#DunkiBoxOfficeScam: ట్విటర్ లో ట్రెండింగ్.
టిక్కెట్లు తారుమారు:
కొన్ని సార్లు థియేటర్ యాజమాన్యం సీట్లు ఖాళీ ఉన్నప్పటికీ ఫుల్ అయినట్టుగా నటిస్తారు. ఆ మిగిలిన టిక్కెట్లను బ్లాక్ లో విక్రయిస్తారు.
హౌస్ ఫుల్ అయిందని భ్రమపడిన ప్రేక్షకులు బ్లాక్ లో అయిన తీసుకుందాం అని అసలు ధర కన్నా ఎక్కువ పెట్టి టిక్కెట్లు కొంటారు, దీనివల్ల థియేటర్ యాజమాన్యానికి అదనపు ఆదాయం తప్పుడు మార్గంలో సమకూరుతుంది.
Fake booking :
కొన్ని సార్లు టిక్కెట్లు అమ్మకం కాకపోవడం, సినిమాకి ప్రేక్షకులు రాకపోవడం వల్ల ఆ సినిమా యాజమాన్యానికి సంబందించిన వ్యక్తులే ఆన్లైన్ బుకింగ్ చేస్తారు, కానీ ఆ టిక్కెట్లను ఎప్పడూ ఉపయోగించరు.
కేవలం సినిమాకి అధిక స్థాయిలో టిక్కెట్లు కొనుగోలు అయ్యాయాయి అని నివేదికలో చూపడానికి ఇలాంటివి చేస్తారు. దీనివల్ల సినిమా ఆర్ధికంగా హిట్ అయిందని ప్రేక్షకులని నమ్మిస్తారు.
తప్పుడు ఆదాయపు లెక్కలు :
సినిమా డిస్ట్రీబ్యూటర్లు తమ సినిమా హిట్టయ్యింది అని చేప్పుకునేందుకు సినిమా ఆదాయ గణాంకాలను పెంచుకుంటారు. ఫేక్ ఫిగర్స్ తో తమ సినిమా హిట్ అని ప్రచారం చేసుకుంటారు.
Film industry :
ఇలాంటి తప్పుడు లెక్కల ద్వారా ఇండస్ట్రి అంటే నమ్మకం పోతుంది. ఇది ముందు ముందు రాబోయే పెట్టుబడిని తగ్గించే అవకాశం ఉంది.
నష్టపోయే వారు :
#DunkiBoxOfficeScam వల్ల ప్రధానంగా నష్ట పోయే వాళ్ళు ప్రేక్షకులే. తప్పుడు లెక్కల ద్వారా హిట్ అని చెప్పుకున్న సినిమాలు అంతటితో ఆగకుండా మళ్ళీ సీక్వల్ కూడా తీస్తారు,
ఇది కూడా ఫ్లాప్ లిస్ట్ లొకే వెళ్ళిపోతుంది. దీని వల్ల ప్రేక్షకులే నష్టపోతున్నారు.తప్పుడు వాస్తవ ఆదాయపు లెక్కల వల్ల కొత్త పెట్టుబడిదారులకు అవకాశాలు రావడం కష్టం అవుతుంది.
#DunkiBoxOfficeScam నుండి తప్పించుకోవాలంటే :
ప్రేక్షకులు కేవలం చిత్ర నిర్మాణ బృందం ఇచ్చిన నివేదికలే కాకుండా, ప్రేక్షకుల అభిప్రాయాలు రాసిన రివ్యూలు చూడాలి. బాక్స్ ఆఫీసు ఇచ్చిన నివేదిక మాత్రమే కాకుండా విశ్వసనీయ సోషల్ మీడియా ఏదైనా ఫాలో అవ్వాలి.
చివరిగా, సినీఇండస్ట్రి కూడా అదే విదంగా నమ్మకంగా ఉండాలి. కఠినమైన నిభంధనలు, చర్యలు అమలు చేయాలి.