతులు కూడా కల్పిస్తున్నామని రైల్వే బోర్డు అధికారులు ఒక ప్రకటన విడుదల చేసారు.

ఇది వరకు ఇక్కడ 2 ప్లాట్ ఫామ్ లు 3 రైల్వే లైనులు గా ఉన్న ఈ చర్ల పల్లి లో ఇప్పుడు 9 ప్లాట్ ఫామ్ లు ఏర్పాటు చేసారు. ఇప్పుడు 24 బోగీలు ఫ్లాట్ ఫామ్ కు సరిపోయేలా 5 ప్లాట్ ఫామ్ అందుబాటు లోకి తీసుకువచ్చారు. దీనికి అనుసందానం గా మరో 4 ఎత్తయిన ప్లాట్ ఫామ్ లు కుడా నిర్మిస్తున్నారు.పాదచారులు నడవడానికి సౌకర్యం గా ఉండడానికి 12 మీటర్ల వెడల్పుతో ఒక వంతెన ఏర్పాటు చేస్తుండగా, 6 మీటర్ల వెడల్పు తో ఇంకొక వంతెనను అధికారులు సిద్దం చేస్తున్నారు.

ఇప్పుడు ఏర్పాటు చేసిన 9 ప్లాట్ ఫామ్ లలో అందరికి అందుబాటు లో ఉండే విధం గా ఎస్కలేటర్లను , లిఫ్ట్ లను నిర్మించారు. ఇక్కడ మొత్తం 7 లిఫ్ట్ లు, 6 ఎస్కలేటర్లు ప్రయాణికులకు నిత్యం అందుబాటు లో ఉండేలా ఏర్పాటు చేసారు.ఇక్క కోచ్ నిర్వహణ వ్యవస్ధ ను కూడా అందుబాటులోకి తీసుకొస్తారు. జంట నగర ప్రజలు అను నిత్యం ప్రయాణం చెయ్యడం కోసం ఉపయోగించే MMTS ఎలాంటి అవరోధం రాకుండా 2 ప్లాట్ ఫామ్ లు నిర్మిస్తున్నారు. ప్రయానికుల సౌలభ్యం కోసం స్టేషన్ వెలుపల బస్సు బేలు , ప్రవేశ మార్గాలు, వాహనాల కోసం పార్కింగ్ స్ధలం అన్నింటిలోను ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు.

Leave a Comment